India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా వద్ద శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఓ బాలుడు, ఇద్దరు మహిళలు, మరో యువకుడు ఉన్నారు. రహదారిపై భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రేపు HYD పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో సోనియా గాంధీ, ఉద్యమకారులు, అమరుల కుటుంబీకులను భాగస్వాములను చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ఉద్యమంలో KCR కీలకం కావడంతో CM రేవంత్ ఆయనకూ ఆహ్వానం పంపారు. శుక్రవారం ప్రభుత్వ ప్రోటోకాల్ ఛైర్మన్ హర్కర వేణుగోపాల్ ఇన్విటేషన్ అందించారు. మరి CM పిలుపుతో KCR వస్తారా? లేదా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.
పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ సెమిస్టర్-4 రెగ్యులర్, బ్యాక్లాగ్, సెమిస్టర్-5 బ్యాక్లాగ్ పరీక్షలను వాయిదా వేసినట్లు యూనివర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి రాజ్ కుమార్ తెలిపారు. జూన్ 6న జరిగే ఈ పరీక్షలను మే 18కి పోస్ట్ ఫోన్ చేస్తున్నట్లు శుక్రవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈ విషయాన్ని ఆయా సెమిస్టర్ల విద్యార్థులు గమనించాలని కోరారు.
వారణాసిలో కొలువుదీరిన కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ శుక్రవారం దర్శించుకున్నారు. ప్రధాని మోదీకి మద్దతుగా వారణాసిలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వెళ్లిన డీకే అరుణ ప్రచారాన్ని ముగించుకొని తిరుగు ప్రయాణంలో కాశీ విశ్వనాథని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
✓ కొత్తకోట: లారీ ఢీకొని డీసీఎం క్లీనర్ మృతి.
✓NRPT:ఎరువులు విత్తనాలు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: కలెక్టర్.
✓MBNR: రాష్ట్ర చిహ్నాల మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: మాజీ మంత్రి.
✓GHPU యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ గా కల్వకుర్తి వాసి నియామకం.
✓WNP:లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విద్యుత్ శాఖ అధికారులు.
✓ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భానుడి ఉగ్రరూపం.
వనపర్తి జిల్లాలో ముగ్గురు విద్యుత్ శాఖ అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. నేడు వనపర్తి ఎలక్ట్రిసిటీపై అనిశా అధికారులు దాడులు నిర్వహించారు. బిల్లు చెల్లించేందుకు వచ్చిన ఓ వ్యక్తి నుంచి రూ. 19వేలు లంచం తీసుకుంటుండగా ట్రాన్కో SE నాగేంద్రకుమార్, DE నరేంద్ర కుమార్, AE మధుకర్‌ను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల ఏసీబీ దాడులతో ఆయా అధికారులు భయపడుతున్నారు.
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం NH-44పై రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని డీసీఎం డ్రైవర్ ఓవర్ టేక్ చేయబోయి వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో డీసీఎం క్లీనర్ సూర్య నాయక్(21) అక్కడికక్కడే మృతి చెందాడు. ఫరూక్ నగర్ మండలం వెంకన్నగూడకు చెందిన సూర్య డిసిఎం క్లీనర్. కోళ్ల ఎరువు లోడ్‌తో హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
రాజోలికి చెందిన ఎల్లప్ప తన ఫోన్‌కు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ అంటూ వచ్చిన లింక్‌ను క్లిక్ చేశాడు. దీంతో ఆయనకు సంబంధించిన 3 క్రెడిట్ కార్డుల నుంచి డబ్బులు డ్రా అయినట్లు మెసేజులు వచ్చాయి. అలా మొత్తం రూ.2.58 లక్షలు సైబర్ నేరగాళ్లు కాజేశారు. దీంతో ఆందోళనకు గురైన ఎల్లప్ప సైబర్ పోలీసులను ఆశ్రయించారు. శుక్రవారం స్థానిక ఎస్సై జగదీశ్వర్‌ని కలిసి విషయాన్ని చెప్పారు. తెలియని లింకులపై క్లిక్ చేయొద్దని SI సూచించారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని BRS ఆఫీసులో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఎంపీ శ్రీనివాసరెడ్డితో కలిసి శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. తెచ్చుకున్న తెలంగాణను 10ఏళ్లలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ కృషి చేశారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నాల మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే వచ్చే నెల 3వ తేదీ నుంచి ఉమ్మడి జిల్లాలో ‘బడి బాట’ కార్యక్రమం చేపట్టనుంది. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులే లక్ష్యంగా ఈ ప్రోగ్రాం ఉండనుంది. MBNR జిల్లాలో 859, NRPTలో 511, NGKLలో 848, గద్వాలలో 472, వనపర్తిలో 523 పాఠశాలలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3,213 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని విద్యాశాఖ భావిస్తోంది.
Sorry, no posts matched your criteria.