India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మార్చి 28న ఎన్నిక జరగ్గా ఆటు ఆయా పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. సీఎం ఇలాక కావడంతో ఫలితాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. మొత్తం 1439 మంది ఓటర్లకు గాను 1437 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల బరిలో మన్నే జీవన్ రెడ్డి(INC), నవీన్ కుమార్ రెడ్డి(BRS) హోరాహోరీగా తలపడ్డారు. జూన్ 2న MBNRలోని బాలుర జూ. కాలేజీలో ఉపఎన్నిక కౌంటింగ్ జరగనుంది.
ప్రసవం కోసం వచ్చిన గర్భిణి బాత్రూంలోనే బిడ్డకు జన్మనివ్వడంతో పసికందు మృత్యువాత పడిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో వెలుగుచూసింది. స్థానికుల సమాచారం.. తాడూరు మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన మహేశ్వరి(26) పురిటి నొప్పులతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. ఆమె ఒంటరిగానే బాత్రూంకు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడే ప్రసవించడంతో శిశువు చనిపోయింది. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పు మరో 6 రోజుల్లో వెలువడనుంది. లెక్కింపు జూన్ 4 సమీపిస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎలాంటి తీర్పు వెలువడనుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్టీల అధినేతలతో పాటు ప్రధాన నేతల గెలుపోటములపై ఒక్కొక్కరు రూ.లక్షల్లో బెట్టింగ్ పెడుతున్నారట. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ ‘కాయ్ రాజా కాయ్’ జోరుగా సాగుతోందట.
గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసే అభ్యర్థులకు TGPSC కీలక సూచనలు చేసింది. జూన్ 9న ఉ. 10.30 నుంచి మ.1 వరకు పరీక్ష జరుగుతుందని, 10 గంటలకల్లా గేట్లు మూసేస్తామని స్పష్టం చేసింది. అభ్యర్థులు ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావొద్దని, షూస్ వేసుకోవద్దని, పరీక్ష పూర్తయ్యే వరకు బయటికి వెళ్లేందుకు కుదరదని పేర్కొంది. మెహెందీ, టాటూలు వేసుకోవద్దని.. విలువైన వస్తువుల్ని వెంట తెచ్చుకోవద్దని తేల్చి చెప్పింది.
కుక్కను తరుముతూ మరోమారు చిరుత ప్రత్యక్షమైంది. అదిచూసి భయంతో రైతులు ఇళ్లకు వెళ్లిపోయారు. కొండాపూర్‌లో ఆంజనేయులు రాత్రి పశువులకు మేత వేయడానికి వెళ్లగా తన కుక్క అరవడంతో లైట్ వేశాడు. కొద్ది దూరంలో చిరుత నిలబడి కనిపించింది. దీంతో ఆయన భయంతో పక్కనే ఉన్న కృష్ణయ్య, రాములు వద్దకు వెళ్లాడు. జరిగిన విషయాన్ని వారికి చెప్పడంతో వాళ్లు వచ్చే సరికి చిరుత కనిపించలేదు. అక్కడ ఉండకుండా ఇళ్లకు చేరుకున్నారు.
MBNR స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 28న ఉప ఎన్నిక నిర్వహించారు. మొత్తం 1,439 మంది ఓటర్లకు గానూ ఈ ఉప ఎన్నికలో 1,437 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా, ఇద్దరు ఎంపీటీసీలు ఓటు వేయలేదు. ఈ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపును జూన్ 2న చేపట్టి, అదే రోజున ఫలితాలను ప్రకటించనున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల గడువు సమీపిస్తుండటంతో ఉమ్మడి పాలమూరు జిల్లా నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ నాటి నుంచి ఎక్కడ నలుగురు కలిసినా మనం గెలుస్తున్నామా?.. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్‌లో మన అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుంది?.. మన పార్టీ హవా ఎలా ఉంది? అనే మాటలు వినబడుతున్నాయి. ఈ ఉత్కంఠ ప్రధానంగా ఎన్నికల ముందు పార్టీలు మారిన నేతల్లో అధికంగా కనబడటం గమనార్హం. కాగా ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
నకిలీ విత్తనాల ఉత్పత్తి, విక్రయంపై ఫోకస్ పెట్టాలని గద్వాల ఎస్పీ రితిరాజ్ అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై నిఘా ఉంచి, ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు అన్న విషయాలపై ఆరా తీయాలని సూచించారు. బార్డర్ గ్రామాల్లో నకిలీ విత్తనాలు సరఫరా కాకుండా పటిష్ట నిఘా ఉంచాలన్నారు.
మహబూబ్‌నగర్ ఆర్టీసీ డిపో పరిధిలోని సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వెళ్లేవారికి DM సుజాత శుభవార్త తెలిపారు. జూన్ 1 నుంచి పైన పేర్కొన్న బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి బహుమతులను ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. కావున ప్రయాణికులు తాము తీసుకున్న టికెట్ పై పేరు, ఫోన్ నంబర్ రాసి ఆర్టీసీ డ్రైవర్ వెనుకాల ఉన్న బాక్స్‌లో వేయాలన్నారు.
జూన్ 4న నిర్వహించే పార్లమెంటు ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అప్రమత్తంగా జాగ్రత్తగా నిర్వహించాలని AROలకు కలెక్టర్ రవినాయక్ సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై బుధవారం కలెక్టరేట్లో శిక్షణ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈవీఎం ఓట్ల లెక్కింపుకు ముందే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. నిర్దిష్ట సమయానికంటే ముందే లెక్కింపు కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.