Mahbubnagar

News May 28, 2024

నాగర్‌కర్నూల్: చిన్నారుల మృతి.. రీజన్ ఇదే!

image

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో దారుణం జరిగింది. నీటిగుంతలో నీళ్లు తీసుకురావడానికి వెళ్లిన 3 చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిగుంతలో పడ్డారు. చిన్నారుల అర్తనాదాలు విన్న స్థానికులు గుంత దగ్గరికి వెళ్లి ఒకరిని బయటికి తీయగా ఇద్దరు <<13332379>>చిన్నారులు<<>> మహమ్మద్ ఫుర్ఖాన్ (10) , మహమ్మద్ హుస్సేన్ (13) నీటమునిగి మృతిచెందారు. మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది.

News May 28, 2024

నాగర్‌కర్నూల్: ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి

image

నాగర్‌కర్నల్ జిల్లా బిజినేపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. నీటికుంటలో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి చెందారు. వారి మృతితో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

News May 28, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. గద్వాల జిల్లా గట్టులో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్ నగర్ జిల్లా నవాబు పేటలో 38.6, నారాయణపేట జిల్లా ఉట్కూర్‌లో 38.1, వనపర్తి జిల్లా దగడలో 37.7, నాగర్ కర్నూల్ జిల్లా జెట్‌ప్రోల్‌లో లో36.8, డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News May 28, 2024

MBNR: బడి బస్సులు నడిపేవారు ఈ నిబంధనలు పాటించాలి!!

image

✓ పాఠశాల, కళాశాల బస్సు నడిపే డ్రైవరు వయసు 60 ఏళ్ల లోపుండాలి.
✓ అయిదేళ్ల హెవీ వాహనం నడిపిన అనుభవం ఉండాలి.
✓ ప్రతి పాఠశాల బస్సుకు డ్రైవరుతో పాటు సహాయకుడిని (అటెండెంటు) నియమించుకోవాలి.
✓ బస్సుల్లోని కిటికీలకు ఇరువైపులా నాలుగు వరుసల పైపులను విద్యార్థులు తల బయటపెట్టి తొంగి చూడకుండా ఉండేలా అమర్చాలి.
✓ బస్సు కండీషన్లో ఉండటమే కాకుండా బ్రేకు వేసిన సమయంలో నాలుగు వైపులా పార్కింగ్ లైట్లు వెలగాలి.

News May 28, 2024

మహబూబ్‌నగర్‌పై అందరి దృష్టి.. గెలుపు ఎవరిది?

image

MBNR లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీ చంద్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ, బీఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో డీకే అరుణ, వంశీ చంద్ రెడ్డి మధ్య రసవత్తరమైన పోరు జరిగింది. ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కొనసాగించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలుపుకోసం తీవ్రంగా కృషి చేశారు. ఇక్కడ ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది.

News May 28, 2024

MBNR: హరితహారం కార్యక్రమానికి సిద్దమవుతున్న యంత్రాంగం

image

హరితహారం కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు హరితహారం పేరుతో తొమ్మిది విడతలుగా కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్వహించింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే తొలి విడత కానుంది. అయితే ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో మొక్కలు పెంచుతున్నారు. కాగా ఈసారి జిల్లాకు హరితహారం కింద 30.87 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు.

News May 28, 2024

MBNR: తాగి పోలీస్ బండి ఎత్తుకెళ్లాడు..!

image

మద్యం మత్తులో ఓ యువకుడు పోలీసు వాహనాన్ని అపహరించిన ఘటన గద్వాల జిల్లా ఎర్రవల్లి‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హైవే పెట్రోలింగ్ కానిస్టేబుల్ తమ వాహనాలు పక్కకు నిలిపి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో నిమగ్నమైయ్యాడు. మద్యం మత్తులో ఓ యువకుడు హల్ చల్ చేసి ఇబ్బంది పెడుతున్నాడని పక్కకు పంపించారు. తర్వాత చూస్తే పెట్రోలింగ్ వాహనం అపహరణకు గురైంది. కోదండపురం ఓ పెట్రోల్ బంక్ వద్ద సోమవారం పోలీసులు గుర్తించారు.

News May 28, 2024

మన మహబూబ్ నగర్ చరిత్ర తెలుసుకుందామా.?

image

1890 డిసెంబర్ 4రోజున పాలమూరులోని 6వ నిజాం మహబూబ్అలీ ఖాన్ పేరు మీదనే మహబూబ్ నగర్‌గా పేరు మార్చారు. మహబూబ్ నగర్ అంటే గుర్తు వచ్చేది” పిల్లల మర్రి”ఆ చెట్టు వయసు దాదాపు 800 సంవస్సరాలు, ఈ చెట్టు 4 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇక్కడ సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణ రావు, పల్లెల హనుమంత రావు, లాంటి గొప్పవాళ్లు ఉమ్మడి MBNRకి చెందిన వాళ్ళు, జిల్లాలో జరిగే అతిపెద్ద జాతర”కురుమూర్తి స్వామి”జాతర. SHARE IT

News May 28, 2024

MBNR: కొత్త రేషన్ కార్డులపై చిగురిస్తున్న ఆశలు!

image

ఉమ్మడి జిల్లాలో పదేళ్లుగా కొత్త ఆహార భద్రత (రేషన్) కార్డుల మంజూరు కాలేదు. ఏటా కుటుంబాల సంఖ్య పెరుగుతున్నా కార్డుల జారీ లేక ప్రభుత్వ పరంగా అందే సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలు దక్కక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ఊరట నిస్తోంది. గతం మాదిరి కాకుండా నిరంతర ప్రక్రియగా రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆనందం వ్యక్తమవుతోంది.

News May 27, 2024

MBNR: రంగారెడ్డి మృతి.. సీఎం రేవంత్ రెడ్డి​ సంతాపం

image

నీటి పారుదల ప్రాజెక్టుల సలహాదారుడు, రిటైర్డ్‌ ఎస్ఈ ఎన్‌.రంగారెడ్డి మృతిపై సీఎం రేవంత్​ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్‌‌నగర్​ జిల్లా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి పనులు పూర్తి చేయడానికి ఇటీవలే ఆయనను సలహాదారుగా నియమించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.