Mahbubnagar

News April 12, 2024

MBNR: కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

image

పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌కు సుమారు నెల రోజుల సమయం ఉంది. కానీ, మహబూబ్‌నగర్‌ లోక్‌సభ పరిధిలో పోరు తారస్థాయికి చేరింది. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య నువ్వా.. నేనా అన్నట్లు హోరాహోరీ రణం నడుస్తోంది. ఇరుపార్టీల అభ్యర్థులు డీకే అరుణ, చల్లా వంశీచంద్‌రెడ్డి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు, కౌంటర్లు, ప్రతి కౌంటర్లతో పాలమూరు అట్టుడుకుతోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు.

News April 12, 2024

MBNR: పాలమూరులో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News April 12, 2024

నాగర్ కర్నూల్: కరెంట్ షాక్ తగిలి ఇద్దరు మృతి

image

ఐతోల్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఇద్దరు విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. ఇంట్లో ఒకసారిగా విద్యుత్తు సరఫరా కావడంతో ఆసియా బేగం, అలియా బేగం అనే ఇద్దరు తోడికోడళ్లకు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఇంటికి విద్యుత్ సరఫరా కావడంతో ప్రమాదం జరిగిందని గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 12, 2024

MBNR: జూరాల ప్రాజెక్టులో నీటినిల్వ అడుగంటుతోంది

image

ఉమ్మడి MBNR జిల్లాకు తాగునీటిని అందిస్తున్న జూరాల ప్రాజెక్టులో నీటినిల్వ వేగంగా అడుగంటుతోంది. ఎండల తీవ్రత కారణంగా తాగునీటి వినియోగం పెరుగుతుండగా మరో పక్క జలాశయంలో ఉన్న నిల్వ నీరు అవిరి రూపంలో తగ్గిపోతున్నట్లు సాగునీటి శాఖ అధికారులు అంటున్నారు. ఏప్రిల్ చివరి వారం వరకు ఉన్న నీటితో నెట్టుకు రావొచ్చని, మేలో తాగునీటికి కష్టాలు తప్పవని వారంటున్నారు. పాలమూరుకు నీటి కష్టం తప్పదని రైతులు వాపోతున్నారు.

News April 12, 2024

MBNR: అసత్య ప్రచారాలు తిప్పి కొట్టండి: చల్లా వంశీచంద్‌రెడ్డి

image

కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం కోయిలకొండ మండలం ఆచార్యపూర్ గ్రామంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆరు గ్యారంటీలపై నిజాలు ప్రజలకు వివరించాలని అన్నారు.

News April 12, 2024

MBNR: ఆన్లైన్ మోసం.. రూ.36లక్షలు స్వాహా !

image

ఆన్‌లైన్‌లో పరిచయమై ఓ వ్యక్తిని నమ్మించి తన ఖాతాలోంచి రూ.36 లక్షలు ఖాళీ చేసిన ఘటన జడ్చర్లలో చోటుచేసుకుంది. SI చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన సునీల్ జవహర్‌కు ఆన్‌లైన్‌లో గుర్తుతెలియని వ్యక్తి పరిచయం కాగా.. గూగుల్ వ్యూస్స్ ఇస్తే డబ్బులు వస్తాయని దీని కోసం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పిన అతను సునీల్ ఖాతా నుంచి రూ.36 లక్షలు స్వాహా చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

News April 12, 2024

MBNR: ఆ ఓటర్లపై స్పెషల్ ఫోకస్ !

image

ఉమ్మడి జిల్లాలోని మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గంలో 16,80,417, నాగర్ కర్నూల్ లోక్ సభ పరిధిలో 17,34,773 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ప్రత్యేక కేటగిరీ ఓటర్లు అయిన దివ్యాంగులు, 85 ఏళ్లు నిండిన వృద్ధులు, 18-10 ఏళ్ల యువత, ఎన్ఆర్ఐ, సర్వీస్ ఓటర్లపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఈ 5 కేటగిరీల ఓటర్లు ఉమ్మడి జిల్లాలో 2,10,388 మంది ఉన్నారు.

News April 12, 2024

మహబూబ్‌నగర్ ఎంపీ స్థానంపై అందరి గురి..!

image

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలలు కాగా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ ముప్పేట దాడి చేస్తున్నాయి. అంతేకాకుండా సీఎం రేవంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంపై గురిపెట్టాయి . ఇక్కడ గెలుపోటములు ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా భావించే అవకాశం ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

News April 12, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ఉష్ణోగ్రత వివరాలివే…

image

ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా కోడేరులో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా ఐజలో 40.9, వనపర్తి జిల్లా కానాయిపల్లిలో 40.8, మహబూబ్నగర్ జిల్లా వడ్డేమాన్ లో 40.5, నారాయణపేట జిల్లా ధన్వాడలో 40.0 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News April 12, 2024

MBNR: అమ్మానాన్న మృతి.. ముగ్గురు ఆడపిల్లలు అనాథలు

image

ప్రమాదంలో తండ్రి.. <<13037266>>అనారోగ్యంతో తల్లి మృతి<<>>తో ముగ్గురు ఆడపిల్లలు అనాథలయ్యారు. మూసాపేట మండలం నందిపేటకు చెందిన వెంకట్రాముడు, రాణెమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు. 2011లో భర్త చనిపోగా ఇద్దరు పిల్లల పెళ్లిళ్లు చేసిన ఆమె అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో పిల్లలు శ్రీలత(17), శిల్ప, వెన్నెల అనాథలయ్యారు. చిన్నాన్న దినకూలీ, నాన్నమ్మకు కాలు విరిగి ఇంటికే పరిమితమైంది. పిల్లలను ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.