India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. BRS, BJP మినహా.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన అన్ని రాజకీయ పార్టీలను, ముఖ్య నేతలను ప్రభుత్వం ఆహ్వానిస్తుందని తెలిపారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ ఇస్తున్నారు. రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలో ఏడు చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. NGKL ఎంపీ సీటు ఓట్ల లెక్కింపు నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో, MBNR ఎంపీ సీటు ఓట్ల లెక్కింపు పాలమూరు యూనివర్సిటీలో చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా గద్వాల జిల్లా మల్లాపూర్‌లో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేటలో 39.8, నారాయణపేట జిల్లా ఉట్నూరులో 39.7, నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో 38.4, వనపర్తి జిల్లా దగడలో 37.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మీరు మీ కుటుంబ సభ్యులను, బంధువులను రైల్వేస్టేషన్‌లో దించడానికి వెళ్తున్నారా.. జర మీరు జాగ్రత్త! రైల్వే పోలీసులు సివిల్ డ్రెస్‌లో ఉండి మీ బైక్ దిగేలోపే.. రాంగ్ పార్కింగ్ చేశారని బైక్‌ను స్వాధీనం చేసుకొని జరిమానా కట్టాలని గంటల తరబడి ఓ గదిలో ఉంచుతారు. తర్వాత రైల్వే జడ్జి ముందు ప్రవేశపెట్టి జరిమానా విధిస్తారు. ఇప్పటికి 82 మందిపై కేసులను నమోదు చేసి రూ.45,500 జరిమానా వసూలు చేశారు. మరీ మీరు జాగ్రత్త..!
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీలు నాగర్ కర్నూల్ 848 పాఠశాలల్లో 450 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నారాయణ పేట జిల్లాలో 493 పాఠశాలల్లో 470 ఉపాధ్యాయ ఖాళీలు, గద్వాల జిల్లాలో 461 పాఠశాలల్లో 317 ఖాళీలు, వనపర్తి జిల్లాల్లో 523 పాఠశాలల్లో 316 ఖాళీలు, MBNR జిల్లాలో 852 పాఠశాలల్లో.. 415 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. ఉమ్మడి 1,968 పోస్టులు ఖాళీలు ఉండటంతో.. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 1,719 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ మొదటి వారంలో వార్డుల విభజన, రెండో వారంలో వార్డుల రిజర్వేషన్లను, మూడో వారంలో గ్రామ పంచాయతీ సర్పంచుల రిజర్వేషన్లను ప్రకటించేందుకు జిల్లా అధికారుల ఆదేశాలతో మండల స్థాయిలో అధికారులు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు. షెడ్యూల్ విడుదల కోసం గ్రామ, మండల స్థాయి నాయకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
మహబూబ్‌నగర్ పార్లమెంట్ ఎంపీగా గెలవబోతున్నానని, సర్వేలన్నీ తమకే అనుకూలంగా చూపిస్తున్నాయని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆమె నివాసంలో పార్లమెంటు పరిధిలోని వివిధ మండలాలకు చెందిన పలువురు పార్టీ శ్రేణులు డీకే అరుణను కలిశారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ.. మోదీ గ్యారంటీ నినాదంతో ప్రజలు బీజేపీ వైపు ముగ్గు చూపారని ఈ సారి గెలుపు మనదే అని శ్రేణులు చెప్పారు.
జిల్లాలో నేరాల నియంత్రణకై పోలీసులు దృష్టి సారించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. శనివారం నారాయణపేట ఎస్పీ కార్యాలయ కాన్ఫిరెన్స్ హాలులో జిల్లాలోని పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కారానికి కోర్టు పోలీసులు సమర్థవంతంగా పని చేయాలని చెప్పారు.
ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. మొత్తం మూడు విడతల్లో మూల్యాంకనం ప్రక్రియ జరగనుందని జిల్లా ఇంటర్ కార్యాలయం అధికారులు తెలిపారు. ప్రధమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో చేపట్టనున్నారు.
పాలమూరులో సంచలనం సృష్టించిన BRS నేత శ్రీధర్ రెడ్డి హత్య జరిగి 56 గంటలు గడుస్తున్నా కేసు కొలిక్కిరాలేదు. హత్యకు దారితీసిన పరిణామాలు, వ్యక్తిగత, రాజకీయ కక్షలు, వివాహేతర సంబంధాలు, భూవివాదాలు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలపై పోలీసులు విచారిస్తున్నారు. వారి కుటుంబాల్లో భూ తగాదాల సమస్య ఉందని, వారిలో వారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని భావిస్తోన్నారు. కేసు కొలిక్కి రాకపోవడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది.
Sorry, no posts matched your criteria.