Mahbubnagar

News May 24, 2024

MBNR: దోస్త్ దరఖాస్తు గడువు పొడిగింపు

image

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశానికి DOST(డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ) మొదటి విడత దరఖాస్తుకు ఈనెల 29 వరకు అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. దోస్త్ మొదటి విడత సీట్ అలాట్మెంట్ JUNE 6న ప్రకటించనున్నారు. వివరాలకు dost.cgg.gov.in లాగిన్ కావచ్చు
#SHARE IT.

News May 24, 2024

MBNR: గుర్తు తెలియని మహిళ హత్య

image

దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ పురపాలక పరిధిలోని అమిస్తాపూర్ శివారులోని సాక్షి గణపతి దేవాలయ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ శవం కలకలం రేపింది. పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు శవాన్ని గమనించి అమిస్తాపూర్ ప్రాంత ప్రజలకు తెలపగా వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. బండరాయితో మెది హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

News May 24, 2024

ఆస్ట్రేలియాలో షాద్ నగర్ యువకుడు మృతి

image

ఆస్ట్రేలియాలో షాద్‌నగర్‌ వాసి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. BJP నేత కృష్ణ కుమారుడు అరవింద్ యాదవ్(30) 12ఏళ్లుగా ఉద్యోగం చేస్తూ AUSలోని సిడ్నీలో స్థిరపడ్డారు. సోమవారం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన అరవింద్ కనిపించకపోవడంతో అక్కడ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సముద్రంలో అరవింద్ మృతదేహం ఈరోజు లభించడంతో హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో విచారణ చేపట్టారు.

News May 24, 2024

BREAKING: MBNR: యాక్సిడెంట్.. ముగ్గురు మృతి

image

ఆమనగల్లులో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆమనగల్లు మండలం రామంతల గడ్డ సమీపంలో గల శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మృతులు హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు.

News May 24, 2024

MBNR: నేడు పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష

image

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో మూడేళ్ల ఇంజనీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ఈ నెల 24న పాలిసెట్-2024 నిర్వహిస్తోంది. ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా 10,470 మంది విద్యార్థులకు 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉ.11 నుంచి మ.1.30 గంటల వరకు జరగనున్న పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

News May 24, 2024

MBNR: నిజాయతీని చాటుకున్న కండక్టర్

image

కొత్తకోటకు చెందిన ఫాతిమా బేగం MBNR బస్టాండులో బస్సు ఎక్కి ఆరు తులాల బంగారం నగలు గల బ్యాగును బస్సులో మరిచిపోయి జడ్చర్ల బస్టాండులో దిగిపోయింది. ఆ బ్యాగును తీసుకున్న కండక్టర్ ఫర్జానా డిపోలో అప్పగించింది. బ్యాగును కల్వకుర్తి డిపో మేనేజర్ సుభాషిణి సమక్షంలో సదరు ప్రయాణికురాలికి అప్పగించారు. దీంతో నిజాయితీ చాటుకున్న కండక్టర్, డ్రైవర్ కృష్ణ నాయక్‌ను అధికారులు, తోటి ఉద్యోగులు అభినందించారు.

News May 24, 2024

ఫసల్ బీమా రైతులకు ఎంతో మేలు: కలెక్టర్ రవి నాయక్

image

ఫసల్ బీమా యోజన పథకం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ రవినాయక్ అన్నారు. గురువారం పీఎం ఫసల్ బీమా యోజన పథకంపై మహబూబ్ నగర్ కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పంటనష్టం జరిగినప్పుడు బీమా రైతులకు రిస్క్ కవరేజ్ కల్పిస్తుందని అన్నారు.

News May 23, 2024

ఫారుక్‌నగర్: బొలెరో ఢీకొని యువతి దుర్మరణం

image

ఫారుక్‌నగర్ మండలం అన్నారం తండాలో గురువారం విషాదం నెలకొంది. ఇంటి ముందు నిలబడి ఉన్న యువతిని బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద సమయంలో వాహనాన్ని మైనర్ నడిపినట్లు సమాచారం. ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 23, 2024

ALP: అలంపూర్ ఆలయాల్లో చండీ హోమం..!

image

అలంపూర్ పట్టణంలో వెలసిన బాల బ్రహ్మేశ్వర స్వామి జోగులాంబ దేవి ఆలయాల ప్రాంగణంలో బుద్ధ పౌర్ణమి పురస్కరించుకుని గురువారం వేద పండితులు చండీ హోమం నిర్వహించారు. హోమంలో సుదూర ప్రాంతాల నుండి వచ్చిన 114 మంది భక్తులు పాల్గొన్నారు. దీంతో ఆలయాల ప్రాంగణంలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో పురందర్ కుమార్ తెలిపారు.

News May 23, 2024

మాడుగుల: గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

image

మాడుగుల మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన సాయి మంగళవారం ఈత కొట్టేందుకు వెళ్లి గల్లంతయ్యాడు. పోలీసులు గ్రామస్థుల సహకారంతో మూడు మోటార్లను బిగించి నీటిని తోడిన తగ్గలేదు. చివరికి ఫైర్ సిబ్బందితో బావిలో గాలించి డెడ్ బాడీని ఈరోజు బయటకి తీశారు. మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.