Mahbubnagar

News May 23, 2024

ఆత్మకూర్: ప్రేమ పేరుతో మోసం.. వ్యక్తిపై కేసు

image

ప్రేమ పేరిట వశపరచుకొని, పెళ్లికి నిరాకరించిన ఓ వ్యక్తిపై ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్ఐ నరేశ్ తెలిపిన వివరాలు.. ఆత్మకూర్‌కు చెందిన రమేశ్ ఓ గ్రామానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. ఈక్రమంలో శారీరక సంబంధం ఏర్పరచుకొని పెళ్లికి నిరాకరించడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.

News May 23, 2024

శ్రీధర్ రెడ్డి హత్యపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి దిగ్భ్రాంతి

image

చిన్నంబాయి మండలం లక్ష్మీ పల్లికి చెందిన బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్య పై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లాలో ఐదు నెలల కాలంలో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు హత్యకు గురయ్యారని ఆయన ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. హంతకులను కఠినంగా శిక్షించాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. జిల్లా మీడియా సెల్ కన్వీనర్ అశోక్ నిందితులను శిక్షించాలన్నారు.

News May 23, 2024

MBNR: మహిళల మృతి కేసులో ఆటో డ్రైవర్ అరెస్ట్

image

కర్నూల్ మండలం చెరువులో పడి ఈనెల 19న మరణించిన ఇద్దరూ మహిళల మృతి కేసులో ఆటోడ్రైవర్ మహ్మద్ బాషాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసులకు వివరాల ప్రకారం.. MBNR జిల్లాకు చెందిన జానకి, అరుణ వేశ్య వృత్తి కొనసాగుతూ కర్నూలు వచ్చేవారు. బాషా, జానకి మధ్య మనస్పర్థలతో బాషాను ఇతరులతో కొట్టించింది. కక్ష్య పెంచుకున్న భాష గార్గేయపురం చెరువులో జానకిని తోసేశాడు. కాపాడబోయిన అరుణ కూడా మరణించింది. 

News May 23, 2024

వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడి హత్య

image

వనపర్తి జిల్లాలో దారుణ హత్య జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో స్థానిక బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి(45) ఆరుబయట నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో దుండగులు గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 23, 2024

నాగర్‌కర్నూల్ జిల్లాలో చిరుత సంచారం

image

నాగర్ కర్నూల్ జిల్లాలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది. బుధవారం జిల్లాలోని తూడుకుర్తి గ్రామ శివారులో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. దీంతో తూడుకుర్తి, సల్కర పేట గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుత బారి నుంచి తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

News May 23, 2024

పాలెంలో ఈనెల 24న విత్తన మేళా..!

image

నాగర్ కర్నూల్ జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రంలో ఈనెల 24న విత్తనమేళా నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ వ్యవసాయ సహాయ పరిశోధనా సంచాలకులు డాక్టర్ మల్లారెడ్డి బుధవారం తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని రైతులు పాల్గొని వివిధ పంటల సాగు పద్ధతులపై వ్యవసాయ శాస్త్రవేత్తలు అందించే సలహాలు సూచనలు పొందాలన్నారు. అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, కావాల్సిన రైతులు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు.

News May 23, 2024

కడ్తాల్: ‘పెండింగ్ బిల్లులు చెల్లించి ఎన్నికలు నిర్వహించాలి’

image

పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథికి బుధవారం రాష్ట్ర సర్పంచుల సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. గ్రామాల అభివృద్ధి కోసం, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డులు,వైకుంఠధామాలు, సీసీ రోడ్లు, క్రీడా ప్రాంగణాలు సొంత నిధులతో నిర్మించామని వారు పేర్కొన్నారు. లక్ష్మీనరసింహారెడ్డి, చందర్ మధుసూదన్ రెడ్డి, యాదయ్య పాల్గొన్నారు.

News May 23, 2024

నాగర్‌కర్నూల్ జిల్లాలో కల్తీ విత్తనాలపై స్పెషల్ టీం

image

నాగర్ కర్నూల్ జిల్లాలో కల్తీ విత్తనాల మీద నిఘా పెట్టినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ బుధవారం తెలిపారు. ఇందులో భాగంగా 10 మంది పోలీసు అధికారులతో కూడిన ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేశామన్నారు. ఈ టీం అగ్రికల్చర్ ఆఫీసర్లతో కలిసి పనిచేస్తుందని చెప్పారు. రైతులు మోసపోకుండా విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు.

News May 22, 2024

రేవంత్ రెడ్డిది మాటల గారడీ ప్రభుత్వం: డీకే అరుణ

image

రేవంత్ రెడ్డిది మాటల గారడీ ప్రభుత్వమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో ఆమె మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తాము 30వేల ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కానీ ఆ ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో ఎవరికీ తెలియదన్నారు. గాల్లో మాటలు చెప్పి కాగితాల మీద రాతలు చూపించి ప్రజలను మోసం చేయడం తప్ప నిరుద్యోగులకు చేసిందేమి లేదని ఆమె విమర్శించారు.

News May 22, 2024

NGKL: గిరిజన విద్యార్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు చేసుకోండి !

image

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ 2024-25 విద్యాసంవత్సరం 3,5,8 తరగతుల్లో ప్రవేశానికి గాను జిల్లాకు చెందిన గిరిజన బాలబాలికలు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కమలాకర్ రెడ్డి తెలిపారు. 3వ తరగతిలో 10 సీట్లు 5లో 6 సీట్లు, 8లో 4 సీట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు జూన్ 6వ తేదీలోగా జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.