India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో బుధవారం ఓ ఇంటి వద్ద ఉన్న చెట్లను తొలగించేందుకు వెళ్ళిన రాములు(40) అనే వ్యక్తి చెట్టు పై నుంచి కాలుజారి కిందపడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు డాక్టర్ నిర్దారించారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కుటుంబ కలహాలు ఓ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. ఈ ఘటన గద్వాల జిల్లా మనవపాడు మండలం ఏ-బుడిదపాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నరసింహులు భార్య వరలక్ష్మి (39), కూతురు అనురాధ (16) భూతగాదాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో సాయంత్రం ఇంట్లో పురుగు మందు తాగినట్లు సమాచారం. వరలక్ష్మి, అనురాధ చికిత్స అందేలోపే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పత్తి విత్తనాలు కొనుగోలు చేయడానికి వెళ్లి రోడ్డు <<13291577>>ప్రమాదంలో <<>>చిక్కుకున్న రైతుల కుటుంబంలో విషాదం నెలకొంది. ఆటోలో మొత్తం 12 మంది రైతులు జడ్చర్ల వెళ్లి పత్తి విత్తనాలు కొనుగోలు చేసి వెల్దండ మండలం పడమటి తండాకు పయనమయ్యారు. మంగళవారం రాత్రి వెల్దండ గేటు వద్ద వారు ప్రయాణిస్తున్న ఆటోను అతి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఏడుగురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.
ఉరేసుకొని ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గంధం చంద్రయ్య (70) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చంద్రయ్య భార్య 3 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించింది. అప్పటినుంచి మనస్తాపంతో ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. PSలో ఎవరూ ఫిర్యాదు చేయలేదు.
రాష్ట్రంలో తాగుడు పెంచాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. HYDలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మద్యం పాలసీలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, BRS పార్టీ నాయకులు ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నారని విమర్శించారు. BRS మనుగడ ప్రశ్నార్థకంగా ఉన్నందున BRS నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వంపై విమర్శిస్తే ఊరుకోమన్నారు.
మహబూబ్‌నగర్ లోక్ సభ ఫలితాలపై జోరుగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. జూన్ 4న విజేత ఎవరో తేలనుండగా.. ఈ ఎన్నికల ఫలితాలపై IPLకు దీటుగా బెట్టింగులు జోరందుకున్నాయి. ఈ దందాలో ఒక్కొక్కరు రూ. లక్షల మేర బెట్టింగ్ కాస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యాపారులు, యువత ఈ బెట్టింగ్‌పై దృష్టిపెట్టారు. గ్రౌండ్స్, టీ పాయింట్ల వద్ద నలుగురు కలిస్తే చాలు అభ్యర్థుల గెలుపోటములు, మెజార్టీలపైనే చర్చజరుగుతుంది.
పాలమూరు యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సలర్‌గా ఐఏఎస్ నదీం అహ్మద్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ పదవీకాలం నేటితో ముగిసింది. ఈ క్రమంలో వర్సిటీలో కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఇన్‌ఛార్జీ వీసీగా నదీంను నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు. కొత్త వీసీ నియామకం అయ్యేవరకు వీరే విధుల్లో ఉంటారు. ఇప్పటికే కొత్త వీసీల కోసం యూనివర్సిటీలో సెర్చ్ కమిటీ ఏర్పాటు చేశారు.
ఉమ్మడి జిల్లాలో వైద్యం పేరిట వ్యాపారం జోరుగా సాగుతోంది. అనుమతి లేని క్లినిక్స్, అర్హత లేకున్నా చికిత్స చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. RMPలు, ANMలు చేస్తున అబార్షన్లతో ఇన్‌ఫెక్షన్లు, ఇతర సమస్యలతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. మహబూబ్‌నగర్, భూత్పూర్, మిడ్డిల్ మండలాల్లో ఈ మధ్య జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం. ఇంత జరుగుతున్నా జిల్లా వైద్యశాఖ చోద్యం చూస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.
ఈసెట్ ఫలితాల్లో నడిగడ్డ విద్యార్థి స్టేట్ 3వ ర్యాంక్ సాధించాడు. గద్వాల జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు కుమారుడు టి. రఘువరన్ సోమవారం విడుదలైన ఫలితాల్లో స్టేట్ మూడవ ర్యాంకు సాధించి తన ప్రతిభను చాటాడు. దీంతో నడిగడ్డ విద్యాభిమానులు విద్యార్థిని అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
పాలమూరు యూనివర్సిటీ వైస్ కౌన్సిలర్ పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. 2021 మే 21న లక్ష్మీకాంత్ రాథోడ్‌ను మూడేళ్ల పదవీ కాలానికి వీసీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మంగళవారంతో ఆయన పదవీకాలం ముగియనుండటంతో ఆయన OUకి తిరిగి వెళ్లనున్నారు. రాష్ట్రంలో ఏ యూనివర్సిటీకి ఇవ్వనన్ని నిధులను కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది. దీంతో రాష్ట్రంలోనే పీయూ వీసీ పోస్టుకు పోటీ పెరిగింది.
Sorry, no posts matched your criteria.