India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 11 మంది న్యాయవాదులు చార్ధామ్ యాత్రకు బయలుదేరారు. అయితే వీరు ముందస్తుగా ఆన్‌లైన్లో టికెట్లు బుక్ చేయించుకున్నారు. పవన్ హాండ్స్ అనే సంస్థ ద్వారా రూ.5,500 చెల్లించి ఫ్లైట్ టికెట్ బుక్ చేయించుకుని పాట్నాలో దిగారు. తీరా పాట్నాలో టికెట్లు ఫేక్ టికెట్లుగా అధికారులు చెప్పడంతో వీరంతా తమకు జరిగిన అన్యాయాన్ని గళమెత్తి ప్రశ్నించారు.
రైతులు పంటలకు రసాయన ఎరువులు పిచికారీ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో పిచికారీ చేసి ఇంటికి వచ్చే సరికే వర్షం కురిసి మందులు వృథా అవుతుంటాయి. ఇలాంటి ఇబ్బందులను తొలగించేందుకే వాతావరణ శాఖ మేఘదూత్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ఎప్పటికప్పుడు వాతావరణ వివరాలు అందిస్తుంది. రాబోయే అయిదు రోజుల్లో వాతావరణ మార్పులు, వర్ష సూచన, ఆకాశం మేఘావృతం అవుతుందా? అనే సమాచారాన్ని ఈ యాప్ అందిస్తుంది.
పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన MBNR రైల్వే స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. HYDలోని చాంద్రాయణగుట్ట ఫుల్ బాగ్‌కు చెందిన షరీఫ్(17) MBNR సమీపంలోని వీరన్నపేటలో ఉన్న మేనమామ ఇంటికి వచ్చాడు. ఈక్రమంలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పట్టాలు దాటుతుండగా.. తుంగభద్ర ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొని మరణించాడు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
కర్నూలు మండలం గార్గేయపురం నగరవనం <<13279503>>చెరువులో <<>>మృతి చెందిన మహిళల వివరాలు తెలిశాయి. పోలీసుల వివరాలు ప్రకారం.. MBNR జిల్లా కోయిలకొండ మండలం అభంగపట్నంకు చెందిన జానకిగా గుర్తించారు. మరొకరు అరుణగా గుర్తించిన కుటుంబ సభ్యుల వివరాలుపై స్పష్టత రాలేదు. కర్నూలు బస్టాండు పరిసరాల్లో వ్యభిచార వృత్తిలో ఉన్న మహిళలను విచారించడంతో వీరి వివరాలు వెలుగు చూశాయి. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోని పీయూ వీసీ నియామకంపై ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అత్యధిక దరఖాస్తులు అందిన వర్సిటీల్లో పీయూ మూడో స్థానంలో ఉంది. బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి 208 దరఖాస్తులు, ఓయూకి 193, పీయూకి 159 దరఖాస్తులు అందాయి. నేటితో రాష్ట్రంలోని అన్ని వర్సిటీల వీసీల మూడేళ్ల పదవీ కాలం ముగుస్తుంది. ఈ నెలాఖరులోపు కొత్త వీసీల నియామకం పూర్తి చేయనున్నారు.
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. లక్ష్యం మేరకు మొక్కలు సిద్ధం కాలేకపోతున్నాయి. ఎండల తీవ్రత, నీటి ఎద్దడి మూలంగా మొక్కల ఎదుగుదల కనిపించడంలేదు. సకాలంలో కలుపు తీయకపోవడమూ మరో కారణమని చెప్పవచ్చు. రూ.లక్షలు వెచ్చించి నర్సరీలు కొనసాగిస్తున్న ప్రయోజనం లేదని జిల్లావాసులు అంటున్నారు.
ఈనెల 24 నుండి జూన్1 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సజావుగా నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శ్రీధర్ సుమన్ సూచించారు. సోమవారం పరీక్షల నిర్వహణపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్‌తో పాటు, జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచేలా ఉత్తర్వులు జారీ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
విద్యార్థి దశ నుంచే జీవిత లక్ష్యాలను ఎంచుకొని ప్రణాళికతో చదువుతూ ముందుకు వెళ్లాలని గద్వాల జిల్లా ఎస్పీ రితిరాజ్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవ తరగతి, ఇంటర్ పాసైన పోలీస్ సిబ్బంది, అధికారుల కుటుంబాలకు చెందిన పిల్లలతో సమావేశం నిర్వహించారు. జీవితంలో లక్ష్యసాధనకు అనుసరించాల్సిన విధివిధానాల గురించి వివరించారు. పలు మహనీయుల పుస్తకాలు అందజేశారు.
వానాకాలం పంటల కోసం రైతులు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వరి కొయ్యలకు నిప్పు పెడుతుండడంతో అటు పర్యావరణంతోపాటు, రాబోయే దిగుబడిపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది. వరి కొయ్యలు కాల్చిన ప్రదేశంలో భూమి నీటిని కోల్పోయే గుణంతోపాటు , సేంద్రియ పదార్థాన్ని కోల్పోతుంది. ప్రత్యామ్నాయంగా జీలుగా, పల్లి పెసర వంటివి సాగు చేయడం వల్ల భూసారం పెరుగుతందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర సౌతెర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ X వేదికగా ఓ ట్వీట్ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు TS బదులుగా TG జోడించినట్లు తెలిపింది.ఇక నుంచి TSSPDCL కాదు.. TGSPDCL అని పేర్కొంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలకు చెందిన దాదాపు అన్ని సెక్షన్ల విద్యుత్ శాఖ అధికారులు X వేదికగా ప్రొఫైల్ ఫోటోను మార్చి ప్రజలకు తెలియజేశారు.
Sorry, no posts matched your criteria.