India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఊట్కూర్ మండలం నిడుగుర్తి గ్రామానికి చెందిన గణేశ్ ఫిట్ ఇండియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించాడు. దీంతో మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ సోమవారం గణేశ్‌ను ఓ ప్రకటనలో అభినందించారు. పరుగు పందెంలో ప్రతిభ చూపి గోల్డ్ మెడల్ సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చారని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు.
MBNR: ఫిబ్రవరిలో జరిగిన ఇంటర్ ప్రయోగ పరీక్షలు, మార్చిలో నిర్వహించిన వార్షిక పరీక్షల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి రెమ్యూనరేషన్లు విడుదల చేయాలని జూనియర్ అధ్యాపకుల సంఘం నేతలు సురేష్, శ్రీనివాస్ విద్యా కార్యదర్శి వెంకటేశంకు వినతిపత్రం సమర్పించారు. అంతకు ముందు ఇంటర్ పరీక్షల విభాగం అధికారి జయప్రదకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారులు సానుకూలంగా స్పందించారని తెలిపారు.
శ్రీశైల మహా క్షేత్రానికి పశ్చిమ ద్వార క్షేత్రమైన అలంపురం పుణ్యక్షేత్రంలో ఈనెల 21న శ్రీశైలం దేవస్థానం వారు శ్రీగిరి ప్రదక్షణలు నిర్వహిస్తున్నట్లు అలంపురం దేవస్థానం కార్యాలయం తెలిపింది. ఈ మేరకు శ్రీశైలం దేవస్థానం వారు శ్రీశైలానికి తూర్పున త్రిపురాంతకం, ఉత్తరాన ఉమామహేశ్వరం, దక్షిణాన సిద్ధవటం, పశ్చిమాన అలంపురం.. ఇలా నాలుగు దిక్కుల శ్రీగిరి ప్రదక్షిణలు నిర్వహిస్తారని తెలిపారు.
నాలుగు రోజుల్లో ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఉదయం ఎండ, సాయంత్రం వర్షం కురుస్తుండటంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వరి ధాన్యం రోడ్లపై ఆరబోసిన రైతుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఉదయం వరి ధాన్యం ఆరబోసి ధాన్యం ఎండకు ముందే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ప్రతిరోజు ఇదే పరిస్థితి ఉండడంతో ధాన్యం ఎండకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈనెల 24 నుంచి ప్రారంభమయ్యే సప్లమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డ్ మరో అవకాశాన్ని కల్పించింది. రూ.2000 అపరాధ రుసుంతో రేపటి వరకు ఫీజు చెల్లించవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా ఫీజు చెల్లించని విద్యార్థులు ఉంటే వారి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఉమ్మడి జిల్లాలో ఇంటర్ అధికారులు పేర్కొంటున్నారు.
షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలం మధురాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. మల్లేష్, రమాదేవి దంపతుల కూతురు సాక్షిని ప్రమాదవశాత్తు మృతి చెందింది. తోటి స్నేహితులతో కలిసి ఆడుకుంటుంది. ఈ సమయంలో ఇంటి ముందున్న ప్రహరీ గోడకు ఉన్న గేటు దిమ్మెను పట్టుకోగా అది బాలిక తలపై పడటంతో తీవ్ర గాయాలై మృతి చెందింది. అప్పటివరకు ఆడుతున్న చిన్నారి ఒక్కసారిగా కళ్లముందే విగత జీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
ఉమ్మడి జిల్లాలో ఎంపీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఏ ఎన్నికల్లో లేనివిధంగా ఈసారి ఉమ్మడి జిల్లా పార్లమెంట్ స్థానాలను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావడంతో అన్ని పార్టీలు ఇక్కడ ఫోకస్ పెట్టాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 14కు 12 MLAలను కాంగ్రెస్ గెలిచింది. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందా.. సీఎం పంతం నెగ్గేనా..? అని జిల్లాలో చర్చ జోరందుకుంది.
మహబూబ్ నగర్ జిల్లా పాత పేరు పాలమూరు అని అందరికి తెలుసు. కానీ పూర్వం జిల్లా అసలు పేరు “రుకమ్మపేట” అవి పిలిచేవారు. పాలు, పెరుగు సమృద్ధిగా లభించడంతో పాలమూరు అనే పేరు కూడా ఉంది. 1890లో నిజాం రాజు మహబూబ్ అలీ ఖాన్ పేరు మీదుగా ఈ జిల్లాకు మహబూబ్నగర్ అనే పేరు వచ్చింది. ప్రస్తుతం ఇదే పేరు కొనసాగుతోంది. రుకమ్మపేట, పాలమూరు, మహబుబ్ నగర్ వీటిలో మీకు ఏ పేరు నచ్చిందో కామెంట్ చేయండి.
కర్నూల్ మండలం గార్గేయపురం చెరువులో ముగ్గురు మహిళల మృతదేహాలు ఆదివారం వెలుగు చూశాయి. పోలీసుల వివరాలు ప్రకారం.. చెరువులో మృతదేహాలు ఉన్నాయని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకొని ముగ్గురు మహిళలను బయటకు తీశారు. ముందు హిజ్రాలుగా భావించినా, తర్వాత మృతులు మహిళలుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు MBNRకు చెందినవారుగా గుర్తించారు. కేసు దర్యాప్తు కోసం మూడు పోలీసుల బృందాలను నియమించారు.
✔MBNR,GDWL,NRPT జిల్లాలో పలు ప్రాంతాల్లో నేడు కరెంట్ కట్
✔సర్వం సిద్ధం.. నేటి నుంచి టెట్ పరీక్షలు
✔పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న స్థానిక ఎమ్మెల్యేలు
✔కొనసాగుతున్న వేసవి క్రీడా శిక్షణ
✔తాడూరు: నేటి నుంచి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ వేడుకలు
✔GDWL: నేడు లాటరీ పద్ధతిన పోస్టులు ఎంపిక
✔కల్తీ విత్తనాలపై అధికారుల ఫోకస్
Sorry, no posts matched your criteria.