Mahbubnagar

News April 7, 2024

ఉమ్మడి జిల్లాలో ‘TODAY TOP NEWS’

image

♥రేపు కొడంగల్ కు సీఎం రేవంత్ రెడ్డి,NGKLకు మాజీమంత్రి కేటీఆర్ రాక
♥ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న ‘ఎత్తెకాఫ్’ కార్యక్రమాలు
♥MBNR:గన్‌తో కాల్చుకొని AR SI బలేశ్వర్ సూసైడ్
♥ACMP:భార్యాభర్తల మధ్య గొడవ..భర్త మృతి
♥రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదు ప్రతీకార పాలన:RSP
♥పెరుగుతున్న ఎండలు..అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్లు
♥గ్రూప్స్&DSC పై ఉచిత శిక్షణ:BC,SC స్టడీ సర్కిల్
♥ఇఫ్తార్ విందు..పాల్గొన్న స్థానిక MLAలు

News April 7, 2024

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

√ రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదు ప్రతీకార పాలన:RSP.
√బొంరాస్ పేట: ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి:విమలక్క.
√ అచ్చంపేట: భార్యాభర్తల మధ్య గొడవ.. పెట్రోల్ పోసుకొని భర్త ఆత్మహత్య.
√ రేపు కొడంగల్ రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
√ మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో జోరుగా ఎన్నికల ప్రచారాలు.
√ ఇఫ్తార్ విందులో పాల్గొన్న పలువురు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు

News April 7, 2024

రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదు ప్రతీకార పాలన: RSP

image

సీఎం రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదు, ప్రతీకార పాలన అని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులకు బీఆర్ఎస్ పార్టీ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

News April 7, 2024

MBNR: పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించండి: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి

image

కొత్తూర్, నందిగామ మండలాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చల్లా వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ పార్లమెంట్ అభివృద్ధి బాటలో నడిపించే బాధ్యత నాదని, నన్ను ఆశీర్వదదించి , పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించండి అని కోరారు. ఉమ్మడి మండల ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.

News April 7, 2024

అచ్చంపేట: భార్యాభర్తల మధ్య గొడవ.. భర్త మృతి

image

బల్మూర్ మండలం గోదల్ గ్రామానికి చెందిన సుభాష్ రెడ్డి(30)అనే యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు వివరాలు.. తన అత్తగారి ఊరైన రంగాపురం గ్రామానికి వెళ్లి వారి ఇంటి ముందు తన శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ తరలిస్తుండగా మార్గ మద్యలో మృతి చెందారని తెలిపారు.

News April 7, 2024

MBNR: బస్సు పాసులపై మహాలక్ష్మి ప్రభావం

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం అమల్లోకి రావడంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణాలు పెరిగాయి. ఈ పథకంతో అన్ని రకాల బస్సు పాసులపై ప్రభావం పడింది. బస్సు పాస్ తీసుకునే వారి సంఖ్య తగ్గిందని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, పేద మహిళలు ఇలా తేడా లేకుండా మహాలక్ష్మి పథకం వర్తించడంతో వారందరూ ఉచిత ప్రయాణం చేస్తున్నారు.

News April 7, 2024

తాండూరు: UPDATE: హత్యకు గురైన మహిళ గుర్తింపు

image

తాండూరులోని బీసీ శ్మశానవాటికలో వివాహిత దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. కోస్గి మం.గుండుమల్‌కు చెందిన తిరుపతమ్మ(40)ని పదేళ్ల క్రితం భర్త వదిలేశాడు. తాండూరులోని తన అక్క ఇంట్లో ఉంటూ వంట మనిషిగా పనిచేస్తుంది. శుక్రవారం పనికి వెళ్ళిన తిరుపతమ్మ ఇంటికి రాలేదు. శనివారం మృతదేహం గుర్తించిన పోలీసులు సుజాత సోదరికి సమాచారం అందించారు.

News April 7, 2024

అచ్చంపేట: పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

image

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన సుభాశ్ రెడ్డి ఈ రోజు ఉదయం తన ఇంట్లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఒక్కసారిగా ఇంట్లో మంటలు రావడంతో గమనించిన స్థానికులు అంబులెన్సు సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది ప్రథమ చికిత్స అందించి అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News April 7, 2024

మహబూబ్ నగర్: UPDATE: గన్‌తో కాల్చుకొని AR SI సూసైడ్?

image

హైదరాబాద్‌లోని‌ కబుతర్‌ఖానా వద్ద తుపాకీ పేలిన ఘటనలో పోలీస్ అధికారి చనిపోయిన సంగతి తెలిసిందే. మహబూబ్‌నగర్ 10వ బెటాలియన్‌కు చెందిన TSSP AR SI బాలేశ్వర్‌ (48)‌ విధుల నిర్వహణలో భాగంగా శనివారం పాతబస్తీకి వచ్చారు. ఆదివారం ఉ. 5.30 గంటలకు తన సర్వీస్‌ గన్‌తో సూసైడ్‌ చేసుకొన్నారు.‌ పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని‌ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య‌కు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

News April 7, 2024

అమరచింత: చికిత్స పొందుతూ మహిళ మృతి

image

అమరచింత మండలంలోని ఈర్లదిన్నె గ్రామానికి చెందిన జయమ్మ(45) శనివారం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. ఆయన వివరాల మేరకు.. ఈనెల 4న ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో బ్లేడ్‌తో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పేర్కొన్నారు.