Mahbubnagar

News May 19, 2024

అధికారులు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి: కలెక్టర్

image

ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకై వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 24 నుంచి ప్రారంభమయ్యే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. జిల్లా నుంచి 6134 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు.

News May 18, 2024

CM రేవంత్ రెడ్డికి ఆ టెన్షన్: DK అరుణ

image

CM రేవంత్ 5 నెలలు అవుతున్నా పాలనపై పట్టు సాధించకుండా.. హైప్ క్రియేట్ చేసే మాటలు మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు ఏవి లేవు అని DK అరుణ ఆరోపించారు. MP ఎన్నికలలో ఊహించినట్లుగా సీట్లు దక్కడం లేదన్న టెన్షన్‌లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. BJPకి రాష్ట్రంలో 10 నుంచి 12 MP స్థానాలు దక్కే అవకాశం ఉండడంతో CM టెన్షన్‌లో ఉన్నారన్నారు.

News May 18, 2024

MBNR: 3,21,523 ఎకరాల్లో పంటలు సాగు

image

వానాకాలంలో జిల్లావ్యాప్తంగా 3,21,523 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదించింది. వరి 1,70,445 ఎకరాల్లో సాగు కానుండగా.. 42,612 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉంచనున్నారు. అదేవిధంగా పత్తి 85,379 ఎకరాల్లో సాగు కానుండగా.. 853.79 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంగా ఉంచాలని ప్రణాళిక రూపొందించారు. ఇతర పంటలకు సంబంధించిన విత్తనాలు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయించారు.

News May 18, 2024

కల్వకుర్తిలో రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక

image

కల్వకుర్తి పట్టణంలోని సీబీఎం కళాశాల మైదానంలో రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక ఉంటుందని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి స్వాములు తెలిపారు. రేపు ఉదయం 9 గంటలకు క్రీడాకారుల ఎంపిక ప్రారంభమవుతుందని తెలిపారు. వచ్చేనెల 6, 7 తేదీలలో హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో జిల్లా నుంచి పాల్గొంటారని తెలిపారు. అండర్ 18 బాలురు బాలికలు, క్రీడలలో పాల్గొంటారని వివరించారు.

News May 18, 2024

MBNR: రూ. 60 వేలు కాజేసిన సైబర్ దుండగుడు

image

అచ్చంపేటకి చెందిన ఓ వ్యక్తి సైబర్ వలలో చిక్కి రూ. 60 వేలు పోగొట్టుకున్నాడు. SI రాము తెలిపిన వివరాలు.. పట్టణంలోని మహేంద్ర కాలనీకి చెందన అష్రఫ్ ఫోన్‌కు ఈ నెల 2న ఓ లింక్ వచ్చింది. దానిని క్లిక్ చేయగా వెంటనే ఫోన్ హ్యాక్ అయ్యి తన బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 60 వేలు విత్‌డ్రా అయినట్లు మిసేజ్ వచ్చింది. వెంటనే తేరుకున్న అష్రఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

News May 18, 2024

MBNR: ‘రుణాలు తీసుకున్న రైతుల వివరాలు.!!’

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5,49,108 మంది రైతులు రూ.2,736.76 కోట్లు రుణాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాల వారీగా వివరాలిలా..
✓ NGKL – 1,47,500 మంది రైతులు తీసుకున్న రుణాలు రూ.935.40 కోట్లు.
✓ MBNR – 1,23,102 మంది రైతులు, రూ.735.82 కోట్లు.
✓ గద్వాల – 95,199 మంది రైతులు, రూ.367.72 కోట్లు.
✓ నారాయణపేట – 94,359 మంది రైతులు, రూ.357.62 కోట్లు.
✓ వనపర్తి – 88,948 మంది రైతులు, రూ.340.20 కోట్లు.

News May 18, 2024

ఉమ్మడి పాలమూరులో నేడు, రేపు మోస్తరు వర్షాలు

image

ఉమ్మడి పాలమూరులో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది. మధ్య ప్రదేశ్ నైరుతి ప్రాంతంలో కేంద్రీకృతమైన ఆవర్తనంతో పాటు రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తనం కారణంగా వానలు కురుస్తాయని వివరించింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News May 18, 2024

MBNR: ఎన్నికల వేళ ఆర్టీసీకి రాబడి

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు తమ సొంత గ్రామాలకు వచ్చి ఓట్లు వేశారు. ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ఆర్టీసీ బస్సు డిపోలు ఈనెల 10 నుంచి 15 వరకు ప్రత్యేక బస్సులు నడిపాయి. ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీకి రోజుకు రూ.2.18 కోట్ల రాబడి సమకూరింది. సాధారణ రోజుల్లో రోజుకు రూ.1.89 కోట్ల రాబడి వచ్చేది.

News May 18, 2024

MBNR: పూణేలో పాలమూరు యువకుడి దారుణ హత్య

image

మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం అన్నారెడ్డిపల్లి తండాకు చెందిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామస్థుల కథనం ప్రకారం.. తండాకు చెందిన శ్రీనివాస్ (22) తల్లిదండ్రులతో పాటు పూణేలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం రాత్రి పని ఉందని చెప్పి బయటకు వెళ్లి దారుణ హత్యకు గురైనట్లు శుక్రవారం గుర్తించారు. దీంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News May 18, 2024

NGKL: పోలీసుల భయంతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య

image

పోలీసులు కొడతారనే భయంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన NGKLజిల్లా తెల్కపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాలు ప్రకారం.. వెంకటయ్య (43) ఆటో నడుపుతూండేవాడు. ఈనెల 14న ఓ మహిళ ఆటోలో ఎక్కింది బంగారు గొలుసు చోరైనట్లు PSలో ఫిర్యాదు చేసింది. వెంకటయ్యను విచారించారు. మరుసటి రోజు PSకు రమ్మనగా జ్వరంతో వెళ్లలేకపోయాడు. పోలీసులు కొడతారేమోనని భయంతో శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు అతడి భార్య ఆరోపించారు.