Mahbubnagar

News April 6, 2024

పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా !

image

తుక్కుగూడ జన జాతర సభలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చే 23 ప్రత్యేక హామీలను కాంగ్రెస్‌ సిద్ధం చేసింది. కేంద్రంలో అధికారంలోకి వస్తే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇవ్వనుంది. విభజన చట్టంలో ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం ఉపసంహరించుకున్న ఐటీఐఆర్‌ను ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేయనుంది. ఈ మేరకు నేడు ప్రత్యేక హామీలను రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి సభ వేదికపై ప్రకటించనున్నారు.

News April 6, 2024

వనపర్తి: ఏప్రిల్ 22 వరకు దరఖాస్తులు చేసుకోండి

image

వనపర్తి: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆరు ప్రభుత్వ, మూడు ప్రైవేటు మొత్తం తొమ్మిది పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయని వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు. వీటి పరిధిలో 1,740 డిప్లమా కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం పాలీసెట్-2024 ప్రవేశ పరీక్షకు ఏప్రిల్ 22 వరకు polycet.sbtet.telangana.gov.in వెబ్సైట్ ద్వారా అర్హులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. మే 17న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు.

News April 6, 2024

పాలమూరులో ‘గృహజ్యోతి’ అయోమయం !

image

ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగానికి జీరో బిల్ ఇస్తోంది. అయితే MLC ఎన్నికల కోడ్ రావడంతో ఉమ్మడి జిల్లాలో ఈ పథకాన్ని ఆపేశారు. ఫిబ్రవరి, మార్చి నెల బిల్లులు యథావిధిగా వచ్చాయి. దీంతో తమకు వచ్చిన బిల్లులు కట్టాలా.. వద్దా..? అనే విషయంలో స్పష్టత లేకపోవడంతో వినియోగదారుల్లో అయోమయం నెలకొంది. ఈ క్రమంలో కొందరు బిల్లులు చెల్లిస్తుండగా మరికొందరు వేచిచూద్దామనే ధోరణిలో ఉన్నారు.

News April 6, 2024

NGKL: తండ్రిని చంపిన కొడుకు అరెస్ట్.. రిమాండ్

image

గంజాయి తాగొద్దన్నందుకు <<12992370>>తండ్రిపై కొడుకు పెట్రోల్ పోసి<<>> దారుణంగా హత్య చేసిన ఘటన RR జిల్లా తుర్కయాంజల్ గురువారం జరిగిన విషయం తెలిసిందే. కొల్లాపూర్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి రవీందర్‌ను కొడుకు అనురాగ్ గంజాయి మత్తులో కోపోద్రిక్తుడై హత్య చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన ఆదిభట్ల పోలీసులు నిందితుడు అనురాగ్(25)ను శుక్రవారం అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు CI తెలిపారు.

News April 6, 2024

అయిజ: ఊరెళ్లి వచ్చేసరికి ఇంట్లో చోరీ

image

అయిజ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఎస్ఐ విజయభాస్కర్ వివరాలు మేరకు.. గ్రామానికి కృష్ణారెడ్డి తన ఇంటికి తాళం వేసి పనిమీద కర్నూలు వెళ్లారు. రాత్రి తిరిగి వచ్చి చూసే సరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోనికి వెళ్ళి పరిశీలించగా రెండు లక్షల రూపాయలు, ఆరు తులాల బంగారం చోరీకి గురైందని గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

News April 6, 2024

MBNR: 7న ప్రవేశ పరీక్ష.. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి

image

మహబూబ్ నగర్ జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి పదో తరగతి ప్రవేశాలకు ఈనెల 7వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ తెలిపారు. కావున ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్ సైట్  telanganams.cgg.gov.in లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని డీఈవో తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

News April 6, 2024

WNPT: క్షుద్రపూజల పేరుతో రూ.9.73 లక్షలు టోకరా

image

క్షుద్రపూజలు చేసి నయం చేస్తామని రూ.9.73లక్షలు తీసుకుని మోసం చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. CI నాగభూషణరావు వివరాలు.. వనపర్తి జిల్లా గోపాల్‌వేటకు చెందిన సుద్దుల రాజు కొడుకు వెంకటేశ్(14)కు మతిస్తిమితం సరిగా లేదు. జ్యోతిష్యాలయం పేరుతో నయం చేస్తామని నమ్మించి మోసం చేసిన APలోని గుంటూరుకు చెందిన పరబ్రహ్మం, వెంకన్న, గోపిను అరెస్ట్ చేసి ఫోన్లు, రూ.7లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

News April 6, 2024

MBNR: ఓటర్లకు కలెక్టర్ల సూచనలు

image

✔ఫారం-12 నింపి, ఓటర్ కార్డు జత చేసి పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ✔పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుకు ఏప్రిల్ 15 లాస్ట్
✔మే 3 నుంచి 8 వరకు పోస్టల్ బ్యాలెట్ అందజేసిన వారికి ఓటు హక్కు వినియోగించుకునే ఛాన్స్
✔18 ఏళ్ల వయసు ఉంటే నూతన ఓటరుగా దరఖాస్తు
✔ఏప్రిల్ 14లోపు నూతన ఓటర్ నమోదు
✔మే 13వ తేదీన లోక్ సభ ఎన్నికల పోలింగ్

•ఈ మేరకు ఉమ్మడి జిల్లా రిటర్నింగ్ అధికారులు, కలెక్టర్లు సూచించారు.

News April 6, 2024

ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు

image

JEE మెయిన్స్ సెషన్-2 పరీక్షలు ఉమ్మడి పాలమూరులో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని ఫాతిమా విద్యాలయంలో ఉదయం పూట నిర్వహించిన పరీక్షకు 147మందికి గాను 135మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 147మందికి గాను 134మంది హాజరయ్యారు. ధర్మాపూర్ సమీపంలోని జేపీఎన్సీఈ కళాశాలలో ఉదయం నిర్వహించిన పరీక్షకు 180మందికి గాను 158మంది, మధ్యాహ్నం 180కి గాను 162 మంది హాజరయ్యారు. పీడబ్ల్యూడీ అభ్యర్థులు 9 మందికి 1 గైర్హాజరయ్యారు.

News April 6, 2024

నేడు తుక్కుగూడ సభ.. పాలమూరు వాహనదారులకు అలర్ట్

image

కాంగ్రెస్‌ పార్టీ శనివారం తుక్కుగూడలో తలపెట్టిన జనజాతర బహిరంగ సభ నేపథ్యంలో.. సభకు వచ్చే వాహనదారులకు, సాధారణ వాహనదారులకు రాచకొండ సీపీ తరుణ్‌జోషి పలు సూచనలు చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు. MBNR నుంచి వచ్చే వాహనాలు ఓఆర్‌ఆర్‌ బెంగుళూరు టోల్‌ నుంచి రావిర్యాల టోల్‌ వద్దనుంచి ఫ్యాబ్‌సిటీ వద్ద పార్కింగ్‌ ప్రాంతానికి చేరుకోవాలని సూచించారు.