India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు సీబీఎస్సీ SSC ఫలితాల్లో సత్తాచాటారు. ఈ మేరకు శివకార్తీక్ 485, అలివేలి కీర్తి 478, మరో 34 మంది ఏ1 గ్రేడ్, 53 మంది ఏ2, 67 మంది బీ1, 59 మంది బీ2గా గ్రేడింగ్ పొందారు. ఎస్సెస్సీలో మొత్తం 84 మంది ఉత్తీర్ణులు అయినట్లు ప్రిన్సిపాల్ సురేందర్ తెలిపారు.
2024-25 సంవత్సరం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో అందించే పీజీ డిప్లొమా స్పోర్ట్స్, డిప్లొమా స్పోర్ట్స్ కోచింగ్కు దరఖాస్తు చేసుకోవాలని డీవైఎస్ఓ సీతారాం తెలిపారు. గ్వాలియర్ లోని ది లక్ష్మీబాయి నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో స్పోర్ట్స్ కోచింగ్ అందించనున్నట్లు, ఆసక్తిగల వారు ఈనెల 20వ తేదీలోగా www.inipe.edu.inలో దరఖాస్తు చేసుకోవాలని.. 25న అర్హత పరీక్ష ఉంటుందని తెలిపారు.
మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో 2019 ఎన్నికలతో పోల్చితే ఈ సారి 7.12 శాతం పోలింగ్ పెరిగింది. 2019లో 65.31 శాతం నమోదు కాగా ఈసారి 72.43 శాతం నమోదైంది. 2019లో ఇక్కడి నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి (BRS) 77,829 భారీ మెజార్టీతో కే అరుణ(BJP)పై గెలుపొందారు. కాగా ఈ ఎన్నికలో చల్లా వంశీ చంద్ రెడ్డి (INC), మన్నె శ్రీనివాస్ రెడ్డి(BRS),డీకే అరుణ(BJP)బరిలో ఉన్నారు. గెలుపెవరిదో కామెంట్ చేయండి.
నా గెలుపు పోలింగ్‌కు ముందే నిర్ణయమైందని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. తనను గెలిపించాలని ప్రజలు ముందే నిర్ణయించుకున్నారని వ్యాఖ్యానించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దేశం కోసం.. ధర్మం కోసం.. అంటూ ఏకపక్షంగా బీజేపీకి ప్రజలు ఓటేశారని అన్నారు. మహబూబ్‌నగర్ స్థానంలో విజయం కాషాయ పార్టీదేనని జోస్యం చెప్పారు.
ఎంపీ ఎన్నికల తుది పోలింగ్ శాతాన్ని CEO వికాస్ రాజ్ ఈరోజు ప్రకటించారు. MBNR ఎంపీ స్థానంలో 72.43%, NGKLలో 69.46% నమోదైంది. అసెంబ్లీ స్థానాల వారీగా దేవరకద్ర-74.50%, జడ్చర్ల-77.92%, కొడంగల్-71.04%, మహబూబ్ నగర్-66.27%, మక్తల్-71.63%, నారాయణపేట్-69.13%, షాద్‌నగర్-77.40%, అచ్చంపేట-65.11%, అలంపూర్-74.06%, గద్వాల్-74.93%, కల్వకుర్తి-72.51%, కొల్లాపూర్-65.11%,నాగర్ కర్నూల్-67.94%, వనపర్తి-66.66%గా నమోదైంది.
పాలమూరులో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు హక్కును వినియోగించుకుని బాధ్యతను నెరవేర్చారు. ఇక లెక్కింపే తరువాయి. ఓటింగ్ శాతం బాగా పెరగడంతో ఇది ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలమన్న చర్చలు సర్వత్రా నడుస్తున్నాయి. ఓవైపు అధికార పక్ష నేతలు, మరోవైపు ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఎవరికి వారు తమ గెలుపుపై ధీమాతో కనిపిస్తున్నారు. మేమే గెలుస్తామంటే మేమే గెలుస్తామంటున్నారు. మరి గెలుపు ఎవరిది?
జనరల్ స్థానమైన MBNRతో పాటు ఎస్సీ రిజర్వ్ స్థానమైన NGKL పార్లమెంట్ పరిధిలోని దాదాపు అన్ని అసెంబ్లీ స్థానాల్లో “సైలెంట్” ఓటింగ్ కొనసాగినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. MBNR నుంచి 31 మంది, NGKL 19 మంది బరిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలాపడ్డ పార్టీకి చెందిన ఓట్లు రెండు నియోజకవర్గాల్లో వేరే పార్టీ అభ్యర్థికి క్రాస్ అయినట్లు చర్చ సాగుతోంది. క్రాస్ ఓటింగ్ ఎవరికి కలిసి వచ్చేనో చూడాలి.
మక్తల్ పట్టణంలోని టీవీఎస్ షోరూం నిర్వాహకుడు మహేశ్ గౌడ్ కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. స్థానికుల వివరాలు.. చింతరేవులకు చెందిన మహేశ్ మక్తల్‌లో నిర్మిస్తున్న ఇంటి దగ్గరికి సోమవారం రాత్రి వెళ్లాడు. అక్కడ తెగిపడిన సర్వీస్ వైరుకు తగలడంతో షాక్‌కు గురయ్యాడు. రెండు గంటలైనా ఇంటికి రాకపోడవంతో కుటుంబీకులు వెళ్లి చూడగా పడి ఉన్నాడు. వారు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందాడని డాక్టర్లు నిర్ధారించారు.
గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ట్రాన్స్ జెండర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గద్వాల పట్టణం వేణుకాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ట్రాన్స్ జెండర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడం సంతృప్తిని ఇచ్చిందన్నారు. నారాయణపేట జిల్లా మండలం జాజాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ట్రాన్స్ జెండర్ జనని తన ఓటు వేశారు.
నాగర్ కర్నూల్ లోక్ సభ పరిధిలో అచ్చంపేట, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, గద్వాల, అలంపూర్, వనపర్తి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. లోక్ సభ పరిధిలో మొత్తం 17,38,254 మంది ఓటర్లు ఉండగా, సాయంత్రం వరకు 69.01 శాతం ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో 62.23 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ సారి 6.78 శాతం ఓటింగ్ పెరిగింది.
Sorry, no posts matched your criteria.