Mahbubnagar

News May 14, 2024

మిడ్జిల్: కరెంట్ షాక్‌తో యువ రైతు మృతి

image

కరెంట్ షాక్‌తో యువరైతు మృతి చెందిన ఘటన మిడ్జిల్ మండలం వస్పుల గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీశైలం(34) పొలం వద్ద ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఫ్యూజ్ చేసే క్రమంలో కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News May 14, 2024

MBNR: విజయంపై ఎవరి ధీమా వారిదే..!

image

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో హోరాహోరీగా తలపడిన నాయకులు ఎన్నికలు ముగిసిన అనంతరం విజయంపై ఎవరికి వారే ధీమాతో ఉన్నారు. MBNR, NGKL స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. రెండు నియోజకవర్గాలలో గతంలో కంటే ఈసారి అధికంగా పోలింగ్ శాతం నమోదు కావడం ఎవరికి లాభం చేకూరుస్తుంది అనే అంశంపై నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. అటూ ఫేక్ సర్వేలు వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి.

News May 14, 2024

ఓటేసేందుకు వెళ్తుండగా తేనెటీగల దాడి

image

అమ్రాబాద్: ఓటేసేందుకు వెళ్తున్న ఓటర్లపై తేనెటీగలు దాడి చేయడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్థుల కథనం ప్రకారం.. వట్వర్లపల్లిలోని ఆశ్రమ పాఠశాలలో సోమవారం ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటేసేందుకు కొందరు ఓటర్లు వెళ్తున్నారు. కొందరు పిల్లలు ఆ సమీపంలోని తేనెతుట్టెపై రాళ్లు విసరడంతో కందిరీగలు ఒక్కసారిగా లేచి ఆ సమీపంలోని వారిపై దాడి చేశాయి. దీంతో వారిని 108లో అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు.

News May 14, 2024

MBNR: కొండెక్కిన కోడిగుడ్డు ధర

image

కోడిగుడ్డు ధర కొండెక్కి కూర్చుంది. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొన్ని ప్రధాన పట్టణాల్లో రెండు రోజులుగా గుడ్ల లభ్యత లేదు. దీంతో గుడ్డు ధరలు పెరిగి సామాన్యుడికి అందుబాటులో లేకుండాపోయాయి. నెల రోజుల వ్యవధిలో ఫాం వద్ద గుడ్డు ధర సుమారు 90 పైసలు పెరిగింది. రిటైల్ మార్కెట్లో ఒక్క గుడ్డును రూ.6.50 నుంచి రూ. 7 వరకు విక్రయిస్తున్నారు.

News May 13, 2024

భారీ మెజార్టీతో గెలుస్తాం: డీకే అరుణ

image

మూడు లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తానని బిజెపి అభ్యర్థి డీకే అరుణ అన్నారు. మక్తల్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు గెలుపు కనుచూపు మెడలో కనిపించడం లేదని అన్నారు. గత 10 ఏళ్లు ప్రధానమంత్రిగా మోడీ చేసిన పాలనకు దేశంలోని ప్రజలు ఆకర్షితులై ఆయనను మూడోసారి ప్రధానమంత్రిగా చూడాలన్న తపనతో దేశ ప్రజలు ఉన్నారని, అందులో భాగంగానే తెలంగాణలో మెజారిటీ సీట్లను గెలుచుకుంటామని ఆమె అన్నారు.

News May 13, 2024

MBNR: యాక్సిడెంట్.. యువకుడి మృతి

image

కొడంగల్ పరిధి కోస్గి మండల శివారులో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగి ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం భిచ్చాల్ గ్రామానికి చెందిన విష్ణు గౌడ్(18) బైక్ పై వెళుతుండగా అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్నాడు. ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు సమాచారం.

News May 13, 2024

MBNRలో 68.40.. NGKLలో 66.53 శాతం పోలింగ్

image

ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. సా. 5గం. వరకు MBNR పరిధిలో 68.40, నాగర్ కర్నూల్‌లో 66.53 పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ వివరాలు ఇలా..⏵నాగర్‌కర్నూల్- 63.56, వనపర్తి- 63.79, గద్వాల- 72.71, ఆలంపూర్- 71.23, అచ్చంపేట- 62.70, కల్వకుర్తి-69.83, కొల్లాపూర్- 61.88⏵మహబూబ్‌నగర్-63.26, జడ్చర్ల-72.13, దేవరకద్ర-71.90, నారాయణపేట-66.67, మక్తల్-67.61, షాద్‌నగర్-72.42, కొడంగల్-65.54 శాతం నమోదైంది.

News May 13, 2024

మహబూబ్ నగర్: మరో గంట మాత్రమే ఉంది.. వేకప్

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కాగా కొన్నిపోలింగ్ కేంద్రాల్లో ప్రధాన పార్టీలకు చెందిన నాయకుల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు జరగగా పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. మరో గంటలో పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో ఓటర్లు త్వరగా ఓటేసేందుకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఓటు వేయనట్లయితే త్వరగా వెళ్లండి. – SHARE IT

News May 13, 2024

3PM: MBNRలో 58.92.. NGKLలో 57.17 శాతం పోలింగ్

image

ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. మ. 3గం. వరకు MBNR పరిధిలో 58.92, నాగర్ కర్నూల్‌లో 57.17 పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ వివరాలు ఇలా..⏵నాగర్‌కర్నూల్- 52.21, వనపర్తి- 56.19, గద్వాల- 64.39, ఆలంపూర్- 63.04, అచ్చంపేట- 52.86, కల్వకుర్తి-60.70, కొల్లాపూర్- 50.40⏵మహబూబ్‌నగర్-52.45, జడ్చర్ల-63.73, దేవరకద్ర-61.92, నారాయణపేట-54.99, మక్తల్-59.43, షాద్‌నగర్-60.26, కొడంగల్-60.44 శాతం నమోదైంది.

News May 13, 2024

1 PM: MBNRలో 45.84.. NGKLలో 45.88 శాతం పోలింగ్

image

ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. మ. 1గం. వరకు MBNR పరిధిలో 45.84, నాగర్ కర్నూల్‌లో 45.88 పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ వివరాలు ఇలా..⏵నాగర్‌కర్నూల్- 44.72, వనపర్తి- 46.28, గద్వాల- 50.45, ఆలంపూర్- 51.11, అచ్చంపేట- 44.82, కల్వకుర్తి-46.85, కొల్లాపూర్- 36.52⏵మహబూబ్‌నగర్-42.08, జడ్చర్ల-49.53, దేవరకద్ర-48.93, నారాయణపేట-45.25, మక్తల్-43.78, షాద్‌నగర్-44.30, కొడంగల్-47.59 శాతం నమోదైంది.