Mahbubnagar

News April 3, 2024

MBNR: విమర్శలకు పదును పెట్టిన డీకే అరుణ

image

మహబూబ్ నగర్ బిజెపి అభ్యర్థి డీకే అరుణ కాంగ్రెస్ అభ్యర్థిపై విమర్శలకు పదును పెట్టారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అరుణ కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రధాన పోటీ కాంగ్రెస్ బిజెపి పార్టీల మధ్య ఉండే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అరుణ, వంశీని టార్గెట్ చేసి ముందుకు సాగుతున్నారు.

News April 3, 2024

మహబూబ్ నగర్‌లో పెరుగుతున్న ఎండలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎండలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. GDWL, NRPT జిల్లాలో
గత 24 గంటల్లో ఏకంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. NGKL, MBNR, WNPT జిల్లాలలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డైంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎండ తీవ్రత పెరుగుతుందని, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

News April 3, 2024

మద్దూర్: పెళ్లైన మూడు రోజులకే సూసైడ్

image

పెళ్లైన మూడు రోజులకే వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్దూర్ మండల ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. నందిపాడు గ్రామానికి చెందిన మమత(20) అదే గ్రామానికి చెందిన మహేశ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. గత నెల16న పురుగు మందు తాగగా, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

News April 3, 2024

MBNR: అంతర్రాష్ట్ర పోలీస్ అధికారుల సమన్వయ సమావేశం

image

రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో అంతరాష్ట్ర (తెలంగాణ & కర్ణాటక) సరిహద్దు పోలీసు అధికారుల సమన్వయ సమావేశం మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. బళ్లారి రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ లోకేష్ కుమార్, జోన్-7 జోగులాంబ డిఐజి చౌహాన్, ఉమ్మడి జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు. ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని చర్చించారు.

News April 3, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులకు కల్లాల కష్టాలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో యాసంగి వరికోతలు ప్రారంభమయ్యాయి. దీంతోపాటే రైతులకు కల్లాల కష్టాలు మొదలయ్యాయి. పది రోజుల్లో కోతలు ముమ్మరం కానుండటంతో ఇప్పటి నుంచే ధాన్యం ఆరబోతకు పడరాని పాట్లు పడుతున్నారు. కోతలు ప్రారంభమైతే అనేక ప్రాంతాల్లో రహదారులే కల్లాలుగా మారుతున్నాయి. ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ క్షేత్రాల వద్ద కల్లాలు నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించినా ఆచరణలో అమలు కాలేదు.

News April 3, 2024

MP ఎన్నికలు.. MBNR, NGKLలో తీవ్ర పోటీ!

image

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. MBNR, NGKL అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రజా ఆశీర్వాదం అంటూ బీజేపీ, ప్రజాపాలన అంటూ కాంగ్రెస్, కేంద్రంలో తెలంగాణ గళం పేరిట బీఆర్ఎస్ నేతలు ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. మూడు ప్రధాన పార్టీల్లో అభ్యర్థులు బలంగా ఉండడంతో తీవ్ర పోటీ నెలకొంది.

News April 3, 2024

MBNR: అక్క గెలుపు కోసం.. ప్రచారంలో చెల్లెళ్లు

image

తమ సోదరి పాలమూరు పార్లమెంటు బిజెపి అభ్యర్థి డీకే అరుణ గెలుపు కోసం ఆమె చెల్లెళ్లు పద్మావతి, సువర్ణ, సురేఖలు ప్రచారంలో భాగంగా తమ వంతు సహాయం చేస్తున్నారు. వివిధ మండలాల్లో నిర్వహిస్తున్న విస్తృత స్థాయి సమావేశాలకు డీకే అరుణతో పాటు హాజరవుతున్నారు. స్థానికురాలైన తమ సోదరి గెలిపిస్తే కేంద్ర స్థాయిలో ఆమెకు ప్రభుత్వం మంచి ప్రాధాన్యం ఇస్తుందని, తద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి జరుగుతుందని వివరిస్తున్నారు.

News April 3, 2024

MBNR: పాలమూరు యూనివర్సిటీలో క్యాంపస్ సెలక్షన్స్.. 25 మంది ఎంపిక

image

పాలమూరు యూనివర్సిటీలో విజయశ్రీ బయో ఫెర్టిలైజర్స్ ఆధ్వర్యంలో మంగళవారం క్యాంపస్ సెలక్షన్లు నిర్వహించారు. ఈ మేరకు సెలక్షన్స్ మొత్తం 32 మంది విద్యార్థులు హాజరవగా 25 మంది మౌఖిక పరీక్షకు హాజరైనట్లు ప్లేస్‌మెంట్ అధికారి అర్జున్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రంజిత్ రెడ్డి, పరుశురాం, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

News April 3, 2024

MBNR: పెళ్లి ఇంట విషాదం.. వధువు చెల్లి మృతి

image

ధరూర్ మండలం గార్లపాడు గ్రామంలో మంగళవారం ఈతకు వెళ్లి బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. కుర్వ నాగేంద్ర కూతురు మమత(10) వ్యవసాయ బావిలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లింది. ప్రమాద వశాత్తు నీట మునగటంతో ఊపిరాడక మృతి చెందింది. గ్రామస్థులు బాలిక మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీశారు. బుధవారం పెద్ద కూతురు వివాహం ఉండగా, చిన్న కూతురు మృతితో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.

News April 3, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✏నేటి నుంచి 10వ తరగతి వ్యాల్యూషన్
✏దేవరకద్ర:నేడు ఉల్లిపాయల వేలం
✏నేటి రంజాన్ వేళలు:
ఇఫ్తార్(బుధ)-6:36,సహార్(గురు)-4:38
✏MBNR:నేడు PUలో ఉద్యోగ మేళా
✏ఉమ్మడి జిల్లాలో గంజాయి, సారా నియంత్రణపై అధికారుల ప్రత్యేక ఫోకస్
✏అలంపూర్:నేడు పలు గ్రామాలలో కరెంట్ కట్
✏వరి కొనుగోలు ధాన్యాలపై అధికారుల సమీక్ష
✏పలు నియోజకవర్గాల్లో MBNR&NGKL ఎంపీ అభ్యర్థుల పర్యటన
✏ఎలక్షన్ కోడ్.. ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లో నిఘా