Mahbubnagar

News May 12, 2024

ఓటు వేయడానికి గుర్తింపు కార్డు తప్పనిసరి

image

1.ఓటర్ ఐడి 2.పాస్ పోర్ట్ 3.డ్రైవింగ్ లైసెన్స్ 4.ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు గుర్తింపు కార్డులు 5.పోస్టాఫీసు పాస్ బుక్ 6.పాన్కార్డు 7.ఆర్టీజీ ఎన్పీఆర్ స్మార్ట్ కార్డు 8.మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి జాబ్ కార్డు 9.ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు10. ఫొటోతో కూడిన పింఛను పత్రం11. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అధికారిక గుర్తింపు కార్డులు 12.ఆధార్ కార్డు, వీటిలో ఏదైనా ఒకటి చూపించి మీరు ఓటు వేయవచ్చు.

News May 12, 2024

మహబూబ్‌నగర్: సగర్వంగా ఓటేద్దాం.!

image

ఓటింగ్ శాతాన్ని పెంచడానికి భారత ఎన్నికల సంఘం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు ఓటరు చైతన్యం కోసం వినూత్న కార్యక్రమాలు చేపట్టిన ఈసీ రెండ్రోజులుగా మెసేజ్‌లు పంపుతూ ఫోన్లు చేస్తోంది. ‘మీ ఓటు మీ స్వరం. ఈ ఎన్నికల్లో సగర్వంగా ఓటేద్దాం. ఎన్నికల పర్వం.. దేశానికి గర్వం’ అన్న సందేశాన్ని ఓటర్లకు చేరవేస్తోంది. పనులుంటే వాయిదా వేసుకోండి.. రేపు మాత్రం ఓటు వేయండి అంటూ పిలుపునిస్తోంది.
**GO VOTE.

News May 12, 2024

MBNR: ప్రలోభ పెట్టే అంశాలపై ఫిర్యాదు చేయొచ్చు

image

కేంద్ర ఎన్నికల సంఘం తెచ్చిన సీ-విజిల్ మొబైల్ యాప్‌లో ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాలపై ఫిర్యాదు చేయొచ్చని, వీడియోలు, ఫొటోలతో యాప్‌లో ఫిర్యాదు ఇస్తే 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారు. తనిఖీ బృందాలు, ఎన్నికల పరిశీలకులు, ఇతర నిఘా బృందాలు నిరంతరం ఫిర్యాదులను పర్యవేక్షిస్తుంటాయి. అనధికార ప్రచారాలు, ఓటర్లను భయపెట్టడం, దాడులపై ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.

News May 12, 2024

MBNR: నగదు, మద్యం పంపిణీపై ప్రత్యేక నిఘా: SP

image

నగదు, మద్యం పంపిణీపై ప్రత్యేక నిఘా ఉంచామని ఎస్పీ హర్షవర్ధన్ అన్నారు. మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ..”881 పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నామని, అతి సమస్యాత్మకమైన 58 పోలింగ్ కేంద్రాల వద్ద బలగాలు మోహరిస్తున్నామని, పోలింగ్ రోజు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ప్రశాంతంగా స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నాం” అని వెల్లడించారు.

News May 12, 2024

MBNR: ఇప్పటి వరకు భారీ నగదు, విలువైన మద్యం సీజ్

image

మహబూబ్ నగర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఈనెల 13న నిర్వహించే పోలింగ్‌కు పకడ్బందీగా ఏర్పాటు చేశామని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రవినాయక్ తెలిపారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “ఇప్పటి వరకు రూ.2.41కోట్ల నగదు, రూ.1.81కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేశామని, నియోజకవర్గంలో పరిధిలో 927 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌తో ఎన్నికల సరళిని పరిశీలించనున్నట్లు” వెల్లడించారు.

News May 12, 2024

అలంపూర్ చౌరస్తా డాబాలో అల్లు అర్జున్

image

అలంపూర్ చౌరస్తా శివారులో జాతీయ రహదారిపై ఉన్న గురునానక్ ధాబాలో సిని హీరో అల్లు అర్జున్ భోజనం చేసి వెళ్లారు. శనివారం హైదరాబాద్ నుంచి నంద్యాల జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా నంద్యాలకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో డాబా దగ్గర భోజనం చేశారు. అభిమానులు ఫొటోల కోసం పోటీపడ్డారు. అయితే దాబా యజమాని తిరుపాల్ సింగ్ కుటుంబ సభ్యులకు మాత్రమే ఫొటో దిగేందుకు అనుమతి ఇచ్చారు.

News May 12, 2024

ముగిసిన ప్రచారం.. శబ్దానికి విరామం

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం 6 గంటలకు తెరపడింది. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ కంటే 48 గంటల ముందే అన్ని పార్టీల వాళ్లు ప్రచారం ఆపేశాయి. రెండు నెలలుగా ప్రచార వాహనాలు, పాటలతో హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ప్రచార వాహనాలకు అంటించిన పార్టీ స్టిక్కర్లు, హోర్డింగులకు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు తొలగించేశారు.

News May 12, 2024

MBNR, NGKL పార్లమెంట్ పరిధిలోని ఓటర్లు!!

image

✓ కొడంగల్ అసెంబ్లీలో – 2,41,794
✓ నారాయణపేట – 2,36,182
✓ మహబూబ్‌నగర్ – 2,59,260
✓ జడ్చర్ల – 2,22,838
✓ దేవరకద్ర – 2,39,745
✓ షాద్‌నగర్ – 2,38,478
✓ మక్తల్ – 2,44,173
✓ వనపర్తి – 2,73,863
✓ గద్వాల – 2,56,637
✓ అలంపూర్ – 2,40,063
✓ నాగర్‌కర్నూల్ – 2,36,094
✓ అచ్చంపేట – 2,47,729
✓ కల్వకుర్తి – 2,44,405
✓ కొల్లాపూర్ – 2,39,463 మంది ఓటర్లు ఉన్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో వనపర్తిలో అత్యధిక ఓట్లు ఉన్నాయి.

News May 12, 2024

NRPT: 1300 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు

image

పోలీస్ అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ పోలీస్ అధికారులకు సూచించారు. జిల్లాలో ఎన్నికల సందర్భంగా విధులు నిర్వహించేందుకు వచ్చిన పోలీస్ అధికారులతో నారాయణపేటలోని శెట్టి ఫంక్షన్ హాలులో శనివారం సమావేశం నిర్వహించారు. విధులకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని 550 పోలింగ్ కేంద్రాల వద్ద 1300 మంది పోలీసులతో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

News May 11, 2024

MBNR: సాయత్రం 6 నుంచి 144 సెక్షన్ అమలు

image

లోక్ సభ ఎన్నిక నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలవుతోందని ఉమ్మడి జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. నలుగురు కన్నా ఎక్కువ మంది గుమిగూడొద్దని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఆరు గంటల నుంచి ప్రచారం చేయొద్దని తేల్చి చెప్పారు. మే13 సాయంత్రం 6.30 నిమిషాల వరకు 144 సెక్షన్ ఉంటుందని వివరించారు.