India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి కాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. షాద్‌నగర్ రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. ‘ఉమ్మడి పాలకుల కంటే కేసీఆర్ ఎక్కువ ద్రోహం చేశారు. పదేళ్లు ప్రధానిగా మోదీ తెలంగాణకు ఏమి ఇవ్వలేదు. ITIR, బయ్యారం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలు ఏమయ్యాయి. మోడీ వచ్చారు. రాష్ట్రానికి ఏమిస్తారో చెప్పలేదు. మోడీ అవినీతి గురించి మాట్లాడేటప్పుడు పక్కన ఉన్నది ఎవరో చూడాలి’ అని ఎద్దేవా చేశారు.
పాలమూరును సస్యశ్యామలం చేసే బాధ్యత తనదేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మక్తల్ జన జాతర సభలో ఆయన మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ వస్తేనే పాలమూరుకు రైలు, పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా. BJPకి వేసే ప్రతి ఓటు.. మీ రిజర్వేషన్ల రద్దుపై తీర్పు. మోదీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తాడు. మోదీ మళ్లీ గెలిస్తే మనుషుల మధ్య చిచ్చు పెడతాడు. బీజేపీకి ఎవరైనా ఓటు వేస్తే రాష్ట్రం విధ్వంసం అవుతుంది’ అని అన్నారు.
MBNRలో కాంగ్రెస్, BRS పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. నారాయణపేట బీజేపీ సభలో ఆయన ప్రసంగించారు. DK అరుణపై ముఖ్యమంత్రి అవమానకరమైన భాష మాట్లాడుతున్నారు. ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రజలు సమాధానం చెప్పాలని మోదీ అభ్యర్థించారు. మోదీ చౌకీదార్‌గా ఉండగా ఎవరి హక్కులు లాక్కోలేరు. డీకే అరుణకు వేసే ప్రతి ఓటు నేరుగా నా దగ్గరికి వస్తుంది’ అని అన్నారు.
13న జరిగే పార్లమెంట్ ఎన్నిక పాలమూరు భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నిక అని MBNR కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నారు. మక్తల్ జన జాతర సభలో ఆయన మాట్లాడుతూ.. ‘మనం ఎన్నో ఎన్నికలను చూసి ఉంటాం.. కానీ సోమవారం జరిగే పార్లమెంట్ ఎన్నికకు చాలా తేడా ఉన్నది. ఈ ఎన్నిక కేవలం వంశీచంద్ రెడ్డికి ఇంకో అభ్యర్థికి మధ్యన జరుగుతున్న ఎన్నిక కాదు. పాలమూరు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన ఎన్నిక’ అని అన్నారు.
BRS పాలనలో పాలమూరు నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మక్తల్ జన జాతర సభలో ఆయన మాట్లాడుతూ.. ‘పదేళ్లు అధికారంలో ఉండి పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయలేదు. పాలమూరు-రంగారెడ్డి KCR ధనదాహానికి బలైంది. జిల్లా నుంచి కృష్ణా జలాలు వెళ్తున్నా.. ఇక్కడి భూములు ఎడారి చేశారు. ఇక్కడి కొందరు ఢిల్లీ సుల్తానులకు బానిసలయ్యారు. డీకే అరుణ ఢిల్లీ సుల్తానుల పంచన చేరింది’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మక్తల్ నియోజకవర్గంలో నిర్వహించిన జనజాతర బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పర్ణిక రెడ్డి, వాకిటి శ్రీహరి, ఇతర కాంగ్రెస్ ముఖ్య నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. జన జాతర సభకు ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
పాలమూరులో ఎన్నో వనరులున్నా.. ఇక్కడి జనం వలస పోతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘జోగులాంబ అమ్మవారికి నా ప్రణామాలు. గత పదేళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. పదేళ్లలో తెలంగాణకు పంపిన లక్షల కోట్లు ఎటు పోయాయి? పదేళ్లలో BRS, ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణను లూటీ చేస్తోంది. కాళేశ్వరం విచారణకు కాంగ్రెస్ ముందుకు రావడం లేదు’ అని నారాయణపేట బహిరంగ సభలో మోదీ వ్యాఖ్యానించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి… అత్యధికంగా గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది, మహబూబ్నగర్ కొత్తపల్లిలో 40.0, వనపర్తి జిల్లా పానగల్లో 39.9, నారాయణపేట జిల్లా ఉట్కూరులో 39.7, నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లిలో 39.3 డిగ్రీలు గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కాంగ్రెస్ నాయకులు అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని మహబూబ్ నగర్ MP అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ధన్వాడలో కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వీరి మాటలను ఖండించాల్సిన ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి నవ్వులు చిందించడం విస్మయం కలిగించిందన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని MBNR, NGKL పార్లమెంట్ నియోజకవర్గాల్లో 100 శాతం ఓటింగ్ నమోదయ్యేలా అధికారులు ఇప్పటికే ప్రజల్లో అవగాహన కల్పించారు. ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల అధికారులకు కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఓటేసి మనమేంటో చూపిద్దాం. మే 13న తరలిరండి అంటూ అధికారులు పిలుపునిచ్చారు.
Sorry, no posts matched your criteria.