India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తేనెటీగల దాడిలో యువకుడు మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తారక్(22) తన వ్యవసాయ పొలంలో ట్రాక్టర్‌తో నేలను దున్నుతున్న క్రమంలో చెట్టు పై ఉన్న తేనెటీగలు ఒకసారిగా తారక్ పై దాడి చేయడంతో వాటి నుంచి తప్పించుకునే క్రమంలో పరిగెత్తుకుంటూ పొలంలో వెళుతుండగా బోర్లపడి మృతి చెందాడు. తారక్ అవివాహితుడు గ్రామంలో విషాదం నెలకొంది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు ఎంపీ స్థానాల్లో ఎన్నికల బరిలో ఉన్న 50 మంది అభ్యర్థులు తమ గెలుపు కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. సభలు, సమావేశాలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈనెల 13న పోలింగ్ ముగిసిన తర్వాత, ఓటర్ల పని పూర్తవుతుంది. అభ్యర్ధులకు మాత్రం ఆ మరుసటి రోజు నుంచి టెన్షన్ ప్రారంభం కానుంది. ఫలితం కోసం 22 రోజుల నిరీక్షణ తప్పదు. దేశవ్యాప్తంగా జూన్ 4న ఫలితాలు రానున్నాయి.
సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడటంతో పాలమూరులో ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాలపై దృష్టిసారించాయి. MBNR, NGKL లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, BRS, BJP మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటి వరకు ఆయా పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయి సమావేశాలు, బహిరంగ సభలు, కూడలి సమావేశాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఇక ప్రచారం మూడు రోజులు ఉండడంతో అభ్యర్థులలో ఉత్కంఠ నెలకొంది.
MBNR: తాగునీటి అవసరాల కోసం కర్ణాటక రాష్ట్రంలోని నారాయణపూర్ జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. రాయచూర్ థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రానికి ఒక టీఎంసీ నీటిని విడుదల చేసి ఆ తరువాత నీటిని విడతల వారీగా విడుదల చేయనున్నారు. దీంతో గురు, శుక్రవారాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఇందిరా ప్రియదర్శి జూరాల ప్రాజెక్టుకు ఈ నీరు చేరుకుంటుంది.
పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి దగ్గర పడింది. ఈనెల 11న సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికల ప్రచారం ముగించాల్సి ఉంది. దీంతో ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు ఎంపీ స్థానాలలో ఆయా పార్టీల నాయకులు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. MBNR, NGKL స్థానాలలో నువ్వా నేనా అనే రీతిలో పోటీ కొనసాగుతుంది. బిజెపి, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
MBNR: 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం కళాశాలలో మంజూరైన ప్రతి సెక్షన్లో 88 మంది విద్యార్థులను మాత్రమే చేర్చుకోవాలని ఇంటర్ బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది. అదనపు సెక్షన్లు అవసరం అవుతే తప్పనిసరిగా ఇంటర్ బోర్డ్ అనుమతి తీసుకోవాలని జిల్లా ఇంటర్ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. దీన్ని ఉల్లంఘించిన కళాశాలలకు జరిమానాతో పాటు గుర్తింపును రద్దు చేయడం జరుగుతుందని అన్నారు.
NGKL జిల్లాలో 4 నెలల్లో 136 రహదారి ప్రమాదాలు చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ ప్రమాదాల్లో 68 మంది మరణించగా.. 168 మంది తీవ్రంగా గాయపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎక్కువగా బిజినేపల్లి మండలంలో ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. రహదారులపై వాహనాల నడుపుతున్న సమయంలో వేగాన్ని నియంత్రించలేకే ప్రమాదాల బారిన పడుతున్నారు. కాగా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024 ఓటర్ల జాబితాకు అదనంగా కొత్త ఓటర్లను చేర్చి ఎన్నికల అధికారులు తుది జాబితాను ప్రకటించారు. MBNR లోక్ సభ పరిధిలో 2,977 మంది పురుషులు, 8385 మంది స్త్రీలు, 3 ఇతరులు కలిపి మొత్తం 15,274 మంది.. NGKL లోక్ సభ నియోజకవర్గంలో 2501 మంది పురుషులు, 4585 మంది మహిళలు, ఇతరులు ఇద్దరు కలిపి మొత్తం 7,538 మంది కొత్తగా ఓటు నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య బిగ్ ఫైట్ జరుగుతుంది. MBNR పరిధిలో డీకే అరుణ(BJP), వంశీచంద్ రెడ్డి(కాంగ్రెస్), మన్నె శ్రీనివాస్ రెడ్డి(BRS) పోటీలో ఉన్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ మధ్య కేవలం 4 శాతం ఓట్ల తేడా మాత్రమే ఉందని సర్వేల్లో తేలడంతో ఇక్కడ సీఎం మరింత దృష్టి సారించారని టాక్. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి రేవంత్ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.
భవనం పైకప్పు కూలి ఓ కార్మికుడు మృతి చెందిన సంఘటన తాండూరులో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. బొంరాస్ పేట మండలం జానకంపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య (44) తాండూరులో కూలి పనికి వెళ్ళాడు. పనులు చేస్తుండగా పైకప్పు స్లాబు కూలి వెంకటయ్యపై కూలగా అక్కడికక్కడే మరణించాడు. జేసీబీ సహాయంతో బయటకి తీశారు. బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలని అర్థరాత్రి వరకు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని సముదాయించారు.
Sorry, no posts matched your criteria.