Mahbubnagar

News March 31, 2024

గద్వాల: నేను బహుజన ద్రోహిని కాదు: RSP

image

నేను బహుజన ద్రోహిని కాదని RS ప్రవీణ్ కుమార్ అన్నారు. నేడు గద్వాల బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో జరిగిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కొంతమంది నన్ను బహుజన ద్రోహిని అని అంటున్నారు. నేను నిజంగా బహుజన ద్రోహినే అయితే ఎన్నో పదవులను అనుభవించే వాడిని. బహుజన జాతికి సేవ చేసేందుకే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చా’ అని RSP క్లారిటి ఇచ్చారు.

News March 31, 2024

PU 16ఏళ్ల చరిత్రలో 9 మందికే PhD పట్టా

image

పాలమూరు యూనివర్సిటీలో అధ్యాపకుల కొరతతో ఉన్నత విద్య అరకోరగా సాగుతోంది. ఇక్కడ 105 బోధనా సిబ్బంది పోస్టులు ఉండగా కేవలం 86 మంది ఒప్పంద అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆయా జిల్లాలకు పెద్దదిక్కుగా ఉన్న PU 16ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు 9 మంది మాత్రమే పీహెచ్‌డీ పట్టా పొందడం గమనార్హం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధ్యాపకుల భర్తీపై దృష్టి సారిస్తేనే వర్సిటీ దశ మారే అవకాశం ఉంటుంది.

News March 31, 2024

వనవర్తి: కాంగ్రెస్‌లో చేరనున్న ఆ 8 మంది కౌన్సిలర్లు..?

image

వనపర్తి మున్సిపాలిటికి చెందిన 8 మంది BRS కౌన్సిలర్లు శనివారం ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే మున్సిపల్ ఛైర్మన్ పదవి ఆశిస్తున్న 13వ వార్డు కౌన్సిలర్ మహేష్ కౌన్సిలర్లతో కలిసి MLA మేఘారెడ్డితో ఆదివారం భేటీ అయి చర్చిస్తున్నట్లు సమాచారం. మహేశ్‌కు ఛైర్మన్ పదవికి కాంగ్రెస్ కౌన్సిలర్లు మద్దతు ఇస్తే కాంగ్రెస్‌లో చేరేందుకు 8 మంది కౌన్సిలర్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

News March 31, 2024

మైనార్టీలకు తమ ప్రభుత్వం పెద్ద పీట: ఒబేదుల్లా

image

అణగారిన మైనార్టీల అభివృద్ది కోసం తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర మైనార్టీ కార్పోరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ వివరించారు. ఈస్టర్ పండగ సందర్బంగా ఆదివారం రెమా చర్చిలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మాట్లాడారు. తమ ప్రభుత్వం మైనార్టీల పక్షపాతి అని ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. మైనార్టీలను అణచివేయాలని చేసే శక్తుల్ని తమ ప్రభుత్వం కూకటి వ్రేళ్ళతో పెకలిస్తోందన్నారు. 

News March 31, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ఉష్ణోగ్రత వివరాలివే..

image

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నేటి ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా గద్వాల జిల్లా ధరూర్ లో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నాగర్ కర్నూలు జిల్లా ఐనోల్లో 42.7, వనపర్తి జిల్లా కానాయిపల్లిలో 42.2, NGKL జిల్లా కిష్టంపల్లిలో 41.8, MBNR జిల్లా సల్కర్పేటలో 41.7, నారాయణపేట జిల్లా మరికల్లో 40.1, డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 31, 2024

వనపర్తి: మూడో అంతస్తు నుంచి పడి వాచ్‌మెన్‌ మృతి

image

నిర్మాణంలో ఉన్న భవనం మూడో అంతస్తు నుంచి పడి వాచ్‌మెన్‌ మృతి చెందాడు. అల్వాల్‌ పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా గోపాల్‌పేటకు చెందిన జి.కోటయ్య(55) నాలుగు నెలల క్రితం HYDకి వలస వచ్చారు. ఓల్డ్‌ అల్వాల్‌ పరిధి సూర్య నగర్‌‌లోని శ్రీబాలాజీ ఎన్‌క్లేవ్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. మూడో అంతస్తులో నిర్మించిన గోడలకు నీరు చల్లుతుండగా కాలు జారి రెండో అంతస్తులో పడి మృతి చెందాడు.

News March 31, 2024

రేపటి నుంచి వరి ధాన్యం కొనుగోలు.. కీలక ఆదేశాలు జారీ !

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి యాసంగి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు కీలక ఆదేశాలు జారీ చేశారు.
↪కేంద్రాల వద్ద టెంట్, తాగునీరు ఏర్పాటు చేయాలి
↪టార్పాలిన్లు,ఎలక్ట్రానిక్ కాంటా, తేమ కొలిచే యంత్రాలు, ప్యాడి క్లీనర్లు అందుబాటులో ఉండాలి
↪ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా ఏపీఎంలు చర్యలు తీసుకోవాలి
↪ఎన్నికల కోడ్.. ప్రజాప్రతినిధులు ప్రారంభోత్సవాలు చేయరాదు.

News March 31, 2024

MBNR: బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం..!

image

మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో దాగి ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ రెడ్డి ఈ ఎన్నికలో హోరాహోరీగా తలపడ్డారు. ప్రశాంతంగా ఎన్నికలు ముగియగా.. విజయంపై ఇరు పార్టీల నాయకులు ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 2న వెలువడే ఫలితాల కోసం నాయకులు ఎదురుచూస్తున్నారు.

News March 31, 2024

పాలమూరులో ‘పాగా’ వేసేది ఎవరో..?

image

మహబూబ్‌నగర్ లోక్ సభ పరిధిలో ప్రధాన పార్టీల నేతలు నువ్వా.. నేనా.. అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. BRS నుంచి ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి, BJP నుంచి డీకే అరుణ బరిలో ఉన్నారు. కాంగ్రెస్, BJP పార్టీలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. ఈసారి కూడా గెలుపు మాదే అని BRS, తామే గెలుస్తామని కాంగ్రెస్, బీజేపీ ధీమాలో ఉన్నాయి. మరి ఇక్కడ ‘పాగా’ వేసేది ఎవరో..? చూడాలి. దీనిపై మీ కామెంట్ ?

News March 31, 2024

MBNR: నేటితో ముగియనున్న ఇంటి పన్ను చెల్లింపు !

image

ఇంటి పన్ను బకాయిలపై 90శాతం వడ్డీ మాఫీ ద్వారా చెల్లించే విధానం నేటితో ముగియనుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మార్చి 31 వరకు ఇంటి పన్ను చెల్లిస్తే 90 శాతం వడ్డీ మాఫీ చేయడానికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లో ఈ అవకాశం నేటితో ముగియనుంది. మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఈ విషయాన్ని ప్రజలకు వివరిస్తున్నారు.