Mahbubnagar

News May 8, 2024

గద్వాల:పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలి: జిల్లా ఎన్నికల అధికారి

image

గద్వాల: ఎన్నికల కమిషన్ రూపొందించిన నియమ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి సంతోష్ పేర్కొన్నారు. ఎన్నికల సిబ్బందికి స్థానిక MLD ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా నిబంధనలు పాటిస్తూ సమర్థవంతంగా, పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలని సూచించారు.

News May 7, 2024

షాద్‌నగర్‌‌లో రేపు అస్సాం ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం

image

షాద్‌నగర్ నియోజకవర్గంలో రేపు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు అందే బాబయ్య తెలిపారు. షాద్‌నగర్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రేపు ఉదయం 8 గంటలకు కేశంపేట మండలంలోని ఇప్పలపల్లిలో ప్రారంభమై కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్, నందిగామ తదితర గ్రామాలలో సీఎం ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటారని తెలిపారు.

News May 7, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

▶ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
▶NRPT:BRSకు నలుగురు కౌన్సిలర్ల రాజీనామా
▶EVM స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించిన అధికారులు
▶MP ఎన్నికలు.. ప్రచారంలో స్పీడ్ పెంచిన జిల్లా నేతలు
▶దళితుడిని మంత్రిని చేసిన ఘనత మోదీది:మందకృష్ణ
▶జిల్లాలో పలుచోట్ల ఉపాధి కూలీలకు ఈవీఎంలపై అవగాహన కార్యక్రమాలు
▶కొల్లాపూర్:KCR గడీలో.. RSP బందీ: మంత్రి జూపల్లి
▶కొత్తపల్లి:బోనులో చిక్కిన చిరుత

News May 7, 2024

రేపటి నుంచి పాలమూరులో భారీవర్షాలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రేపటి నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. నాగర్‌కర్నూల్ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే సోమవారం రాత్రి ఈదురుగాలులతో పలుచోట్ల వాన జల్లులు కురిసాయి. దీంతో ప్రజలు ఎండలతో ఉపశమనం కలిగింది. మంగళవారం(నేడు) ఎండ తీవ్రత తగ్గింది.

News May 7, 2024

ఉమ్మడి జిల్లాలో పల్లెల్లో కనిపించని ప్రచారం

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఐదు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో హోరెత్తిన ప్రచారం ఇప్పుడు కనిపించడం లేదు.. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం సందడిగా లేదు. మరో నాలుగు రోజుల్లో (ఈ నెల 11తో) ఎంపి ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో వందల సంఖ్యలో గ్రామాలు ఉండడం, మండుటెండల కారణంగా అన్ని గ్రామాలకు వెళ్లడం సాధ్యం కావడం లేదని నేతలు పేర్కొంటున్నారు.

News May 7, 2024

నారాయణపేట: బీఆర్ఎస్‌కు నలుగురు కౌన్సిలర్ల రాజీనామా

image

నారాయణపేటకు చెందిన నలుగురు బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2, 12, 13, 15 వార్డుల కౌన్సిలర్లు అనిత సుభాశ్, వరలక్ష్మీ కార్తీక్, నారాయణమ్మ వెంకట్రాములు, రాజేశ్వరి శివరాంరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు.  వారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్‌రెడ్డి మూడు రంగుల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో శివకుమార్ రెడ్డి పాల్గొన్నారు.

News May 7, 2024

MBNR: ఓటింగును అడ్డుకుంటే మూడేళ్ల జైలు!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలింగ్ రోజున కేంద్రాల్లో ఎలాంటి సమస్యలకు తావు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బూత్ క్యాప్చరింగ్, ఈవీఎంలను ధ్వంసం చేయడం, బ్యాలెట్ పేపర్లను స్వాధీనం చేసుకోవడం, ఎన్నికల గుర్తులపై సిరా పోయడం తదితర చర్యలకు పాల్పడితే ఐపిసి సెక్షన్ 135ఏ, 136 ప్రకారం 3 నుంచి 5 సంవత్సరాల జైలుశిక్షతో పాటు జరిమానా విధించనున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.

News May 7, 2024

MBNR: గత అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు ఓటర్లు మద్దతు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో 2023 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు చాలా వరకు నోటా వైపు వెళ్లారు. ప్రతి నియోజకవర్గంలో దాదాపు వెయ్యి మంది ఓటర్లు నోటాకు మద్దతు ఇచ్చారు. అత్యధికంగా అచ్చంపేట నియోజకవర్గంలో 2,833 మంది నోటాకు ఓటు వేశారు. అత్యల్పంగా కల్వకుర్తి నియోజకవర్గంలో 661 మంది నోటాకు ఓటు వేశారు.

News May 7, 2024

MBNR: పెరిగిన దూకుడు.. క్లైమాక్స్‌కు ఎన్నికల ప్రచారం!

image

ఎన్నికల ప్రచారాలు క్లైమాక్స్ దశకు చేరుకుంటున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న MBNR, NGKLపార్లమెంటు నియోజకవర్గాలలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు, పలువురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గెలుపునకు మాత్రం BJP, కాంగ్రెస్, BRS అభ్యర్థులు ప్రధానంగా పోటీ పడుతున్నారు. ఈనెల11 వరకూ ప్రచారం ముగియనుండటంతో, ప్రచారంలో దూకుడుగా వెళుతున్నారు. ఇంటింటికి వెళుతూ ప్రతి ఓటరును కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారు.

News May 7, 2024

గద్వాల: గర్భంలోనే శిశువు మృతి

image

గర్భంలో శిశువు మృతి చెందిన ఘటన గద్వాల జిల్లా గట్టు మండలం బోయలగూడెం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన సుజాత (26) వీరేష్ దంపతులు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. సుజాత ప్రస్తుతం 9 నెలల గర్భిణి. సోమవారం పురిటి నొప్పులు రావడంతో గట్టు PHCకి వెళ్లారు. అక్కడి నుంచి జిల్లా ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ సాధారణ ప్రసవం చేశారు. అయితే గర్భంలో మగ శిశువు మృతి చెందాడు.