Mahbubnagar

News May 7, 2024

NGKL: మద్యం మత్తులో భర్తను చంపేసింది..!

image

మద్యం మత్తులో భర్తపై గొడ్డలితో దాడి చేసి హతమార్చిన సంఘటన బిజినేపల్లి మండలంలో చోటుచేసుకుంది. SI నాగశేఖర్ రెడ్డి వివరాలు.. మమ్మాయిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ, నాగయ్య భార్య భర్తలు. వీరు వ్యవసాయ పనులు చేస్తూ జీవించేవారు. వీరిద్దరూ మద్యానికి బానిసయ్యారు. సోమవారం మధ్యాహ్నం కూలీ పనులకు వెళ్లి వచ్చి గొడవ పడ్డారు. భర్త నిద్రపోయాక నాగయ్య మెడపై భార్య గొడ్డలితో నరికింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 7, 2024

MBNR: ఇంకా ఐదు రోజులు మాత్రమే!

image

లోక్‌సభ ఎన్నికల సంగ్రామానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ లోక్ సభ అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఈనెల 13న పోలింగ్ నిర్వహించనుండగా, 11న సాయంత్రం 5గంటల వరకు ప్రచారం ముగియనుండటంతో అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి ఇంకా 5 రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. MBNR, NGKL నియోజకవర్గాల్లో పెద్ద పట్టణాలు, పెద్ద గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ముఖ్యనేతలతో రహస్య భేటీలు నిర్వహిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు.

News May 7, 2024

గద్వాల: ఎలక్షన్ డ్యూటీలో ఏ చిన్న తప్పు జరగొద్దూ: కలెక్టర్

image

ఉద్యోగులు ఎలక్షన్ డ్యూటీలో ఏ ఒక్క చిన్న తప్పు ఆస్కారం లేకుండా డ్యూటీ చేయాలని కలెక్టర్ బీఎన్ సంతోష్ కుమార్ అన్నారు. సోమవారం గద్వాల జిల్లాలోని ఎర్రవల్లి చౌరస్తా ఏకశిలా పాఠశాలలో పీఓ, ఏపిఓ, ఓపిఓలకు పలుసూచనలు చేశారు. ఎలాంటి సందేహాలు ఉన్నా శిక్షణ తరగతిలోనే ట్రైనింగ్ మాస్టర్లచే సందేహాన్ని నివృత్తి చేసుకోవాలన్నారు. ఆర్డీవో, తహసీల్దార్లు పాల్గొన్నారు.

News May 6, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!

image

✏NGKL:తెలకపల్లిలో వైద్యం వికటించి..వ్యక్తి మృతి
✏NRPT:అక్రమంగా తరలిస్తున్న 16,560 లీటర్ల మద్యం పట్టివేత
✏ఎర్రవల్లి:వాహనం ఢీకొని మహిళ మృతి
✏కల్వకుర్తి:MLA కసిరెడ్డి వాహనానికి ప్రమాదం.. ఒకరి మృతి
✏WNPT:BJPకి పలువురు రాజీనామా
✏ప్రారంభమైన డిగ్రీ అప్లికేషన్లు..PU పరిధిలో 29,740 సీట్లు
✏EVM పై సిబ్బందికి అవగాహన
✏అచ్చంపేట:మాజీ ఎమ్మెల్యే గువ్వలకు నిరసన సెగ
✏ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి:TPUS

News May 6, 2024

కడ్తాల్: ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య

image

ప్రియుడితో భర్తను హత్య చేసిన కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కడ్తాల్ మండలంలోని మక్త మాదారం గ్రామ సమీపంలోని బట్టర్ ఫ్లై సిటీ వెంచర్‌లో గత నెల 30న గుర్తుతెలియని వ్యక్తిని దారుణంగా హత్యచేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాదులోని నాదర్‌గూల్‌కు చెందిన తాండ్ర రవీందర్ (45)ను అతని భార్య గీత ప్రియుడు యాదగిరి అనే వ్యక్తితో హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

News May 6, 2024

NGKL: వైద్యం వికటించి.. ఓ వ్యక్తి మృతి

image

వైద్యం వికటించి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన NGKL జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గౌరారం గ్రామానికి చెందిన చిన్న రాములు (38) అనారోగ్యం కావడంతో తెలకపల్లిలో ఓ ప్రైవేటు వైద్యుడి దగ్గరికి వెళ్లాడు. ఆ వైద్యుడు టైఫాయిడ్ వచ్చిందని ఇంజక్షన్ ఇచ్చి, సెలైన్ పెట్టాడు. ఆ వైద్యం వికటించి మరణించాడు. వైద్యుడిపై కఠినచర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు కోరారు.

News May 6, 2024

ఎర్రవల్లి: వాహనం ఢీకొని మహిళ మృతి

image

జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవలిలోని 44వ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తు కాగితాలు ఏరుకునే మహిళ రహదారి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందిందని వారు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 6, 2024

అచ్చంపేట : మాజీ ఎమ్మెల్యే గువ్వలకు నిరసన సెగ

image

అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు నిరసన తగిలింది. అచ్చంపేట మండలంలోని మన్నెవారిపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎస్ఎల్‌బీసీ, నక్కలగండి నిర్వాసితులకు అన్యాయం చేశారని ఆరోపించారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి తమ సమస్యలు పట్టించుకోలేదని గ్రామస్థులు నిలదీయడంతో ప్రచారం మధ్యలో ఆపేసి వెళ్లిపోయారు.

News May 6, 2024

MBNR: రేవంత్ లక్కీ సీఎం: డీకే అరుణ

image

సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మండిపడ్డారు. ‘రేవంత్ వచ్చినప్పుడల్లా నన్ను అవమానించేలా మట్లాడుతున్నారన్నారు. నన్ను చూస్తే ఆయనకు ఎందుకు కడుపు మంటో? ఏంచేశారో, ఏం చేస్తారో చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. రేవంత్ అదృష్టవశాత్తు సీఎం అయ్యారు. అధికారంతో విర్రవీగితే కేసీఆర్‌కు పట్టిన గతే పడుతుందని’ ఆమె ఆరోపించారు.

News May 6, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ఉష్ణోగ్రత వివరాలు ఇలా

image

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధిక ఉష్ణోగ్రత వనపర్తి జిల్లా పానగల్లో 45.7 డిగ్రీలుగా నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో 45.4, గద్వాల జిల్లా ధరూర్లో 44.9, నారాయణపేట జిల్లా ధన్వాడలో 44.9, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.