Mahbubnagar

News March 30, 2024

నారాయణపేట: రూ.12లక్షల నగదు పట్టివేత

image

నారాయణపేట జిల్లా పరిధిలోని వివిధ చెక్‌ పోస్టుల వద్ద శుక్రవారం జరిగిన వాహన తనిఖీల్లో పెద్దమొత్తంలో నగదు పట్టుబడింది. మరికల్ మండలం లాల్కోట చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టగా దేవరకద్ర మండలం గూరకొండ గ్రామానికి చెందిన బీరప్ప వద్ద రూ.8.40 లక్షలు, పేట మండలం ఎక్లాస్పూర్ చెక్‌పోస్టు వద్ద రూ.1.50 లక్షలు, దామరగిద్ద మండలం కాన్కుర్తి చెక్‌పోస్టు వద్ద రూ2.15 లక్షలను పట్టుకున్నారు.

News March 30, 2024

మరికల్: బైక్‌ చక్రంలో చున్ని చుట్టుకొని మహిళ మృతి

image

కర్నూల్ జిల్లాకు చెందిన మాధవి భార్తతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా మరికల్ మండలంలో జీవనం సాగిస్తున్నారు. గ్రామాల్లో తిరిగి గ్యాస్ పొయ్యి మరమ్మతులు చేసేవారు. ఈ క్రమంలో శుక్రవారం దేవరకద్ర మండలం కోయిలసాగర్ వద్ద బైక్‌కి చున్ని చుట్టుకొని కింద పడటంతో తలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు అందలేదన్నారు.

News March 30, 2024

నాగర్ కర్నూల్‌పై అందరి గురి..!

image

NGKL MP స్థానంపై BRS, కాంగ్రెస్, BJP స్పెషల్ ఫోకస్ పెట్టాయి. BJP సిటింగ్ MP తనయుడు పోతుగంటి భరత్ బరిలోకి దించగా, కాంగ్రెస్ మల్లు రవిను పోటీలో నిలబెట్టింది. BRS వ్యూహాత్మకంగా లోకల్ క్యాండిడేట్ RS ప్రవీణ్ కుమార్‌ను బరిలోకి దింపింది. ఇప్పటికే NGKLలో PM మోదీ ప్రచారం చేయగా, KCR, రేవంత్ రెడ్డి సైతం ప్రచారం చేస్తారని టాక్. 3 పార్టీలు NGKLలో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దీనిపై మీ కామెంట్?

News March 30, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు!

image

✏ MBNR&NRPT జిల్లాలలో నేడు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం
✏ GDWL: పలు గ్రామాలలో నేడు కరెంట్ కట్
✏ నవాబుపేట: నేడు టెంకాయల వేలం& నేటి నుంచి బొడ్రాయి ఉత్సవాలు ప్రారంభం
✏ పన్ను వసూలుపై అధికారుల ఫోకస్
✏ పలుచోట్ల ‘ఇఫ్తార్ విందు’.. పాల్గొననున్న నేతలు
✏ పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న MBNR,NGKL ఎంపీ అభ్యర్థులు
✏ నేటి రంజాన్ వేళలు:- ఇఫ్తార్(SAT)-6:37,సహర్(SUN)-4:51
✏ త్రాగునీటి సమస్యలపై అధికారుల నిఘా

News March 30, 2024

బిజినేపల్లి: చిరుతల సంచారం.. జాగ్రత్త

image

నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం గంగారం అటవీ ప్రాంతంలో రెండు నెలలుగా చిరుతల సంచారం అడవికి సమీపంలో ఉన్న గిరిజన తండా వాసులకు అలజడి రేపుతోంది. తాగునీటి కోసం పులులు రాత్రి సమయాల్లో వస్తుంటాయి. కాబట్టి పరిసర ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని FRO తెలిపారు. భీముని తండా సమీపంలో కేఎల్‌ఐ కాలువ వద్ద చిరుత పులి రోడ్డు దాటుకుంటూ వెళ్లిందని చెప్పాడు.

News March 30, 2024

దేశ సమగ్రత, అభివృద్ధి బిజెపితోనే సాధ్యం: కిషన్ రెడ్డి

image

పాలమూరులో డీకే అరుణమ్మ గెలవాలి.. దేశ ప్రధానిగా మళ్లీ మోడీ రావాలని అది మీదే బాధ్యతని, బిజెపి ప్రభుత్వం వస్తేనే దేశ సమగ్రత, అభివృద్ధి కాపాడగలుగుతామని, టెర్రరిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం షాద్ నగర్ పట్టణంలోని కుంట్ల రాంరెడ్డి గార్డెన్ లో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది కార్యకర్తలు బిజెపిలో చేరారు.

News March 30, 2024

కొల్లాపూర్: ‘ఎంపీగా అవకాశం ఇవ్వండి.. వృద్ధి చేసి చూపిస్తా’

image

నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ అన్నారు. కొల్లాపూర్ పట్టణంలో శుక్రవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావు, రాష్ట్ర నాయకులు తల్లోజు ఆచారి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

News March 30, 2024

పాలమూరులో మండుతున్న ఎండలు.. జాగ్రత్త

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. శుక్రవారం ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా గద్వాలలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ తెలిపింది. BP, షుగర్, చర్మ వ్యాధులు ఉన్నవారు 11AM- 4PM మధ్య బయటకు రాకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ తాకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

News March 29, 2024

బీజేపీతోనే దేశ అభివృద్ధి సాధ్యం: ఎంపీ రాములు

image

నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ద్వారానే దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందని నాగర్ కర్నూల్ ఎంపీ రాములు అన్నారు. కొల్లాపూర్ పట్టణంలో శుక్రవారం జరిగిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారని అన్నారు. రాబోయే ఎన్నికలలో నాగర్ కర్నూల్ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేయాలని కోరారు. సమావేశంలో ఎంపీ అభ్యర్థి భరత్ పాల్గొన్నారు.

News March 29, 2024

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి

image

ఉమ్మడి జిల్లాలో 38 వేల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. గడిచిన సంవత్సరం 60‌ వేల ఎకరాల్లో పంటను సాగు చేయగా.. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా 38 వేల ఎకరాలకే పరిమితమైంది. ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.