India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఓటరు జాబితా రూపకల్పనకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట కలెక్టర్ సిక్త పట్నాయక్ పాల్గొన్నారు. గ్రామాలలో 18 సంవత్సరాలకు పైబడిన వారికి ఓటు హక్కు కల్పించాలని అన్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల్లో 30.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా మరికల్లో 23.0 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా సోలిపూర్లో 18.3 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో 6.8 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా బీచుపల్లిలో 6.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితర ముఖ్య నాయకులు గురువారం తన స్వాగతం పలికారు. నందిగామ మండలంలోని చేగూరు గ్రామ సమీపంలో ఉన్న కన్హా శాంతి వనం లో వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆయన హాజరయ్యారు. తిమ్మాపూర్ వద్ద ఆయనకు ఘనస్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి తదితరులు ఉన్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీఎస్సీ పరీక్షలు రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 508 ఖాళీలు ఉన్నాయి. 14,577 మంది అభ్యర్థులు జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్లో పరీక్షలకు హాజరయ్యారు. ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు. తుది కితో పాటు ఫలితాల విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భూత్పూర్ మండలం తాటికొండ వద్ద లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు.

సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం నారాయణపేట కలెక్టరేట్లో వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. జ్వర పీడితుల రక్త నమూనాలు, పూర్తిస్థాయి సమాచారాన్ని జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయానికి అందించాలని సూచించారు. వైద్య అధికారులు ప్రైవేట్ ఆసుపత్రులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని అన్నారు.

✒WNPT: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
✒మళ్లీ తెరుచుకున్న శ్రీశైలం గేట్లు
✒పలు మండలాల్లో రుణమాఫీఫై స్పెషల్ డ్రైవ్
✒వక్ఫ్ భూములపై ఫిర్యాదులు JPC కమిటీకి వివరిస్తా: డీకే అరుణ
✒నాగర్‌కర్నూల్: సెప్టెంబర్ 3న ఉద్యోగ మేళా
✒హైడ్రా.. పలు జిల్లాల్లో అక్రమ నిర్మాణాలపై ఫోకస్
✒ఓటు హక్కును నమోదు చేసుకోండి: MROలు
✒గణపతి, మీలాద్-ఉన్-నబి శాంతియుతంగా జరుపుకోండి: SIలు
✒DSC 508 ఖాళీలు..14,577 మంది ఎదురుచూపు

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. స్థానికుల వివరాలు.. పామిరెడ్డిపల్లికి చెందిన బోయ అశోక్, బోయ చందు బైక్‌పై వనపర్తికి వెళ్తుండగా.. పామిరెడ్డిపల్లి స్టేజ్ వద్ద వనపర్తి డిపోకు చెందిన బస్సును ఢీ కొన్నారు. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

కృష్ణమ్మ పరవళ్లతో శ్రీశైలం డ్యాం నిండుకుండలా మారింది. వరద నీటితో డ్యాం పూర్తిస్థాయిలో నిండింది. ప్రస్తుతం జలాశయానికి ఇన్ ఫ్లో 2,55,215 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,53,149 క్యూసెక్కులు ఉంది. జూరాల నుంచి వరద వస్తుండటంతో జలాశయం 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 508 ఖాళీలకు గాను..14,577 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఆగస్టు 13న విడుదల చేసిన ప్రాథమిక కీపై రాష్ట్ర వ్యాప్తంగా 28,500 అభ్యంతరాలు వచ్చినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈనెలాఖరు నాటికి తుది కీ ప్రకటించి ఫలితాలు విడుదల చేసేలా కసరత్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. MBNR-1:27, NGKL-1:29, GDWL-1:40, NRPT-1:19, WNPT-1:40 జిల్లాల్లో నిష్పత్తిలో పోటీ నెలకొంది.
Sorry, no posts matched your criteria.