Mahbubnagar

News May 4, 2024

జిల్లాలు కుదిస్తే ఉద్యమం: ప్రవీణ్ కుమార్

image

రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న 33 జిల్లాలను 15 జిల్లాలకు కుదించాలన్న ఆలోచన ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమం తప్పదని BRS ఎంపీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. NGKL పార్టీ ఆఫీసులో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. పాలన సౌలభ్యం కోసం KCR 33 జిల్లాలు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జిల్లాలను కుదించాలనడం సరికాదన్నారు. జిల్లాల కుదింపు జరిగితే కొత్త సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు.

News May 4, 2024

NRPT: ‘పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి’

image

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులకు సూచించారు. శుక్రవారం నారాయణపేట గురుకుల పాఠశాలలో చేపట్టిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. అప్పటి వరకు నమోదైన ఓట్ల వివరాలను పిఓ, ఏపిఓ లను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తామని, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

News May 4, 2024

MBNR: జిల్లాల వారీగా ‘TET’ అప్లికేషన్లు ఇలా..

image

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)-2024కు శుక్రవారం అధికారులు పరీక్ష షెడ్యూలు విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలో జిల్లాల వారీగా దరఖాస్తుల వివరాలు..✒మహబూబ్ నగర్: పేపర్-1కు 4,297, పేపర్-2కు 7,688✒నాగర్ కర్నూల్: పేపర్-1కు 4,453, పేపర్-2కు 6,023✒నారాయణపేట: పేపర్-1కు 3,262,పేపర్-2కు 3,446✒గద్వాల్: పేపర్-1కు 3,036,పేపర్-2కు 3,581✒వనపర్తి: పేపర్-1కు 2,560, పేపర్-2కు 5,211 అప్లికేషన్లు వచ్చాయన్నారు.

News May 3, 2024

MBNR: మీ అభ్యర్థి వివరాలు తెలుసుకోండి ఇలా!

image

లోక్ సభ నియోజకవర్గంలో ఎంత మంది అభ్యర్థులు బరిలో నిలిచారన్నది చాలామందికి తెలియదు. ఎవరెవరు పోటీ చేస్తున్నారో కేవైసీ(నో యువర్ క్యాండిడేట్) యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. దీని ద్వారా పోటీ చేసే అభ్యర్థి విద్యార్హతలు, వారికి నేర చరిత్ర ఉందా, ఎక్కడెక్కడ ఎంత మేర ఆస్తులు ఉన్నాయి. స్థిర, చర ఆస్తులు, ఇతర వివరాలన్నీ ఇందులో ఉంటాయి. దీన్ని బట్టి ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది.

News May 3, 2024

ఉమ్మడి జిల్లాలో TODAY TOP NEWS

image

✒MPఎన్నికలు.. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా: SPలు
✒BJPని ఓడించడమే కమ్యూనిస్టుల లక్ష్యం:CPI
✒భగ్గుమన్న పాలమూరు.. పెరుగుతున్న ఎండలు
✒నిరుద్యోగ, ప్రజాసమస్యలు పరిష్కరిస్తా: బర్రెలక్క
✒MBNRలో 16 లక్షలు.. NGKLలో 17లక్షల ఓటర్లు
✒ఏర్పాట్లు పూర్తి.. రేపు కొత్తకోటకు సీఎం రేవంత్ రెడ్డి రాక
✒GDWL: సీఎం, రాహుల్ పర్యటన కోసం హెలిపాడ్ స్థల పరిశీలన
✒పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోండి: కలెక్టర్లు

News May 3, 2024

అంతర్జాతీయ మార్కెట్లో కొల్లాపూర్ మామిడి పండ్లకు డిమాండ్

image

కొల్లాపూర్ సంస్థానాధీశులు కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని(రాజుగారి) పెద్దతోట, చుక్కాయిపల్లి క్రిష్ణ విలాస్ లో మామిడి తోటల సాగును ప్రారంభించారు. APలోని కృష్ణా జిల్లా నూజివీడు నుంచి తెచ్చిన మామిడి మొక్కలు.. కొల్లాపూర్ ప్రాంతం నేల, వాతావరణంలో కాయలు నాణ్యంగా, మంచి పరిమాణంతో పెరిగి, తీపిగా,ఆకర్షణీయంగా ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం 25 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి.

News May 3, 2024

పద్మశ్రీ మొగిలయ్యకు పెన్షన్ చెల్లిస్తున్నాం: CM సీపీఆర్వో

image

ఉమ్మడి పాలమూరుకు చెందిన పద్మశ్రీ మొగిలయ్యకు క్రమం తప్పకుండా పెన్షన్ చెల్లిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి సీపీఆర్వో అయోధ్య రెడ్డి తెలిపారు. మార్చి 31న కూడా ఆయన ఖాతాలో రూ.20 వేల పెన్షన్ జమ అయినట్లు Xలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కవులు, కళాకారులను ఎప్పుడూ గౌరవిస్తుందని పేర్కొన్నారు. అయితే ఏప్రిల్లో పెన్షన్ కొంచెం ఆలస్యం అవుతుందని మొగిలయ్యకు ముందే ఫోన్ చేసి చెప్పినట్లు అధికారులు తెలిపారు.

News May 3, 2024

NRPT: సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా: ఎస్పీ

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్, x, ఇతర సోషల్ మీడియాలలో అనుచిత వ్యాఖ్యలు, మత విద్వేషాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న కారణంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. సోషల్ మీడియాను జాగ్రత్తగా వాడాలని అన్నారు.

News May 3, 2024

భగ్గుమన్న పాలమూరు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో 46 డిగ్రీలు

image

ఉమ్మడి జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ తీవ్రతతో జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. వడగాలులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. గద్వాలలో 45.7, నారాయణపేట 45.2, మహబూబ్‌నగర్‌లో 45.1, వనపర్తిలో 44.8 డిగ్రీలు రికార్డు అయింది. వచ్చే 3రోజులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. మ‌ధ్యాహ్నం సమయంలో బ‌య‌ట‌కు రాకపోవడమే మంచిదని అధికారులు చెబుతున్నారు.

News May 3, 2024

MBNRలో 16 లక్షలు.. NGKLలో 17లక్షల ఓటర్లు

image

MBNR, NGKL పార్లమెంట్ పరిధిలో కలిపి మొత్తం 34,20,724 మంది ఓటర్లు ఉన్నారు. MBNRలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 16,82,470 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 8,32,256, మహిళలు 8,50,172, ఇతరులు 42 మంది ఉన్నారు. NGKL పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 17,38,254 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 8,64,875, మహిళలు 8,73,340, ఇతరులు 39 మంది ఓటర్లు ఉన్నారు.