India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పోలీసులు తమ విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. గురువారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లకు అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. పోలీసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ప్రతినిధుల రక్షణ కొరకు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, పరిసర ప్రాంతాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని, తప్పులు లేని ఓటరు జాబితా సిద్ధం చేయాలని అధికారులను వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు, బూత్ లెవెల్ అధికారులుతో మొదట మ్యాపింగ్ చేసుకొని, పంచాయతీలు, వార్డుల వారీగా జాగ్రత్తగా జాబితా సిద్ధం చేయాలన్నారు.

కోస్గిలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ మెరుగు శ్రీనివాసులు గురువారం తెలిపారు. CSE, CSE(AIML), CSE( డాటా సైన్స్)ల్లో పరిమిత సీట్లు కలవని ఆసక్తిగల విద్యార్థులు ఉదయం 9 గంటల వరకు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు. ఎంసెట్ పరీక్ష రాసి సీటు రానివారు, పరీక్ష రాయని వారు సైతం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తుంది. MBNR, NGKL, వనపర్తి, కొడంగల్, జడ్చర్ల, కోస్గి, కల్వకుర్తి, నారాయణపేట తదితర ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. ఇప్పటికే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మీ మండలంలో వర్షం పడుతుందా..? కామెంట్ చేయండి.

రాష్ట్రంలో కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి గురువారం TSCPSEU ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించలేదని ఈ ప్రభుత్వంలోనైనా డిమాండ్ల సాధనకు కృషి చేయాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే విధంగా చూడాలని చిన్నారెడ్డిని కోరారు.

ఓటరు జాబితా రూపకల్పనకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట కలెక్టర్ సిక్త పట్నాయక్ పాల్గొన్నారు. గ్రామాలలో 18 సంవత్సరాలకు పైబడిన వారికి ఓటు హక్కు కల్పించాలని అన్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల్లో 30.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా మరికల్లో 23.0 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా సోలిపూర్లో 18.3 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో 6.8 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా బీచుపల్లిలో 6.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితర ముఖ్య నాయకులు గురువారం తన స్వాగతం పలికారు. నందిగామ మండలంలోని చేగూరు గ్రామ సమీపంలో ఉన్న కన్హా శాంతి వనం లో వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆయన హాజరయ్యారు. తిమ్మాపూర్ వద్ద ఆయనకు ఘనస్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి తదితరులు ఉన్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీఎస్సీ పరీక్షలు రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 508 ఖాళీలు ఉన్నాయి. 14,577 మంది అభ్యర్థులు జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్లో పరీక్షలకు హాజరయ్యారు. ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు. తుది కితో పాటు ఫలితాల విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భూత్పూర్ మండలం తాటికొండ వద్ద లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు.
Sorry, no posts matched your criteria.