Mahbubnagar

News July 1, 2024

MBNR: 3,929 మంది టీచర్లకు స్థాన చలనం

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటికే 1,725 మంది SAలకు బదిలీ అయ్యారు. మరో 1,975 మంది SGTలు SAలుగా, 229 మంది SAలు GHMలుగా పదోన్నతి పొందారు. వివిధ విభాగాల్లో కలిపి ఉమ్మడి జిల్లాలో 3,929 మంది ఉపాధ్యాయులు కొత్త పాఠశాలల్లో విధుల్లో చేరారు. ప్రస్తుతం ఎస్జీటీల బదిలీలతో మరో రెండు వేల మందికి స్థాన చలనం కలగనుంది. ఒకే పాఠశాలలో 8ఏళ్ల పాటు పనిచేసిన SGTలు విధిగా మరో పాఠశాలకు బదిలీ కానున్నారు.

News July 1, 2024

ఉమ్మడి జిల్లా నేటి కార్యక్రమాలు

image

@ ఉమ్మడి జిల్లాలో నేటి నుండి కొత్త చట్టాలు అమలు..
@ మక్తల్: ఉచిత కంటి వైద్య శిబిరం.
@ షాద్నగర్: నూతన బస్సులను ప్రారంభించనున్న ఎమ్మెల్యే.
@ దామరగిద్ద, జడ్చర్లలో రైతు భరోసా అభిప్రాయ సేకరణ.
@ ఐజ సింగిల్ విండో సమావేశం.
@ మక్తల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.
@ కొత్తకోటలో సుభాష్ చంద్రబోస్ విగ్రహవిష్కరణ.
@ పెద్దకొత్తపల్లి: తైబజార్ వేలం

News July 1, 2024

MBNR: ఆప్షన్ల గడువు పెంచాలి..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎస్జీటీ ఉపాధ్యాయుల బదిలీల్లో పోస్టులను చూపించకుండా దాచిపెట్టి “అప్రకటిత రేషనలైజేషన్” చేశారని PRTU, TRTF ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చేసుకొని పోస్టులను కేటాయించలేదని వారు ఆరోపించారు. బదిలీలకు కేవలం ఒక్కరోజు గడువు ఇచ్చి.. హడావుడిగా ముగించడం సరికాదని అన్నారు. ఆప్షన్ల గడువు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

News July 1, 2024

నేటి నుంచి కొత్త చట్టాలు.. సిద్ధమైన పోలీస్ యంత్రాంగం

image

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నూతన చట్టాల అమలుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లావ్యాప్తంగా పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. నెల రోజులుగా 14 బ్యాచ్లుగా డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు అధికారులు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కొత్త చట్టాల ప్రకారమే కేసులు నమోదు చేయటంతో పాటు తీర్పులు వెలువడనున్నాయి.

News July 1, 2024

ఉమ్మడి పాలమూరులో గొర్రెల పంపిణీపై ప్రత్యేక ఫోకస్ !

image

గొర్రెల యూనిట్ల పంపిణీలో అక్రమాల నేపథ్యంలో గొర్రెలు, మేకలు ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో పశు సంవర్ధక శాఖ అధికారులు ఈ పథకంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. 2017లో గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టగా మొదటి, రెండో విడతల కింద ఉమ్మడి జిల్లాలో 70,688 గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల వద్ద గొర్రెల సంఖ్య తగ్గిందని అధికారులు గుర్తించారు. త్వరలో లెక్కలు తేల్చనున్నారు.

News July 1, 2024

NGKL: నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి: ఎస్పీ

image

నేటి నుంచి అమల్లోకి రానున్న నూతన చట్టాల పట్ల ప్రతిఒక్క పోలీస్ అధికారి, సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని SP గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. నూతన చట్టాలపై జిల్లా పోలీసులకు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో SP పాల్గొని మాట్లాడారు. భారత న్యాయవ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని అవసరాన్నిబట్టి ప్రజా భద్రత కోసం చట్టాలను రూపకల్పన చేయడం జరిగిందని, కొత్తచట్టాలపై విడతలవారీగా శిక్షణ నిర్వహించామన్నారు.

News June 30, 2024

పాలమూరు బిడ్డకు సీఎం శుభాకాంక్షలు

image

SBI నూతన ఛైర్మన్‌గా పాలమూరు బిడ్డ చల్లా శ్రీనివాసులుశెట్టి నియమితులు కాబోతున్నారు. గద్వాల జిల్లాకు చెందిన శ్రీనివాసులు ప్రతిష్ఠాత్మకమైన SBI ఛైర్మన్ పదవిని అధిరోహించడం ఒక మహత్తర సందర్భమని CM రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. కొత్త బాధ్యతల్లో మరెన్నో విజయాలు, ప్రశంసలు అందుకోవాలని ఆకాంక్షించారు. కాగా ప్రస్తుతం SBI మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేస్తున్న శెట్టి ఛైర్మన్‌గా ఆగస్టులో బాధ్యతలు స్వీకరిస్తారు.

News June 30, 2024

పెండింగ్ బిల్లులు ఇప్పించాలని గవర్నర్‌కు వినతి

image

గ్రామపంచాయతీ మాజీ సర్పంచులకు రావలసిన పెండింగ్ బిల్లులు ఇప్పించాలని కోరుతూ సర్పంచ్‌ల ఆధ్వర్యంలో గవర్నర్ రాధాకృష్ణన్‌ను కలిశారు. కడ్తాల్ మాజీ సర్పంచ్, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించారు. సర్పంచులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

News June 30, 2024

MBNR: ఆర్టీసీ సేవలకు విశేష స్పందన !

image

ఉమ్మడి జిల్లా ఆర్టీసీ కార్గోలో వినూత్న సేవలు చేపట్టారు. సమ్మక్క, సారక్క జాతరను పురస్కరించుకొని భక్తులకు మేడారం ప్రసాదాన్ని అందించారు. మూడేళ్ల నుంచి శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని ఇంటివద్దకే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు అనే కార్యక్రమాలు చేపట్టగా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,708 బుకింగ్ చేసుకున్న మందికి ఇంటివద్దకే ప్రసాదాన్ని అందజేశారు.

News June 30, 2024

ఉమ్మడి జిల్లాలో వర్షపాతం వివరాలు

image

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో 51.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో 44.8 మి.మీ, నారాయణపేట జిల్లా మరికల్లో 31.5 మి.మీ, వనపర్తి జిల్లా ఘన్పూర్ లో 25.8 మి.మీ, గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 8.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.