Mahbubnagar

News March 28, 2024

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల వివరాలు ఇలా!

image

1.MBNR(ఎంపీడీఓ కార్యాలయం)-245
2.కొడంగల్(ఎంపీడీఓ కార్యాలయం)-56
3.NRPT(ఎంపీడీఓ కార్యాలయం)-205
4.WNPT(ఆర్డీఓ ఆఫీస్)-218
5.GDWL(జడ్పీ కార్యాలయం)-225
6.కొల్లాపూర్(బాలికల జూనియర్ కళాశాల)-67
7.NGKL(బాలుర జడ్పీహెచ్ఎస్)-101
8.అచ్చంపేట(బాలికల జడ్పీహెచ్ఎస్)-79
9.కల్వకుర్తి(ప్రభుత్వ జూనియర్ కళాశాల)-72
10.షాద్ నగర్(ఎంపీడీఓ కార్యాలయం)-171
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలు,1,439 మంది ఓటర్లు ఉన్నారు.

News March 28, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలింగ్ కేంద్రాలు-ఓటర్ల వివరాలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేడు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది.
✓MBNR ఎంపీడీవో కార్యాలయం 245.
✓ కోడంగల్ MPDO కార్యాలయం 56.
✓పేట MPDO కార్యాలయం 205.
✓వనపర్తి RDO కార్యాలయం 218. ✓గద్వాల ZP కార్యాలయ సమావేశం మందిరం 225.
✓కొల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 67.
✓ నాగర్ కర్నూల్ GOVT బాలుర కళాశాల 101 .
అచ్చంపేట ZPHS బాలికల పాఠశాల 79 ✓కల్వకుర్తి ప్రభుత్వ కళాశాల 72.
షాద్నగర్ ఎంపీడీవో కార్యాలయం 71.

News March 28, 2024

నేడు కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి

image

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా కొడంగల్ పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు వేసేందుకు గురువారం రానున్నట్లు కాడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. సీఎం రానున్న నేపథ్యంలో రాజేంద్రనగర్, చేవెళ్ల ట్రాఫిక్ ఠాణాల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు జాయింట్ సీపీ జోయల్ డేవిస్ పేర్కొన్నారు. ఇటు కొడంగల్‌లో కూడా అధికారులు అదనపు బలగాలను రంగంలోకి దింపామన్నారు.

News March 28, 2024

MBNR: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ ఓట్లు కీలకం!

image

ఉమ్మడి MBNR జిల్లాలో బుధవారం జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో BJP ఓట్లు కీలకం కానున్నాయి. మొత్తం 1,439 ఓట్లలో దాదాపు 119 ఓట్లు BJPకి ఉన్నాయి. ఎన్నికల్లో BJP అభ్యర్థి పోటీ చేయకపోవడం వల్ల ఆ ఓట్లు ఏ పార్టీకి పడతాయోనని రాజకీయ వర్గాలలో చర్చ కొనసాగుతుంది. కొంతమంది కాంగ్రెస్, మరి కొంతమంది BRS వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆ ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావితం చూపే అవకాశం ఉంది.

News March 27, 2024

ఉమ్మడి జిల్లాలో ‘TODAY TOP NEWS’

image

✏NRPT:ACBకి పట్టుబడ్డ గుండుమాల్ తహశీల్దార్ పాండు
✏హామీల అమలులో రేవంత్ సర్కార్ విఫలం:డీకే అరుణ
✏సర్వం సిద్ధం.. రేపే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక!
✏WNPT:శ్రీరంగపురం టెంపుల్‌‌లో హీరో సిద్దార్థ్‌ పెళ్లి
✏WNPT:’యాప్‌లో రూ.1,75,000 స్వాహా’
✏ఆయా జిల్లాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్లు
✏రాష్ట్రంలో 14 పార్లమెంటు స్థానాలలో గెలుస్తాం:వంశీచంద్ రెడ్డి
✏ఉమ్మడి జిల్లాలో హీరో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు

News March 27, 2024

వనపర్తి: ‘యాప్‌లో రూ.1,75,000 పోగొట్టుకున్నాడు’

image

వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామానికి చెందిన కావలి వెంకటేష్ వేక్ (WAKE) యాప్‌లో రూ.1, 75,000 పోగొట్టుకున్నాడని ఎస్సై జలంధర్ రెడ్డి తెలిపారు. బాధితుడు సైబర్ క్రైమ్ విభాగానికి సమాచారం ఇచ్చారని చెప్పారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

News March 27, 2024

ALERT.. పాలమూరులో తీవ్రమవుతున్న ఎండలు

image

ఉమ్మడి పాలమూరులో భానుడి భగభగలు మరింత తీవ్రమవుతున్నాయి. జిల్లాలో గరిష్ఠంగా 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సందర్భంగా ఆరు బయట పనిచేసే వారు, మధ్యాహ్నం పూట ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడమే ఉత్తమమని చెబుతున్నారు. వడదెబ్బకు గురి కాకుండా కొబ్బరినీళ్లు తీసుకోవాలని తెలిపారు.

News March 27, 2024

నారాయణపేట జిల్లాలో ఏసీబీకి పట్టుబడ్డ తహశీల్దార్

image

నారాయణపేట జిల్లా గుండుమాల్ తహశీల్దార్ పాండు నాయక్ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు. ఏసీబీ అధికారి శ్రీకృష్ణ గౌడ్ వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మల్లేశ్ వద్ద నుంచి తహశీల్దార్ పాండు నాయక్ రూ.3 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో మల్లేశ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారి శ్రీకృష్ణ గౌడ్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దర్యాప్తు చేపట్టారు.

News March 27, 2024

నాగర్ కర్నూల్ లోక్‌సభ పరిధిలోని ఓటర్లు

image

నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలిలా..
✓ నాగర్ కర్నూల్ అసెంబ్లీ- 2,38,133
✓ అచ్చంపేట అసెంబ్లీ- 2,47,621
✓ కల్వకుర్తి అసెంబ్లీ- 2,42,962
✓ కొల్లాపూర్ అసెంబ్లీ – 2,38,459
✓ వనపర్తి అసెంబ్లీ – 2,72,653
✓ గద్వాల అసెంబ్లీ- 2,55,866
✓ అలంపూర్ అసెంబ్లీలో- 2,39,079 మంది ఓటర్లు ఉన్నారు. ఇంకా ఓటరుగా నమోదు చేసుకోని వారి కోసం మరోసారి అవకాశం కల్పించారు.

News March 27, 2024

కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకోనున్న రేవంత్ రెడ్డి

image

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఎక్స్- అఫీషియో హోదాలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు గురువారం రేవంత్ రెడ్డి కొడంగల్‌కు రానున్నారు. ఇప్పటికే అధికారులు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు.