India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిన్న, మొన్నటి వరకు BJP, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని జరిగిన ప్రచారానికి KCR పర్యటనతో త్రిముఖ పోటీకి బలం పెరిగింది. ఎన్నికల షెడ్యూల్ ప్రారంభమైన దగ్గర నుంచి BJP, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, మారుతున్న రాజకీయ పరిణామాలు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ తప్పదనే సంకేతాలు వస్తున్నాయి.
టెన్త్ ఫలితాలు మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. అయితే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి జూన్ 13 వరకు ఉంటాయని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఉ.9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల మధ్య పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. రీకౌంటింగ్‌కు 15రోజుల వరకు అవకాశం ఉంటుందని తెలిపారు. సబ్జెక్టుకు రూ.500 చొప్పున చెల్లించాలన్నారు. ఆన్సర్ షీట్ ఫొటో కాపీ కోసం సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాలన్నారు.
కడ్తాల్ మండలం మక్తమాదారం గ్రామ సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికంగా ఉన్న ఓ వెంచర్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సదరు వ్యక్తిని హత్య చేసి వెంచర్‌లో వేసి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మహబూబ్ నగర్ నియోజకవర్గం ప్రస్తుతం రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కోడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ హస్తం పార్టీ చివరిసారిగా 2004లో గెలిచింది. ప్రస్తుతం ఇక్కడ ప్రధాన పార్టీల మధ్యన హోరాహోరీ పోటీ నడుస్తోంది. మూడు పార్టీలు ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈనేపథ్యంలో ఇక్కడ గెలుపు ఎవరిదో చూడాలి.
నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం పూర్తికావడంతో బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య తేలిపోయింది. స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం గుర్తులు కేటాయించారు. EVMలో 15మంది అభ్యర్థులతోపాటు నోటా ఉంటుంది. నోటాతో కలిపి మొత్తం అభ్యర్థుల సంఖ్య 16 కాగా… MBNR, NGKL పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల సంఖ్య 16 దాటడంతో ప్రతి పోలింగ్ బూత్లో రెండో బ్యాలెట్ యూనిట్ ఏర్పాటు కోసం అధికారులు సిద్ధమవుతున్నారు.
పార్లమెంట్ ఎన్నికలకు కేవలం 13 రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఆయా పార్టీల నాయకులు హామీలపై హామీలు ఇస్తూ ఓట్ల వేట మొదలుపెట్టారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు ఎన్నికల ప్రచారంతో జిల్లా రాజకీయాలు మరింత హిట్ ఎక్కాయి. కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు మాటల తూటాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ప్రజలను ఆకట్టుకునేందుకు అనేక హామీలు గుప్పిస్తున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పది పరీక్షల ఫలితాల నేపథ్యంలో కొందరు విద్యార్థులు మనస్తాపానికి గురై అఘాయిత్యాలకు పాల్పడటం మనసును కలచివేస్తోంది. ఉత్తీర్ణత సాధించలేకపోయినా మళ్లీ పరీక్ష రాసి సత్తాచాటాలి. ఆశించిన మార్కులు రాకపోయినా నిరాశ చెందకుండా ఉన్నత చదువుల్లో అత్యధిక మార్కులు తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేయాలని, ఆలోచనలు మార్చుకుంటే అన్ని అద్భుతాలే అని విద్యాశాఖ అధికారులు, వైద్య నిపుణులు సూచించారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో పలు మండలాల్లో 44.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వచ్చే నాలుగు రోజులు ఎండ తీవ్రతతో పాటు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. పొడి వాతావరణంతో పాటు ఎండల తీవ్రత కొనసాగనుందని పేర్కొంది. ఈక్రమంలో ఉమ్మడి జిల్లా వాసులు వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
టెన్త్ ఫలితాల్లో నారాయణపేట సత్తాచాటింది. 93.13 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే 15వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 7129 మంది పాసయ్యారు. MBNR(89.47%) 28వ స్థానంలో నిలవగా 11338 ఉత్తీర్ణత సాధించారు. NGKL(91.57) 23వ స్థానంలో ఉండగా 9621 పాసయ్యారు. WNP(86.93) 29వ స్థానంలో నిలవగా 5988 ఉత్తీర్ణత సాధించగా.. GDL(81.38) 32న స్థానంలో ఉండగా 5839 మంది పాసయ్యారు.
వనపర్తి: పాలిటెక్నిక్ ప్రవేశాల్లో భాగంగా ‘పాలిసెట్’ మే 24న నిర్వహించనున్నట్లు స్థానిక కృష్ణదేవరాయ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డా.చంద్రశేఖర్ తెలిపారు. రూ.100 ఆలస్య రుసుంతో ఈ రోజు వరకు, రూ.300 ఆలస్య రుసుంతో మే 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ర్యాంకుల ఆధారంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్లను కేటాయిస్తారని తెలిపారు. పూర్తి వివరాలకు https://polycet.sbtet.telangan.gov.in చూడాలన్నారు.
Sorry, no posts matched your criteria.