Mahbubnagar

News March 27, 2024

చారకొండ: పుట్టెడు దుఃఖంలో పరీక్షకు హాజరైన విద్యార్థిని

image

అనారోగ్యంతో తండ్రి మృతిచెందిన బాధను దిగమింగి ఓ విద్యార్థిని పదోతరగతి పరీక్షకు హాజరైంది. చారకొండ మండల పరిధిలోని జూపల్లి గ్రామానికి చెందిన కడారి పావని తండ్రి తిరుపతయ్య అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. తండ్రిని కోల్పోయిన విద్యార్థిని పుట్టెడు దుఃఖంతో మంగళవారం మండల కేంద్రంలోని ZPHS పాఠశాలలో జరిగిన భౌతిక శాస్త్రం పరీక్షకు హాజరైంది. కుమార్తె పరీక్ష రాసి ఇంటికి వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు.

News March 27, 2024

MBNR:రేపు ఉచితంగా గుండె వైద్య శిబిరం

image

జిల్లా వైద్యారోగ్యశాఖ-ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో హైదరాబాద్ కేర్ ఆస్పత్రి సహకారంతో ఈనెల 28న చిన్నపిల్లలకు ఉచితంగా గుండె సంబంధ వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఈ మేరకు శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ, డీఈఐసీ మేనేజర్ దేవిదాస్ తెలిపారు. 0-18ఏళ్ల వారి కోసం అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

News March 27, 2024

పాలమూరులో ‘ఫోన్ ట్యాపింగ్’ ప్రకంపనలు.?

image

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ ఎపిసోడ్‌ రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఆ మరకలు మహబూబ్‌నగర్‌ను అంటుకోగా.. హాట్‌ టాపిక్‌గా మారింది. తన ఫోన్‌తో పాటు జిల్లాలోని అప్పటి విపక్ష నాయకులు, బడా వ్యాపారులు, రియల్టర్ల ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయని.. ఇందులో ఓ మాజీ మంత్రితో పాటు పలువురు పోలీస్‌ అధికారుల ప్రమేయం ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు.

News March 27, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు..!

image

✒దేవరకద్ర: నేడు ఉల్లి వేలం
✒ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ కలకలం
✒MLC ఎన్నికలు.. కొనసాగుతున్న సైలెంట్ పిరియడ్
✒ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై, త్రాగునీటి సమస్యలపై అధికారుల ఫోకస్
✒రంజాన్ వేళలు:-
ఇఫ్తార్(బుధ)-6:35,సహార్(గురు)-4:51
✒’ELECTION EFFECT’..కొనసాగుతున్న తనిఖీలు
✒ఉమ్మడి జిల్లాలో శుభకార్యాలకు ఎలక్షన్ కోడ్ కష్టాలు
✒MBNR:ఓటు నమోదుపై 5KM రన్
✒MLC ఎన్నికలు.. పకడ్బందీగా ఏర్పాట్లు

News March 27, 2024

MBNR: ‘మహిళా కమిటీల పర్యవేక్షణలో పాఠశాలలు’

image

ఉమ్మడి పాలమూరు జిల్లాల్లోని పాఠశాలల్లో నిర్వహణ బాధ్యతలను మహిళా కమిటీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ‘అమ్మ ఆదర్శ’ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయనుంది. శానిటేషన్ నుంచి విద్యార్థులకు అందించే ఉచిత దుస్తుల పంపిణీ, మధ్యాహ్నం భోజనం, భవన నిర్మాణాలు, మరమ్మతు పనులు, మౌలిక సదుపాయాలను ఇలా సమస్తం మహిళా కమిటీల పర్యవేక్షణలో జరగనున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు కసరత్తు చేస్తున్నారు.

News March 27, 2024

పాలమూరుపై సీఎం రేవంత్ రెడ్డి SPECIAL ఫోకస్!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని MBNR, NGKL ఎంపీ సీట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. తన సొంత జిల్లా కావడంతో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎంపీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు స్థానిక నేతలతో సీఎం సమావేశమై చర్చించారు. MBNR అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి, NGKL అభ్యర్థి మల్లురవిల గెలుపే లక్ష్యంగా ప్రచారానికి సిద్ధం కావాలని ఆయన వారికి సూచించారు.

News March 27, 2024

NRPT: ‘గ్రూప్స్ పరీక్షల ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలి’

image

గ్రూప్స్ పరీక్షల ఉచిత శిక్షణకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కన్యాకుమారి అన్నారు. మంగళవారం నారాయణపేట చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. గ్రూప్స్ 1,2,3,4 అభ్యర్థులు ఈనెల 28 లోపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని, డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రకారం సీట్లు కేటాయిస్తామన్నారు.

News March 26, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!

image

✔వంద శాతం పంట నష్టం నగదు జమ చేస్తాం: మంత్రి జూపల్లి
✔ఫారుక్ నగర్: చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి
✔MBNR:ఉమ్మడి జిల్లాలో పడిపోయిన భూగర్భ జలాలు
✔నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు:MBNR ఎమ్మెల్యే
✔’వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి’: ఉమ్మడి జిల్లా కలెక్టర్లు
✔క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు:SP
✔TET ఫీజు తగ్గించాలి:PYL
✔MBNR:DEOపై చర్యలు తీసుకోవాలని CS కు ఫిర్యాదు
✔ఉపాధి హామీ పనులపై ఫోకస్

News March 26, 2024

వంద శాతం పంట నష్టం నగదు జమ చేస్తాం: మంత్రి జూపల్లి

image

పంట నష్టం జరిగిన రైతులకు అందరికీ వందశాతం అకౌంట్లో నగదు జమ చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా ఇచ్చారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గడిచిన పదేళ్లలో ఏనాడూ పంట నష్టపోయిన రైతులను BRS ఆదుకోలేదని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది కోసం హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో తాము రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు.

News March 26, 2024

గోవా క్యాంపు నుంచి ప్రజా ప్రతినిధుల తిరుగుముఖం

image

ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గోవాకు తరలిన వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్, బీఆర్ఎస్ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఈరోజు తిరుగు ముఖం పట్టినట్లు తెలుస్తోంది. వారికి హైదరాబాదుకు తరలిస్తారని సమాచారం. మార్చి 28న ఓటింగ్ సమయానికి వనపర్తికు తెచ్చే అవకాశం ఉంది. ఓటర్లను కాపాడుకునేందుకు ప్రధాన పార్టీలు క్యాంపులు ఏర్పాటు చేసిన సంగతి విధితమే.