Mahbubnagar

News March 26, 2024

MBNR: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు..

image

MLC ఉప ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,439 మంది MPTCలు, ZPTCలు, మున్సిపల్ కౌన్సిలర్లు, MLAలు, MLCలు, MPలు ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఉన్నారు. 850 మందికి పైగా ఓటర్లు BRSకు సంబంధించిన వారు ఉండగా, 350 మంది కాంగ్రెస్ పార్టీ, 50 మంది BJP, మిగతా ఇతర పార్టీలు, స్వతంత్రులు ఉన్నారు. రాష్ట్రంలో అధికార మార్పు జరగడంతో BRS ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.

News March 26, 2024

MBNR: 2.98 లక్షల టన్నుల చెరకు కోతలు పూర్తి

image

ఉమ్మడి జిల్లాలో 8వేల ఎకరాలో 2.98 లక్షల టన్నుల చెరకు కోతలు పూర్తయినట్లు కృష్ణవేణి చెరకు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాజన్న తెలిపారు. 2023-24 సీజన్‌లో కృష్ణవేణి పరిశ్రమ యాజమాన్యంతో రైతులు ఒప్పందం చేసుకుని చెరకు సాగు చేశారన్నారు. పంట కోతకు కావాల్సిన కార్మికులను, యంత్రాలను యాజమాన్యం కేన్ కమిషనర్ ఆదేశంతో ఏర్పాటు చేసిందన్నారు. వచ్చే సీజన్కు రైతులతో గిట్టుబాటు ధర వచ్చేవిధంగా ఒప్పందం చేసుకోవాలని కోరారు.

News March 26, 2024

MBNR: జిల్లాలో పడిపోయిన భూగర్భ జలాలు

image

ఎండలు ముదురుతున్న కొద్దీ ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గత వర్షా కాలంలో సెప్టెంబర్ తర్వాత తగినంతగా వర్షాలు లేకపోవడంతో జలాశయాలు నిండలేదు. దీంతో గ్రౌండ్ వాటర్ లేక బావులు, బోర్లు ఎండిపోతున్నాయి. మరోవైపు ఎండ తీవ్రత పెరగడంతో పంటలకు ఎక్కువ మోతాదులో నీరు అవసరమవుతోంది. గత నెలాఖరులో భూగర్భ జలవనరుల శాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా గ్రౌండ్ వాటర్ లెవల్స్ పరిశీలించగా చాలా తగ్గినట్టు తెలిపారు.

News March 26, 2024

MBNR: తల్లి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు మృతి!

image

తల్లి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు మృతిచెందిన ఘటన గట్టులో సోమవారం చోటుచేసుకుంది. గట్టుకు చెందిన మఠం ఆదెమ్మ(85) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందింది. ఆదెమ్మ కుమారుడు మఠం బూదెప్ప (67) తల్లి మృతితో ఆందోళన చెంది అస్వస్థతకు గురయ్యాడు. రాయిచూర్ అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 24 గంటలైనా తీరకముందే ఇంట్లో ఇరువురు మృత్యువాత పడడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది.

News March 26, 2024

MBNR: ఇంటి నుంచే ఓటు.. ఈసీ వెసులుబాటు!

image

మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో 1,916 పోలింగ్ కేంద్రాలు ఉండగా..16,80,417 మంది ఓటర్లు ఉన్నారు.85 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు 6,047 మంది, దివ్యాంగ ఓటర్లు 32,731 మంది ఉన్నారు. వీరికి పోలింగ్ రోజు ఎన్నికల సిబ్బంది ఇంటికి వచ్చి బ్యాలెట్ పేపర్‌లో ఓటు వేయిస్తారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరిస్తారు. హోం ఓటింగ్ ప్రక్రియకు ఫారం-12డీ దరఖాస్తు ఇవ్వవలసి ఉంటుంది.

News March 26, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✏మహబూబ్ నగర్: నేడు 5K రన్
✏రసవత్తంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప’పోరు’
✏పలు నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల పర్యటన
✏NGKL,కొల్లాపూర్:నేడు డయల్ యువర్ డిఎం
✏రంజాన్ వేళలు:-
ఇఫ్తార్(బుధ)-6:34,సహార్(గురు)-4:56
✏ఉమ్మడి జిల్లాలో త్రాగునీటిపై అధికారుల ఫోకస్
✏ఇంటి నుంచే ఓటు.. అధికారుల సమీక్ష
✏లోక్ సభ ఎన్నికలు.. గ్రామాల్లో ప్రచారం
✏పెద్ద పెద్దపల్లి: నేడు తైబజార్ వేలం
✏ఎలక్షన్ కోడ్.. పలు చోట్ల తనిఖీలు

News March 26, 2024

MBNR: హీటెక్కిన ‘MLC ఉప ఎన్నిక’

image

ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప పోరు రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నువ్వా.. నేనా.. అంటూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పోటాపోటీగా ఓటర్లను క్యాంప్‌లుగా తరలించడంతో రాజకీయాలు హీటెక్కాయి. BRS సిట్టింగ్ స్థానం కావడంతో ఆ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకా కాగా.. కాంగ్రెస్ సైతం పట్టు వదలకుండా పావులు కదుపుతోంది.

News March 26, 2024

గ్రూప్స్ కు ఉచిత శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

image

GDWL: ఈనెల 26 నుంచి ఎస్సీ నిరుద్యోగులకు 3నెలల పాటు గ్రూప్స్ పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించనున్నట్లు జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి శ్వేతా ప్రియదర్శిని తెలిపారు.30 బ్యాక్ లాగ్ అడ్మిషన్ల భర్తీకి ఆసక్తి గల అభ్యర్థులు గద్వాలలోని రెండో రైల్వేగేట్ సమీపంలోని టీటీఎన్ భవనం బీసీ స్టడీ సర్కిల్లో ఈనెల 28వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 26, 2024

నల్లమలలో పెరుగుతున్న చిరుత పులులు

image

అమ్రాబాద్ : నల్లమలలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు (ఏటీఆర్‌) పరిధిలో చిరుతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వీటి సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ.. అమ్రాబాద్‌ అభయారణ్యంలో మాత్రం పెరగడం గమనార్హం. దేశవ్యాప్తంగా చిరుతల గణాంకాల నివేదికను నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ) వైల్డ్‌లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసింది.అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు పరిధిలో 173 చిరుతలు ఉన్నాయి.

News March 25, 2024

MBNR: నేను ఎంపీగా గెలిస్తే ప్రాజెక్టులు పూర్తి చేస్తా : మల్లు రవి

image

తాను నాగర్ కర్నూల్ ఎంపీగా గెలిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లురవి అన్నారు. సోమవారం వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ ప్రాంతం పూర్తిగా వెనుకబడిందని తాను గెలిస్తే అభివృద్ధి చేస్తానన్నారు. రైల్వే సదుపాయానికి కేంద్రంతో మాట్లాడి ఏర్పాటు చేస్తానన్నారు