Mahbubnagar

News March 25, 2024

గద్వాల జిల్లాకు పొంచి ఉన్న తాగునీటి గండం

image

జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గిపోతుండటంతో జోగుళాంబ గద్వాల జిల్లాకు తాగునీటి గండం పొంచి ఉందని చెప్పొచ్చు. ఈ ఏడాది కృష్ణాబేసిన్‌లో వర్షాలు తక్కువగా కురవడంతో ప్రాజెక్టులలో తగినన్ని నీటి నిల్వలు లేవు. దీంతో తాగునీటికి ఇబ్బందులు లేకుండా.. రబీ పంటకు క్రాప్ హాలిడే ప్రకటించారు. అయినప్పటికీ రోజు రోజుకు మండుతున్న ఎండలకు జూరాలలోని నీటి నిల్వలు పడిపోతుండటంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.

News March 25, 2024

MBNR: గొర్రెల పంపిణీ.. పాత అధికారుల పాత్రపై ఆరా

image

ఉమ్మడి జిల్లాలో 2017 సంవత్సరంలో ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేసింది. NGKL జిల్లాలో పశు సంవర్ధక శాఖ అధికారిగా ఉన్న అంజిలప్ప, ఏడీ కేశవసాయి ఏసీబీ అధికారులు వారం రోజుల క్రితం అరెస్టు చేశారు. వీరు ఉమ్మడి జిల్లాలో 4 సంవత్సరాల పాటు పనిచేశారు. వీరి హయాంలో జరిగిన గొర్రెల యూనిట్ల పంపిణీ ఏమైనా అవినీతి జరిగిందా..? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. రికార్డులను తెప్పించుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

News March 25, 2024

నాటి MBNR జాయింట్ కలెక్టర్‌.. నేడు MLA బరిలో..

image

ఒకప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన దేవ వరప్రసాద్‌.. తాజాగా ఏపీలో MLA అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగనున్నారు. ఈమేరకు వరప్రసాద్‌కు జనసేన అధినేత పవన్ రాజోలు టికెట్ ఖరారు చేశారు. ఆయన 2021లో జనసేన జనవాణి విభాగం కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టారు. గతంలో పౌరసరఫరాల సంస్థ MD, అబ్కారీ శాఖ డైరక్టర్‌గా సేవలందించారు.

News March 25, 2024

‘న్యాక్’ గ్రేడ్ మెరుగుపరచుకోని డిగ్రీ కళాశాలలు

image

జాతీయ మదింపు గుర్తింపు మండలి న్యాక్ గ్రేడ్ సాధనలో ఉమ్మడి జిల్లాలోని పీయూ పరిధిలోని డిగ్రీ కళాశాలలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. న్యాక్ గుర్తింపులో ఇప్పటివరకు గ్రేడ్ బి++ మాత్రమే ఉండగా జడ్చర్లలోని డా. బిఆర్ఆర్ డిగ్రీ కళాశాల తొలిసారిగా న్యాక్ ఎ-గ్రేడ్ సాధించింది. ఇది ఉమ్మడి జిల్లా చరిత్రలో ఓ నూతన అధ్యాయనమని చెప్పొచ్చు. న్యాక్ గుర్తింపు ఉంటేనే కేంద్ర ప్రభుత్వం కళాశాలలకు నిధులు కేటాయిస్తుంది.

News March 25, 2024

MBNR: ఈనెల 30 వరకు గడువు పొడిగింపు

image

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈనెల 30 వరకు గడువు పొడిగించినట్లు అధికారి ఫ్లోరెన్స్ రాణి తెలిపారు. ఆసక్తి ఉండి ఇంకా దరఖాస్తు చేసుకోని ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 21న ఉదయం 11 గంటలకు నుంచి మ. 1గంట వరకు ఉంటుందని చెప్పారు.

News March 25, 2024

NRPT: పండుగ పూట విషాదం… ట్యాంకు కూలి చిన్నారి మృతి

image

నారాయణపేటలో హోలీ పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. నీటి ట్యాంకు కూలి పడి సాయి ప్రణతి(13) అనే చిన్నారి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. స్థానిక గోపాల్‌పేట వీధిలో కామ దహనం చేసిన సందర్భంగా నీటి ట్యాంకు మంటల వేడికి గురి కాగా.. ట్యాంకు వద్ద నీటిని పట్టుకునేందుకు వెళ్లిన చిన్నారులపై ట్యాంకు కూలి పడటంతో ఘటన జరిగింది. చిన్నారి మృతితో పండగపూట విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 25, 2024

NGKL: ఉపాధి కోసం వెళ్లి కొడుకును పొగొట్టుకున్నారు !

image

ఒంటిపై వేడినూనె పడి <<12918373>>చిన్నారి జయదేవ్‌<<>>(3) మృతి వెల్దండ మండలం బండోనిపల్లిలో విషాదం నింపింది. అర్జున్‌, శారదమ్మ దంపతులు జాతరల్లో స్వీట్లు, తినుబండారాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆమనగల్లు వేంకటేశ్వరస్వామి జాతరలో స్వీట్లు విక్రయించేందుకు పిల్లలతో సహా వెళ్లారు. స్వీట్లు చేస్తుండగా జయదేవ్‌ ఒంటిపై నూనెపడి తీవ్ర గాయాలతో మృతిచెందాడు. కళ్లముందే చిన్నారి మృతితో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. 

News March 25, 2024

మహబూబ్‌నగర్: రేపు పీయూలో ప్రపంచ సాహిత్యంపై కార్యశాల

image

పాలమూరు విశ్వవిద్యాలయంలో ఈనెల 26న ‘నాల్గో ప్రపంచ సాహిత్యం’ అనే అంశంపై అంతర్జాతీయ స్థాయిలో ఒకరోజు కార్యశాల నిర్వహిస్తున్నట్లు పీయూ ఆంగ్ల విభాగాధిపతి డా. మాళవి తెలిపారు. మంగళవారం అకాడమిక్ బ్లాక్ ఆడిటోరియంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి పీయూ పరిధిలోని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న స్కాలర్స్, అధ్యాప కులు, వివిధ విభాగాధిపతులు హాజరుకావాలని కోరారు.

News March 25, 2024

MBNR: ఎమ్మెల్సీ ఎన్నికలు.. క్రాస్ ఓటింగ్ భయం !

image

మహబూబ్‌‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలకు క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. ఓటర్లు చేజారిపోకుండా అన్ని ప్రయత్నాలు ప్రారంభించారు. అటు కాంగ్రెస్ అభ్యర్థికి.. ఇటూ బీఆర్ఎస్ అభ్యర్థికి తమ ఓటు మీకే అంటూ ఓటర్లు సంకేతాలు పంపిస్తున్నారట. ఈ క్రమంలో ఓటర్లు చేజారకుండా నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటింగ్‌కు ఇంకా 4 రోజులే ఉండడంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఓటర్లపై గట్టి నిఘా పెట్టారు.

News March 25, 2024

MBNR: కలర్ పడుద్ది.. కళ్లు భద్రం..!

image

హోలీ అంటేనే రంగుల కేళి.. చిన్నా పెద్దా తేడా లేకుండా కలిసి ఆడే పండుగ. నేడు ఈ వేడుక జరుపుకొనేందుకు పాలమూరు ప్రజలు సిద్ధమైన వేళ వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. సరదా సంబురం మాటున ప్రమాదం పొంచి ఉన్నదని.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రంగులు కళ్లల్లో పడకుండా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సహజ సిద్ధమైన రంగులను వినియోగిస్తే మంచిది అని అంటున్నారు.