Mahbubnagar

News June 26, 2024

నామినేటెడ్ పదవులపై నేతల ఆశలు

image

స్థానిక సంస్థల ఎన్నికలలోపే నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలన్న ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందుకు అనుగుణంగా పార్టీ విధేయులు.. ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నాయకులెవరు అంటూ ఆరా మొదలు పెట్టినట్లు తెలిసింది. దీంతో నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్న నాయకులకు ఆశలు చిగురిస్తున్నాయి. నేతలను ప్రసన్నం చేసుకుంటూనే మరోవైపు గాంధీ భవనం చుట్టూ తిరుగుతూ ప్రయత్నాలు మొదలు పెట్టారు.

News June 26, 2024

పాఠశాలలో చేరిన SAలు.. SGTల పదోన్నతులపై ఫోకస్

image

స్కూల్ అసిస్టెంట్ సమాన స్థాయి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగియడంతో అధికారులు ఎస్జీటీ సమాన స్థాయి ఉపాధ్యాయులకు SAలుగా పదోన్నతి కల్పించడంపై దృష్టి సారించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 1,734 మంది SAలు బదిలీ ఉత్తర్వులు అందుకున్నారు. బదిలీ అయిన ఉపాధ్యాయులు మంగళవారం కొత్త పాఠశాలల్లో విధుల్లో చేరారు. పదోన్నతులు పొందనున్న SGTలు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అధికారులు అవకాశం కల్పించారు.

News June 26, 2024

నాగర్‌కర్నూల్‌: ఏసీబీకి దొరికిన వెల్డండ ఎస్సై

image

వెల్దండ SI రవిని అరెస్ట్ చేసినట్లు ACB DSP కృష్ణాగౌడ్‌ తెలిపారు. కల్వకుర్తి తిలక్‌నగర్‌ చెందిన వెంకటేశ్‌ ఇంట్లో ఈనెల 17న జిలిటిన్ స్టిక్స్ పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు కాకుండా ఉండేందుకు రూ.50వేలు లంచం డిమాండ్‌ చేయగా బాధితుడు ఈనెల 19న ACBని ఆశ్రయించారు. SI సూచనతో అంబులెన్స్ డ్రైవర్‌ విక్రమ్‌కు రూ.50వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అదే సమయంలో ఠాణాలో రవిని అరెస్టు చేశారు.

News June 26, 2024

మహిళల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం: కలెక్టర్ విజయేంద్ర

image

మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని MBNR కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. మంగళవారం జిల్లా మహిళా సమైక్య కార్యాలయంలో నిర్వహించిన మహిళా శక్తి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆదాయాన్ని రెట్టింపు చేసి కోటీశ్వరులను చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకెళుతుందని అన్నారు.

News June 25, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

✒పార్లమెంట్‌లో ఎంపీగా డీకే అరుణ, మల్లు రవి ప్రమాణ స్వీకారం
✒NRPT: ఫోన్లు పోగొట్టుకుంటే ఫిర్యాదు చేయండి:SP
✒కొడంగల్‌లో ప్రోటోకాల్ వివాదం
✒NGKL: ఉరేసుకొని బాలుడు సూసైడ్
✒రేపు స్కూళ్ల బంద్ ప్రకటించిన ఏబీవీపీ
✒ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న కూరగాయల ధరలు
✒ప్రతి కేసులో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి:GDWL ఎస్పీ
✒ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు మినహాయింపు కల్పించండి:TWJF

News June 25, 2024

MBNR: సీఎం ఏర్పాటు చేసిన విందులో జిల్లా ఎమ్మెల్యేలు

image

ఢిల్లీలోని సీఎం రేవంత్ రెడ్డి అధికారిక నివాసంలో మంగళవారం రాత్రి ఏర్పాటుచేసిన విందులో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.

News June 25, 2024

లోక్‌సభకు తొలిసారి డీకే అరుణ.. మూడోసారి మల్లురవి

image

ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన MBNR నుంచి డీకే అరుణ, NGKL నుంచి మల్లురవి ఎంపీలుగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. డీకే అరుణ 1994లో టీడీపీ నుంచి, 2019లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీచేసి ఓటమి చెందారు. తాజా ఎన్నికల్లో గెలుపొందిన అరుణ(బీజేపీ) తొలిసారి పార్లమెంట్‌లో కాలు పెట్టబోతున్నారు. అటూ 1991, 96లో రెండుసార్లు ఎంపీగా పనిచేసిన మల్లు రవి.. 3వ సారి లోక్ సభలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.

News June 25, 2024

MBNR: పీసీసీ చీఫ్ రేసులో సంపత్ కుమార్..?

image

MBNR: పీసీసీ చీఫ్ రేసులో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈనెల 27తో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. గత మూడు సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. దీంతో కొత్తగా ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరిని నియమిస్తుందనే ఉత్కంఠ నెలకొంది.

News June 25, 2024

నాగర్‌కర్నూల్: ఉరేసుకొని బాలుడు సూసైడ్

image

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన బాలుడు పవన్(17) మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొన్నట్లు స్థానికులు తెలిపారు. పవన్ ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News June 25, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ఉష్ణోగ్రత వివరాలు

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో 37.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా ఆల్లంపుర్లో 35.9, వనపర్తి జిల్లా శ్రీరంగపూర్ 35.9, మహబూబ్నగర్ జిల్లా అడ్డాకులలో 35.8, నారాయణపేట జిల్లా ధన్వాడలో 34.9 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.