India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాంగ్రెస్ ప్రభుత్వానికి సురుకు పెట్టి బలుపు దింపాలని BRS అధినేత KCR పిలుపునిచ్చారు. బస్సు యాత్రలో భాగంగా శనివారం NGKLలో KCR ప్రసంగించారు. మళ్లీ BRS ప్రభుత్వం వస్తుందని అన్నారు. ‘సీఎం మాటలు కోటలు దాటుతుంటే పనులు గడప దాటడం లేదు. దుర్మార్గ కాంగ్రెస్ పాలన పోవాలంటే BRSకు పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతివ్వాలి. KCR చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో పోరాటం చేశాను తెలంగాణ సాధించాను’ అని అన్నారు.
తెలంగాణలో నామినేషన్ల పరిశీలన తర్వాత 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 625 నామినేషన్లు ఆమోదించినట్టు ఈసీ అధికారికంగా ప్రకటించింది. మహబూబ్ నగర్ లో7, నాగర్ కర్నూల్ లో13 నామినేషన్లను తిరస్కరించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్ రాజ్ వెల్లడించారు. పరిశీలన అనంతరం MBNRలో 35,NGKLలో 21 నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు ఆమోదించినట్లు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈనెల 29న ముగియనుంది.
☞రైతుబంధు ఇవ్వమంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదు?
☞ప్రజల సొమ్మును రైతులకు ఇవ్వడానికి వచ్చిన నష్టమేంటి?
☞రైతులంటే సీఎం రేవంత్ రెడ్డికి అంత చులకనా?
☞తాగునీటి కోసం మహిళలు నీళ్ల ట్యాంకర్ల కోసం ఎదురు చేసే రోజులు వచ్చాయి.
☞సొంత గడ్డకు సేవ చేయాలనే దృడ సంకల్పంతో RSP రాజకీయాల్లో వచ్చారు. ఆయనను ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలి.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు మద్దతుగా మాజీ సీఎం కేసీఆర్ ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్ సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణులలో కొత్త జోష్ కనిపిస్తుంది. కేసీఆర్ సభకు జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కేసీఆర్ మాట్లాడుతున్నంత సేపు కార్యకర్తల ఈలలు, కేకలతో సభా ప్రాంగణం మారు మోగింది..
నాగర్ కర్నూల్ BRS MP అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్ కమిట్మెంట్ ఉన్న నాయకుడని, అలాంటి వ్యక్తిని MPగా గెలిపించుకుంటే మన ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని మాజీ సీఎం KCR అన్నారు. నాగర్ కర్నూల్‌లో శనివారం రాత్రి జరిగిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన RS ప్రవీణ్ కుమార్ వాటిని ఏ విధంగా తీర్చిదిద్దారో మీ అందరికీ తెలుసు అని అన్నారు.
జిల్లా ప్రజలు 5 రోజులు అప్రమత్తంగా ఉండాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. శనివారం ఆయన ఛాంబర్ మాట్లాడుతూ.. 5 రోజులపాటు జిల్లాలో ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరే అవకాశం ఉందన్నారు. మధ్యాహ్నం వేళలో ఎవరు ఎండలో తిరగరాదని, తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే తలకు టోపీ ధరించాలని, శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలన్నారు. లేత తెలుపు రంగు వదులుగా ఉండే దుస్తులు ధరించాలని సూచించారు.
షాద్ నగర్ పరిధిలోని ఎలకిచర్ల, జిల్లేడు చౌదరిగూడలో మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ శనివారం రోడ్ షో నిర్వహించారు. అరుణ మాట్లాడుతూ.. ‘రేవంత్ రెడ్డి చిక్కడు దొరకడు.. అయన సీఎం స్థాయి మరిచిపోయి మాట్లాడుతున్నారు’ అని అన్నారు. కాంగ్రెస్ ప్రజాధరణ కోల్పోయిందన్నారు. బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
రైతు బతికి ఉండగానే చనిపోయినట్లు రికార్డులు సృష్టించి భూమిని కాజేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. జిల్లేడు చౌదరి గుడా మండలంలోని వీరన్న పేట గ్రామానికి చెందిన రైతు గడ్డం వెంకటయ్యకు సంబంధించిన 30 గుంటల భూమిని అధికారులు ఇతరుల పేరున చేశారు. రైతు బంధు రావడం లేదంటూ అధికారుల వద్దకు వెళ్లగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి కారణమైన 9 మంది రెవెన్యూ సిబ్బందిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, గర్భిణులు, బాలింతలతో పాటు చిన్నారులకు అందించే సేవలో మార్పులు తీసుకొచ్చేందుకు అంగన్వాడీ కుటుంబ సర్వే ఉమ్మడి జిల్లాలో మొదలుపెట్టారు. ఒక కేంద్రానికి 250 ఇళ్ల నుంచి 300 ఇళ్లు ఉండేలా సర్దుబాటు చేసి, సంబంధిత వివరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రెండు రకాల యాప్ లో సర్వేను ఒకే సారి పొందుపరుస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,321 అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు ఎండలు దంచి కొడుతున్నాయి. 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నందున వృద్ధులు చిన్నారులు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
* తెలుపు రంగు గల కాటన్ దుస్తులను ధరించండి
* అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రండి
* కళ్లకు రక్షణ కోసం సన్ గ్లాసెస్ ను వాడండి
* దాహం వేయకపోయినా తరచూ నీటిని తాగండి
* వీలైనంతవరకు ఇంట్లో ఉండండి.
Sorry, no posts matched your criteria.