India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నాగర్ కర్నూల్ జిల్లాలో చెంచు మహిళా ఈశ్వరమ్మపై దాడి ఘటనలో మరో కొత్త కోణం వెలుగుచూసింది. ఈశ్వరమ్మపై దాడికి ముందే 20 రోజుల క్రితం ఆమె చిన్నమామ నాగన్న అనుమానాస్పదంగా మృతిచెందారు. భూమి విక్రయానికి అడ్డుపడ్డాడని నాగన్నను కొందరు హత్య చేసి పోస్టుమార్టం చేయకుండానే అంత్యక్రియలు చేయించారని స్థానికంగా టాక్. తాజాగా దాడి నేపథ్యంలో బాధితుల ఫిర్యాదుతో నాగన్న మృతిపైనా పోలీసులు విచారణ చేపట్టారు.
శ్రీశైలం మల్లికార్జున స్వామిని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి సాదరంగా ఆహ్వానం పలికి ప్రత్యేక పూజలు చేయించి, వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్ రెడ్డి, మెగా రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.
తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబిక అమ్మవారిని వేడుకున్నట్లు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం ఆయన పాలమూరు మంత్రులు, ఎమ్మెల్యేలతో శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నారు.ఈ సందర్భంగా అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతూ, పంటలు సమృద్ధిగా పండాలని ఆయన ఆకాంక్షించారు.
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చాయి. ఫస్టియర్‌లో MBNRలో మొత్తం 5933 మంది విద్యార్థులకు 3600(60.66) మంది, GDLలో 2045కి 1244(60.83), NGKLలో 3456కి 1954(56.54), WNPలో 3,512కి 1,965(55.94)NRPTలో 2,487కి 1,242 (49.94) పాసయ్యారు. సెకండియర్‌లో MBNR జిల్లాలో 3,277కి 1,435(43.79), NGKLలో 2,139కి 911 (42.59), NRPTలో 1,648కి 544(33.01), GDLలో 1,158కి 650(56.13), WNPలో 1,818కి 653(35.92) ఉత్తీర్ణులయ్యారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో 19.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్ పేటలో 18.5 మి.మీ, నారాయణపేట జిల్లా కోటకొండలో 2.0 మి.మీ, వనపర్తి జిల్లా సోలిపూర్లో 2.0 మి.మీ, గద్వాల జిల్లాలో ‘0’ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పత్తి తర్వాత రైతులు వరి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ సీజన్లో 6.35 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. గతేడాది వన కాలంలో 5.32 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా ఈసారి సుమారు లక్ష ఎకరాల్లో అదనంగా వరి పంట పెరగనుంది. ఏటా రైతులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దొడ్డు రకం వైపు మొగ్గు చూపుతారు. ఈసారి రైతులు సన్నా రకాల వైపు మొగ్గు చూపుతున్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలో రుణమాఫీ పై అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. రైతుల ఖాతాల వారీగా పొందిన రుణాల మొత్తాన్ని ఇప్పటికే గణించారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య తీసుకున్న రూ.1,981 కోట్లుగా లీడ్ బ్యాంకు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం పేర్కొన్న ప్రాథమిక షరతుల ప్రకారం.. 1,72,433 మంది రైతులకు రుణమాఫీ ద్వారా మేలు చేకూరనుంది.
ఉమ్మడి జిల్లాలోని జూరాల ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేపట్టేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. గతేడాది వర్షాభావ పరిస్థితులు, ఎగువ నుంచి ప్రాజెక్టుకు వరద రాకపోవడంతో 640 మి.యూనిట్లు లక్ష్యానికి గాను కేవలం 212 మి.యూ. మాత్రమే ఉత్పత్తి చేశారు. ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఇంత తక్కువ మొత్తంలో విద్యుదుత్పత్తి గతేడాదే కావడం విశేషం. ఈ ఏడాది లక్ష్యం 600 మిలియన్ యూనిట్లు.
ఓ వృద్ధురాలు బతికి ఉండగానే ఆమె పేరుపై ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించి ఆమె ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ ఘటన అమ్రాబాద్ మండలంలో జరిగింది. కుమ్మరోనిపల్లికి చెందిన సాయిలమ్మకు 1.08 గుంటల పట్టా భూమి ఉంది. డెత్ సర్టిఫికెట్ సృష్టించి ఆమె పేరు మీద భూమిని పలువురు పట్టా చేసుకున్నారు. రైతుబంధు డబ్బులు పడకపోవడంతో ఆమె అన్ని కార్యాలయాల చుట్టూ తిరిగింది. సమాచార హక్కు చట్టం ద్వారా విషయం బయటకు తెలిసింది.
మరుసటి రోజు ఆ యువకుడికి పెళ్లి చూపులు.. ఉదయంలోగా ఇంటికి వెళ్లేందుకు బైక్ పై బయలుదేరాడు. అతివేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జూబ్లీహిల్స్ PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. వనపర్తి జిల్లా చిన్నంబావి మం. లక్ష్మీపల్లికి చెందిన శివశంకర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఆదివారం పెళ్లిచూపులు ఉండడంతో బుల్లెట్ బైక్ పై స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో టిప్పర్ ఢీకొనడంతో మృతి చెందాడు.
Sorry, no posts matched your criteria.