Mahbubnagar

News June 24, 2024

MBNR: 25 నుంచి జాతీయ నెట్ బాల్‌కు శిక్షణ

image

ఆసియా నెట్ బాల్ మహిళా టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు 20 రోజుల పాటు నిర్వహించే శిక్షణ శిబిరం MBNRకు మంజూరైందని రాష్ట్ర కార్యదర్శి ఖాజా ఖాన్ తెలిపారు. ఈ నెల 25న డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో శిక్షణ శిబిరాన్ని ప్రారంభిస్తున్నామని, సౌదీ అరేబియా దేశం జెడ్డాలో సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 7 వరకు ఆసియా నెట్ బాల్ మహిళా టోర్నీ జరుగుతుందని, ఇందులో భారత్‌తో పాటు మరో 15 ఆసియా దేశాల జట్లు పాల్గొంటాయన్నారు.

News June 24, 2024

నేడు నాగర్ కర్నూల్‌ జిల్లాకు డిప్యూటీ సీఎం

image

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగల పెంటలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్తు కేంద్రాన్ని (SLBHES) సందర్శించనున్నారు. మధ్యాహ్నం 12.15 గంటల వరకు భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, 2.20 గంటలకు విద్యుత్ కేంద్రాన్ని తనిఖీ, 3 గంటల నుంచి 5 గంటల వరకు అధికారులతో సమావేశంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు.

News June 24, 2024

సీఎంను కలిసిన నారాయణపేట కలెక్టర్

image

నారాయణపేట జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ను ఆదేశించారు. ఆదివారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హైదరాబాదులోని రాష్ట్ర ముఖ్యమంత్రి నివాస గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

News June 24, 2024

మహబూబ్‌నగర్ జిల్లా TODAY TOP NEWS

image

☞పలు చోట్ల సీఎం చిత్రపటానికి పాలాభిషేకం☞ఢిల్లీ బయలుదేరిన డీకే అరుణ☞షాద్‌నగర్: ప్రాణం తీసిన చికెన్ ముక్క☞నల్లమలలో ప్లాస్టిక్ వాడకం నిషేదం☞నవాబ్‌పేట్: గంట వ్యవధిలో అన్న, చెల్లెలు మృతి☞NGKL: 8 మందికి పోలీసు సేవా పతకాలు☞ఆదివారం MRO ఆఫీస్‌లో RI.. MLA సీరియస్☞సీఎంను కలిసిన నారాయణపేట కలెక్టర్☞పలుచోట్ల శ్యాం ప్రసాద్ ముఖర్జీకి నివాలులు

News June 23, 2024

నారాయణపేట జిల్లా అభివృద్ధికి కృషి చెయ్యాలి: సీఎం

image

నారాయణపేట జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ను ఆదేశించారు. ఆదివారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హైదరాబాదులోని రాష్ట్ర ముఖ్యమంత్రి నివాస గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

News June 23, 2024

MBNR: ఉపాధ్యాయులకు నేడు బదిలీల ఉత్తర్వులు

image

ఉపాధ్యాయులకు శనివారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత రాత్రి 9 గంటల వరకు ఎడిట్ ఆప్షన్ కు అవకాశం కల్పించారు. ఆదివారం ఆన్లైన్లో బదిలీ ఉత్తర్వులను అందుకోవడానికి ఎదురు చూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఉత్తర్వులు అందుకొని సోమవారం కొత్త పాఠశాలల్లో విధుల్లో చేరేందుకు సమాయత్తం అవుతున్నారు.

News June 23, 2024

జడ్చర్ల: హోటల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్

image

జడ్చర్లలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్ చేసుకున్నాడు. CI ఆదిరెడ్డి వివరాలు.. APలోని అనంతపురం వాసి సురేశ్(36) HYDలో ఉంటున్నాడు. ఈనెల 20న షాద్‌నగర్ వెళ్తునట్లు భార్యకు చెప్పి వెళ్లిన సురేశ్ జడ్చర్లలో హైవే పక్కన హోటల్‌లో రూం తీసుకున్నాడు. అదేరోజు రాత్రి పురుగు మందుతాగి సూసైడ్ చేసుకోగా సిబ్బంది గుర్తించారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ దొరికిందని భార్య మంజుల ఫిర్యాదుతో నిన్న కేసు నమోదుచేశారు.

News June 23, 2024

పారిస్ ఒలంపిక్స్‌లో స‌త్తా చాటాలి: మంత్రి జూప‌ల్లి

image

అంత‌ర్జాతీయ ఒలంపిక్ దినోత్స‌వాన్ని పురస్కరించుకొని ఎల్బీ స్టేడియంలో ఒలంపిక్ ర‌న్‌ను మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ముఖ్య అతిధిగా హాజ‌రై క్రీడా జ్యోతిని వెలిగించి ప‌రుగులో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా క్రీడాకారుల‌కు మంత్రి జూప‌ల్లి ఒలింపిక్స్‌ డే శుభాకాంక్షలు తెలియజేశారు. పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త‌దేశ‌ క్రీడాకారులు త‌మ సత్తా చాటి దేశ‌ కీర్తి ప్రతిష్టలను పెంచాలని అన్నారు.

News June 23, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాతం వివరాలు..

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా కోస్గిలో 45.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా నవాబ్ పేటలో 35.0 మి.మీ, వనపర్తి జిల్లా పెబ్బేరులో 0.5 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ మరియు గద్వాల జిల్లాలో ‘0’ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News June 23, 2024

హైదరాబాద్‌లో ACCIDENT.. వనపర్తి వాసి మృతి

image

రోడ్డు ప్రమాదంలో వనపర్తి జిల్లా వాసి మృతిచెందాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడిక్కకడే చనిపోయాడు. మృతుడు వనపర్తి జిల్లాకు చెందిన రవి శంకర్‌గా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.