Mahbubnagar

News April 25, 2024

NGKL: బీజేపీ 400 సీట్లు సాధించడం ఖాయం: గుజరాత్ సీఎం

image

దేశానికి ఒక గుర్తింపు తెచ్చి ప్రపంచ దృష్టిని దేశం వైపునకు మరల్చిన గొప్ప వ్యక్తి నరేంద్రమోదీ అని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అన్నారు. గురువారం NGKL పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ప్రసాద్ నామినేషన్ కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్‌గా పాల్గొని నల్లవెల్లి చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మాట్లాడారు. ఈసారి 400 సీట్లు సాధించి మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు.

News April 25, 2024

MBNR, NGKL స్థానాలకు ఎన్ని నామినేషన్లంటే..

image

ఉమ్మడి MBNR జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నేడు చివరి రోజు కావడంతో చాలామంది నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల కీలక నేతలతో పాటు డమ్మీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. MBNR పార్లమెంటు నుంచి 19 మంది, NGKL నుంచి 15 మంది అభ్యర్థులు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రేపు శుక్రవారం నామినేషన్ల పరిశీలన, ఈనెల 29 వరకు ఉపసంహరణకు గడువు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News April 25, 2024

MBNR: ఇంటర్ ఫెయిలైన వారికి ALERT.!!

image

ఇంటర్ ఫస్ట్, సెకండియర్లో ఫెయిలైన విద్యార్థులకు మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫస్టియర్‌కు ఉ.9 నుంచి మ.12 వరకు, సెకండియర్‌కు మ.2.30 నుంచి సా. 5.30 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఈ పరీక్షల ఫీజును నేటి నుంచి మే2 వరకు కాలేజీల్లో చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.600 చెల్లించాలి. దీనికి కూడా మే 2 వరకు ఛాన్స్ ఉంది.

News April 25, 2024

నామినేషన్ వేసిన మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి

image

మహబూబ్‌నగర్ BRS ఎంపీ అభ్యర్థి మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి ఈరోజు జిల్లా కలెక్టరేట్లో నామినేషన్ వేశారు. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డితో కలిసి నామినేషన్ పత్రాలను కలెక్టర్ రవి నాయక్‌కు అందించారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే పార్లమెంట్ అభివృద్ధి కోసం కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

News April 25, 2024

NGKL: మల్లు రవి ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే..

image

NGKL పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవి సమర్పించిన అఫిడవిట్లో ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలు వెల్లడించారు. కుటుంబ ఆస్తుల విలువ రూ.52.32 కోట్లు, ఆయనకు 4.5 తులాల బంగారం, సతీమణికి 87.5 తులాల బంగారు ఆభరణాలు, 10 క్యారెట్ల వజ్రాలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఏపీలో మొత్తం 52.33 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్టు వెల్లడించారు. రూ.4.42 కోట్ల అప్పులు, 5 క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.

News April 25, 2024

మహబూబ్‌నగర్: ప్రతి పేపర్‌కు రూ.600

image

మహబూబ్‌నగర్: రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ కోరుకునే ఇంటర్ విద్యార్థులు నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఇంటర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. మే 2 వరకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రతి పేపర్‌కు రూ.600 రుసుము చెల్లించాలని పేర్కొన్నారు.

News April 25, 2024

ఒకేషనల్‌లో నారాయణపేట టాప్.. వనపర్తికి 18వ స్థానం

image

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలతో పోల్చితే ఒకేషనల్ కోర్సుల్లో మొదటి, రెండో సంవత్సరంలో నారాయణపేట జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఫస్టియర్ లో మహబూబ్ నగర్ 4వ, గద్వాల 5వ, వనపర్తి 16వ, నాగర్ కర్నూల్ 18వ స్థానంలో నిలవగా.. ద్వితీయ సంవత్సరంలో మహబూబ్ నగర్ 4వ, గద్వాల7వ, వనపర్తి 18వ, నాగర్ కర్నూల్ 20వ స్థానంలో ఉన్నాయి.

News April 25, 2024

కృష్ణ: రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

image

రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలో బుధవారం చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ సతీష్ వివరాల ప్రకారం.. మండలంలోని హిందూపూర్ గ్రామానికి చెందిన మంగలి రఘు(30) బుధవారం సాయంత్రం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తండ్రి శరణప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సతీష్ తెలిపారు.

News April 25, 2024

కాంగ్రెస్, బీజేపీల మధ్య లోపాయికారి ఒప్పందం: శ్రీనివాస్ గౌడ్

image

అసెంబ్లీ ఎలక్షన్‌లో బీజేపీ నాయకులు కాంగ్రెస్‌కు మద్దతిచ్చారని, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, బీజేపీలకు మద్దతిచ్చేలా మహబూబ్ నగర్ జిల్లాలో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి మరో సారి బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించటం ఖాయమన్నారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని కోరారు.

News April 25, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం
✔నేటి నుండి ప్రారంభం కానున్న ఓపెన్ SSC, ఇంటర్ పరీక్షలు
✔పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న స్థానిక MLAలు,MP అభ్యర్థులు
✔MBNR:నవ భారతి విద్యాలయంలో పాలిటెక్నిక్ ఉచిత శిక్షణ
✔నేడు నామినేషన్ వెయ్యనున్న MBNRసిట్టింగ్ ఎంపి శ్రీనివాస్ రెడ్డి,NGKL బిజెపి అభ్యర్థి భారత్ ప్రసాద్, పలు స్వాతంత్ర అభ్యర్థులు
✔MP ఎన్నిక నిర్వహణలపై అధికారుల ఫోకస్
✔NGKL:నేడు గుజరాత్ సీఎం రాక