Mahbubnagar

News April 25, 2024

MBNR,NGKLలో 34 మంది నామినేషన్లు

image

MBNR, NGKL లోక్ సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరు మొత్తం 53 సెట్ల నామపత్రాలు సమర్పించారు. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బుధవారం మహబూబ్ నగర్ లో ఏడుగురు అభ్యర్థులు మొత్తం 9 సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. నాగర్ కర్నూల్ లో నలుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. నేడు చివరి రోజు కావడంతో మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.

News April 25, 2024

వృత్తి విద్యలో రాష్ట్రంలోనే నారాయణపేట ‘TOP’

image

ఇంటర్మీడియట్ సాధారణ ఫలితాల్లో దిగువ నుంచి రెండో స్థానంలో ఉన్న నారాయణపేట జిల్లా వృత్తి విద్య ఫలితాల్లో మాత్రం రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. దామరగిద్ద, ఉట్కూరు మండలాల్లోని కేజీబీవీల్లోని వృత్తి విద్యా కోర్సులు పరీక్షలు రాసిన విద్యార్థులు అందరూ పాసయ్యారు. ఈ విజయంపై జీసీడీవో పద్మనళిని తదితరులు సంతోషం వ్యక్తం చేశారు.

News April 25, 2024

సర్వం సిద్ధం.. నేటి నుంచి ఓపెన్ పరీక్షలు ప్రారంభం

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి ఓపెన్ SSC,ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో ఎస్సెస్సీ పరీక్షకు 12 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 2,864 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అలాగే ఇంటర్ పరీక్షకు 19 కేంద్రాలు ఏర్పాటు చేయగా 4,013 మంది విద్యార్థులు రాయనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది.

News April 25, 2024

సలేశ్వరం జాతర.. వెళ్లొస్తాం లింగమయ్యా… 

image

సలేశ్వరం ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. 3 రోజుల్లో సుమారు 2 లక్షల మంది భక్తులు లింగమయ్యను దర్శించుకున్నట్లు అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. చివరి రోజు వస్తున్నాం లింగమయ్యా.. వెళ్లొస్తాం లింగమయ్యా.. భక్తి పారవశ్యంతో తరలివచ్చారు. శివమామస్మరణాలతో నల్లమల మార్మోగింది. ఈ ఏడాది ఎండల తీవ్రతో భక్తుల రద్దీ తగ్గింది. ఉత్సవాలకు పోలీస్ శాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. వర్షాలు లేకపోవడంతో ఊపీరి పీల్చుకున్నారు.

News April 25, 2024

ఉమ్మడి జిల్లాలో ‘TODAY TOP NEWS’

image

✒ఉమ్మడి జిల్లాలో ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు.. అమ్మాయిలదే హవా
✒కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
✒సమస్యల పరిష్కారానికి పోటీ చేస్తున్న: బర్రెలక్క
✒కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుంది:DK అరుణ
✒కారులో తిరిగేందుకు రాజకీయాల్లోకి రాలేదు:RS ప్రవీణ్
✒వేసవి సెలవులు.. పిల్లలపై కన్నేసి ఉంచండి: SPలు
✒GDWL: తనిఖీల్లో రూ.6,76,920 సీజ్
✒సర్వం సిద్ధం.. రేపటి నుంచి ఓపెన్ INTER,SSC పరీక్షలు

News April 25, 2024

NRPT: ఈత సరదా విషాదం కాకూడదు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో విద్యా సంస్థలకు వేసవి సెలవులు రావడంతో విద్యార్థులు ఈత కొట్టేందుకు జలాశయాలు, చెరువులు, కుంటల వద్దకు వెళ్తుంటారు. ఈత సరదా కుటుంబంలో విషాదం నింపకుండా పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలని NRPT జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. విషాదాలు జరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని సూచించారు. పిల్లలను ఒంటరిగా పంపించొద్దని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పిల్లలపై కన్నేసి ఉంచాలన్నారు.

News April 25, 2024

MBNR:రాష్ట్రంలోనే బైపీసీలో మనమే టాప్!

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని ఓ జూనియర్ కళాశాలకు చెందిన సఫూరా తబస్సుమ్ బైపీసీలో రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ సాధించింది. బైపీసీలో ఆమెకు 440 మార్కులకు 438 వచ్చాయి. ఇంగ్లిష్‌లో 99 (థియరీ 79, ప్రాక్టికల్స్ 20),అరబిక్‌లో 99, బోటనీలో 60, జువాలజీ 60, ఫిజిక్స్‌లో 60, కెమిస్ట్రీలో 60 మార్కులు సాధించింది. దీంతో ఆమెకు గ్రామస్థులు, పలువురు అభినందనలు తెలుపుతున్నారు.

News April 25, 2024

MBNR: సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్

image

CM రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాకు ఏం చేశారో చెప్పకుండా తనపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మహబూబ్‌నగర్ BJP అభ్యర్థి డీకే అరుణ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. ఒక సీఎంగా ఉన్న రేవంత్ ఆరు సార్లు వచ్చారు. అంటే కాంగ్రెస్‌కు ఓటమి భయం మొదలైందని అన్నారు. రేవంత్ రెడ్డికి తాను పోటీ కానప్పుడు తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు.

News April 25, 2024

మే 4న నారాయణపేటకు ప్రధాని మోదీ

image

నారాయణపేట: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల 30, మే 3, 4 తేదీల్లో ఆయన పర్యటించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మే 4న నారాయణపేట, వికారాబాద్‌ జిల్లాల్లో నిర్వహించే సభల్లో ప్రధాని నరేంద్రమోదీ హాజరు కానున్నారు. ప్రధాని మోదీ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే నాగర్ కర్నూల్ రాగా, 2వ సారి నారాయణపేటకు రానున్నారు.

News April 25, 2024

ఇంటర్ ఫలితాల్లో అచ్చంపేట GOVT కాలేజ్ విద్యార్థిని సత్తా

image

అచ్చంపేట మండల కేంద్రానికి చెందిన పిట్టల స్నేహిత ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది. అచ్చంపేట ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో ఎంపీసీ చేసిన స్నేహిత ఫస్టియర్‌లో 470 మార్కులకు 466 సాధించింది. రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించిన విద్యార్థినిని అధ్యాపకులు, కుటుంబ సభ్యులు అభినందించారు.