India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా కేంద్రలోని MVS డిగ్రీ కళాశాల UG డిగ్రీ సెమిస్టర్ 2,4,6 సెమిస్టర్ రెగ్యులర్, 1,2,3,4,5,6 సెమిస్టర్ బ్యాగ్‌లాగ్ ఫలితాలను బుధవారం PU ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ మధుసూదన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాలలో 2వ సెమిస్టర్‌లో 919 మందికి 355, 4వ సెమిస్టర్‌లో 935 మందికి 489, 6వ సెమిస్టర్‌లో 919 మందికి 812 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను MVS డిగ్రీ కళాశాల వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను వెంటనే చేపట్టాలని కోరుతూ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు బుధవారం ఆయన చాంబర్లో వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. ఆయన వెంట పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిద్ధార్థ రెడ్డి, తదితరులు ఉన్నారు.
అచ్చంపేట: సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల బాలబాలికలకు ఉచితంగా నీటిలో లాంగ్ టర్న్ కోచింగ్ ఇస్తున్నట్లు గురుకులాల ఆర్సీఓ వనజ బుధవారం తెలిపారు. షెడ్యూల్డ్ కులాల బాల, బాలికలు ఇంటర్ ఉత్తీర్ణత సాధించి నీట్ పరీక్షకు హాజరైనవారు www.tgswreis.telangana.gov.in వెబ్ సైట్లో రూ.200. చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) స్కేల్ ప్రకారం జీతాలు చెల్లించాలని కోరుతూ బాసర IIIT కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు బుధవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి వినతిపత్రం అందజేశారు. చాలా సంవత్సరాల నుంచి రిమోట్ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నామని, సేవలను గుర్తించి ప్రభుత్వం వేతనాలు పెంచుతూ రెగ్యులరైజ్ చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్ ఎస్పీ హర్షవర్ధన్‌కి జిల్లా పోలీస్ సిబ్బంది బుధవారం ఘనంగా వేడుకలు పలికారు. జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ హల్ నందు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో 8నెలల కాలంలో సిబ్బంది సహకారంతో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు చెప్పారు. ఈ ఘనత హోంగార్డు దగ్గర నుంచి ఎస్పీ వరకు అందరికీ దక్కుతుందన్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో బుధవారం అమానవీయ ఘటన వెలుగుచూసింది. జిల్లా కేంద్రంలోని నాగనూల్ రోడ్డులో శ్మశానవాటిక ఎదురుగా అప్పుడే పుట్టిన శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. అయితే అప్పటికే ఆడశిశువు మృతి చెందింది. స్ధానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మక్తల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. స్థానికుల వివరాలు.. మండలంలోని అనుగొండకు చెందిన సంజీవ్, కవిత(45) దంపతులు మక్తల్‌లో వరి విత్తనాలు కొనుగోలు చేసి బైక్‌పై గ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో స్థానిక సాయిబాబా మందిరం సమీపంలో వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో కిందపడిన కవిత తలపై నుంచి లారీ వెళ్లడంతో స్పాట్లో చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వదంతులను పార్టీ శ్రేణులు, ప్రజలు నమ్మొద్దని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. చివరి వరకు కేసీఆర్ నాయకత్వంలో BRS కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. గద్వాల క్యాంప్ ఆఫీసులో మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు 4 రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. అదంతా తానంటే గిట్టని వారు చేసే తప్పుడు ప్రచారం అన్నారు.
శ్రీరంగాపురంలోని రంగసముద్ర జలాశయం దాదాపు 3 కి.మీ. పొడవైన ఆయకట్టుతో పాటు ఆలయానికి మూడు వైపులా నీరు ఉండటంతో ఈ ప్రాంతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. కట్ట వెంబడి విద్యుద్దీపాలు, సేదతీరేందుకు బెంచీలు, మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించి మినీ ట్యాంక్ బండ్‌గా మారిస్తే జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది.
విహారయాత్ర ఓ యువకుని కుటుంబంలో విషాదం మిగిల్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. పాన్‌గల్‌కి చెందిన ఏడుగురు యువకులు స్నేహితులతో కలిసి జూరాల సందర్శనకు వెళ్లారు. యాత్ర ముగించుకుని మట్టి రోడ్డుపై వస్తుండగా మూలమల్ల గ్రామం వద్ద కారు బోల్తాపడింది. ఈ ఘటనలో రోహన్ అనే యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఆరుగురికి గాయాలైయాయని పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.