Mahbubnagar

News April 25, 2024

ఉమ్మడి జిల్లాలో “TODAY TOP NEWS”

image

✏జోగులాంబ సాక్షిగా.. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం:CM రేవంత్ రెడ్డి
✏కాంగ్రెస్ హామీలు అమలు చేయడంలో విఫలమైంది:KTR
✏MP ఎన్నికల్లో భరత్ ప్రసాద్‌ని గెలిపించుకోవాలి: మంద కృష్ణ
✏ఉమ్మడి జిల్లాలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
✏కాంగ్రెస్ లో చేరిన RS ప్రసన్న కుమార్
✏ఘనంగా సలేశ్వరం జాతర.. తరలివచ్చిన భక్తులు
✏ఉపాధి కూలీలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి:AIPKMS
✏నామినేషన్ వేసిన బర్రెలక్క
✏పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

News April 25, 2024

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేటి”TOP NEWS”

image

√NRPT: ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి.
√MBNR:అట్టడుగు వర్గాల సంక్షేమమే మోడీ లక్ష్యం: డీకే అరుణ.
√ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు.
√ పాలమూరు అభివృద్ధికి డీకే అరుణ అడ్డుపడుతుంది:సీఎం.
√NRPT:పనితీరు మెరుగుపరుచుకోకపోతే చర్యలు తప్పవు:కలెక్టర్.
√ అలంపూర్: కాంగ్రెస్ హామీలను అమలు చేయడంలో విఫలమైంది:KTR.
√NGKL:ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్.

News April 25, 2024

కొడంగల్‌ బిడ్డకు.. CM, PCC పదవిని ఇచ్చిందే కాంగ్రెస్

image

ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఐదింటిని 100రోజుల్లోనే అమలు చేశామని CM రేవంత్‌రెడ్డి అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నా.. KCR మాత్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. ఆయన చేసిన రైతు రుణమాఫీ బ్యాంకుల వడ్డీకే సరిపోలేదని విమర్శించారు. మద్దూరులో పార్టీ కార్యకర్తలతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం నిర్వహించారు. CM మాట్లాడుతూ.. కొడంగల్‌ బిడ్డకు కాంగ్రెస్‌ CM, PCC పదవిని ఇచ్చిందని అన్నారు.

News April 25, 2024

కాంగ్రెస్ హామీలు అమలు చేయడంలో విఫలమైంది: కేటీఆర్

image

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 10 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. 

News April 25, 2024

MBNR: రెండు లోక్‌సభ స్థానాల్లో మహిళ ఓటర్లే అధికం

image

ఉమ్మడి పాలమూరులోని రెండు లోక్ సభా స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములను మహిళా ఓటర్లే ప్రభావితం చేయనున్నారు. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గాల్లోని మొత్తం ఓటర్లలో సగానికిపైగా మగువలే ఉన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. మహిళా ఓటర్లను మెప్పించగలిగితే గెలుపు అవకాశాలు సులభమవుతుందని పార్టీలు భావిస్తున్నాయి.

News April 25, 2024

MBNR: వేసవి సెలవులు.. ప్రశ్నార్ధకంగా ప్రభుత్వ బడుల భద్రత

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3,205 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. రేపటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. కొన్ని చోట్ల పాఠశాలల పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. దాదాపుగా 70 శాతం పాఠశాలల్లో వాచ్‌మెన్లు లేరు. దీంతో ప్రభుత్వ బడుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. వీటన్నింటి నేపథ్యంలో పాఠశాలలను పర్యవేక్షించే సిబ్బందిని ఏర్పాటు చేయాలని విద్యార్థులు ఉపాధ్యాయులు కోరుతున్నారు.

News April 24, 2024

ఆగస్టు 15లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తా: సీఎం

image

ఆగస్టు 15 లోపు రైతుల కు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తాను రుణమాఫీ చేస్తానని ప్రకటిస్తే మాజీ మంత్రి హరీశ్ రావు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని, తాను రుణమాఫ చేసిన వెంటనే బీఆర్‌ఎస్ పార్టీని రద్దు చేస్తారా అంటూ ఆయన సవాల్ విసిరారు. ఏమాత్రం దమ్మున్న తన సవాల్‌ను స్వీకరించాలని అన్నారు. నూటికి నూరు శాతం రుణమాఫీ చేసి తీరుతానని చెప్పారు.

News April 24, 2024

సీఎం వరకు నా ప్రస్థానం కొడంగల్ నుంచి ప్రారంభమైంది

image

సీఎం వరకు తన ప్రస్థానం కొడంగల్ నుంచి ప్రారంభమైందని CM రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ సెగ్మెంట్లో మద్దూరు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మారుమూల కొడంగల్‌కు కాంగ్రెస్ CM పదవి ఇచ్చింది. KCRలా ఫామ్ హౌస్‌లో పడుకోకుండా ప్రజల్లోకి వెళుతున్నాం. మక్తల్ ఎత్తిపోతలకు ఆనాడు డీకే అరుణ అడ్డుపడ్డారు. కృష్ణా జలాల, రైల్వే లైన్ రాకుండా డీకే అరుణ అడ్డుకున్నారు’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

News April 24, 2024

ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం అత్యధికంగా వనపర్తి జిల్లా కేతేపల్లిలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నాగర్ కర్నూలు జిల్లా కిష్టంపల్లిలో 43.8, మహబూబ్నగర్ జిల్లా సల్కర్పేటలో 43.6, గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 43.5, నారాయణపేట జిల్లా ధన్వాడలో 43.0 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News April 24, 2024

NGKL: జోరుగా ప్రచారం

image

నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని ఉదృతం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి, బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాద్, బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. స్థానిక సమస్యలతో పాటు అధికార పార్టీపై విమర్శలకు పదును పెడుతున్నారు.