India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రెండు లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులు గెలుపోటములను మహిళా ఓటర్లే ప్రభావితం చేయనున్నారు. MBNR పరిధిలో 16,80,417మంది ఓటర్లు ఉండగా వీరిలో 8,48,293(50.48 శాతం) మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. NGKL పరిధిలో మొత్తం 17,34,773మంది ఓటర్లుండగా వీరిలో 8,70,694(50.19 శాతం) మహిళలు ఉన్నారు. కల్వకుర్తి, కొల్లాపూర్ మినహా మిగతా 5 సెగ్మెంట్లలో మహిళలు అధికంగా ఉన్నారు.
ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనం అల్లాడుతున్నారు. భరించలేని ఉక్కపోత ఉబ్బరంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సోమవారం నమోదైన ఎండవేడికి తారురోడ్డు కూడా సెగలు కక్కింది. గద్వాల జిల్లా వడ్డేపల్లి, ఇటిక్యాలలో 43.8, కేటీదొడ్డిలో 43.1, అలంపూర్లో 42.5, ధరూర్ లో 42.3, అయిజలో 42.1, గద్వాలలో 42, ఉండవెల్లిలో 41.1, గట్టులో 40.7, మల్దకల్లో 40.5, మానవపాడు, రాజోలిలో 40.3 డిగ్రీలు నమోదైంది.
పదర మండలంలోని మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ద్వాదశ వాస్తు పూజ, హోమం, మన్య సూక్త హోమం, గవ్యాంతర పూజలు, గరుడ వాహన సేవ, రాత్రి సీతారాముల కల్యాణం వేద పండితులు వైభవంగా నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రంగాచారి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన హనుమాన్ దీక్ష మాలధారణ చేపట్టిన స్వాములు, భక్తులు పాల్గొన్నారు.
భర్త వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మానవపాడు మండలం పెద్దపోతులపాడులో చోటుచేసుకుంది. ఎస్సై చంద్రకాంత్ వివరాలు.. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడకు చెందిన పరశురాముడు పెద్దపోతులపాడు గ్రామానికి చెందిన సుకన్యతో పదేళ్ల క్రితం పెళ్లయింది. భర్త తాగుడుకు బానిస అయ్యాడు. డబ్బు కోసం వేధించడంతో మాత్రలు వేసుకొని సోమవారం ఆత్మహత్యాయత్నం చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల గడువు దగ్గర పడుతుటండటంతో ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల పత్రాల సమర్పణ జోరందుకుంటోంది. సోమవారం MBNR, NGKL స్థానాల పరిధిలో మొత్తం 10 నామపత్రాలు దాఖలయ్యాయి. ఐదుగురు కొత్తగా నామపత్రాలు సమర్పించగా మిగతా ఐదుగురు మరో సెట్టు నామినేషన్ వేశారు. నాలుగు రోజుల్లో MBNR,NGKL లోక్ సభ స్థానాల్లో మొత్తం 17 మంది అభ్యర్థులు 24 సెట్ల నామినేషన్లు వేశారు.
NGKL: సలేశ్వరం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. అయితే పుల్లాయిపల్లి పెంట వరకు మాత్రమే బస్సులు వెళ్తున్నాయి. అచ్చంపేట డిపో నుంచి 16,NGKL 23, కొల్లాపూర్ 4,కల్వకుర్తి 4 బస్సుల చొప్పున మొదటి రోజు పుల్లాయిపల్లి వరకు 20 నిమిషాలు ఒక బస్సు చొప్పున ప్రయాణికులకు వీలుగా బస్సులు నడిపించినట్లు ఆర్టిసి అధికారులు తెలిపారు. అక్కడి నుంచి మోకాళ్ల కురువ చేరుకునేందుకు 50 ఆటోలు అందుబాటులో ఉంచారు.
నల్లమలలో జరిగే సలేశ్వరం జాతరలో భక్తులను వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయాల్లో లీటర్ మంచినీళ్ల బాటిల్ రూ.50, ఒక కొబ్బరికాయ రూ.100కు విక్రయిస్తున్నట్లు భక్తులు తెలిపారు. లింగమయ్య ప్రసాదంగా భావించే 3 లడ్డూలను రూ.100కు విక్రయించారు. దీంతో భక్తుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అటూ ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేక బస్సులు పల్లాయిపల్లి వరకే వెళ్తున్నాయి.
తెలంగాణ అమరనాథ్ యాత్రగా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం లింగమయ్య జాతరకు తొలిరోజు వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. రాత్రి సమయంలో భక్తులను అనుమతి లేకపోవడంతో లింగమయ్యను దర్శించుకొనేందుకు పగలే బారులు తీరారు. ఎండ తీవ్రతకు భక్తులు ఇబ్బంది పడ్డారు. చెంచు పూజారులు లింగమయ్యకు గిరిజన సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు. ఇరుకైన కొండ, కోనల్లో నడక సాగిస్తూ సలేశ్వరం జలపాతం వద్ద పర్యాటకులు సందడి చేశారు.
వనపర్తి: పాలీసెట్-2024 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే తేదీ పొడిగించబడిందని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు. ఈనెల 28 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని అన్నారు. రూ.100 అపరాధ రుసుముతో ఈ నెల 30 వరకు రూ.300 అపరాధ రుసుముతో వచ్చే నెల 20 వరకు ఫీజు చెల్లించవచ్చని అన్నారు. ప్రవేశ పరీక్ష వచ్చే నెల 24వ తేదీన ఉంటుందని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదని ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు.. మక్తల్ మండలం రుద్రసముద్రం గ్రామానికి చెందిన శివకుమార్(23) గ్రూప్, ఇతర పోటీ పరీక్షలు రాశాడు. ఈ క్రమంలో తోటివారికి ఉద్యోగాలు వచ్చి తనకు రాకపోవడంతో మనస్తాపం చెందాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. తల్లి వరలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై భాగ్యలక్ష్మీరెడ్డి తెలిపారు.
Sorry, no posts matched your criteria.