India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
√NGKL,NRPT జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి.. అలంపూర్లో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటనలు.
√NGKL:నేడు అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల సమావేశం.
√MBNR: నేడు కవి సమ్మేళనం.
√ కోస్గి: నేడు వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభం.
√ ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో నేడు కేంద్ర బలగాల కవాతు.
√ ఐజ: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం.
√ ధరూర్: నేడు కమ్యూనిటీ అవేర్నెస్ కార్యక్రమం.
‘జీవవైవిధ్య పరిరక్షణలో ఇటీవలి పురోగతులు, స్థిరత్వం’ అనే అంశంపై ఈ నెల 23న ఉదయం 10గంటలకు పీయూ వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అకాడమిక్ భవనంలో ఒకరోజు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు జాతీయ సదస్సు కన్వీనర్, బాటనీ విభాగాధిపతి పుష్పలత తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఉప కులపతి లక్ష్మీకాంత్ రాథోడ్, విశిష్ట అతిథిగా ఇన్ ఛార్జి రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డి తదితరులు హాజరవుతారని తెలిపారు.
సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలిసారి నాగర్‌కర్నూల్ రానుండటంతో ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బిజినేపల్లిలోనే ప్రచార సభ నిర్వహించగా.. అక్కడే మల్లు రవి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. NGKL సాగునీటి అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. BJP, BRS నుంచి గట్టి పోటీ నేపథ్యంలో జిల్లాలో అధికంగా ఉన్న ఎస్సీ ఓటర్లే లక్ష్యంగా ప్రచారం కొనసాగే అవకాశం ఉంది.
CM రేవంత్ రెడ్డి నేడు ఉమ్మడి జిల్లా పర్యటన ఖరారయింది. ఉదయం 11 గంటలకు నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లురవి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు నారాయణపేట జిల్లా మద్దూరులో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, మధ్యాహ్నం 1 గంటలకు తిమ్మారెడ్డిపల్లి బావోజీ జాతరకు హాజరవుతారు. తిరిగి సాయంత్రం 3 గంటలకు బిజినేపల్లిలో నిర్వహించే బహిరంగసభ కార్యక్రమంలో పాల్గొంటారు.
√NGKL:సలేశ్వరానికి పోటెత్తిన భక్తులు.
√ దామరగిద్ద: పేదలకు సంక్షేమ ఫలాలు అందాలంటే బిజెపిని గెలిపించాలి: డీకే అరుణ.
√ మద్దూర్: నేడు అట్టహాసంగా ప్రారంభమైన బావోజీ జాతర.. రేపు సీఎం రాక.
√ గద్వాల్:రూ. 7,65,600 నగదు పట్టివేత:ఎస్పీ.
√MBNR,NGKL పరిధిలో కొనసాగుతున్న ఎంపీ అభ్యర్థుల ప్రచారం.
√NRPT:పోలీసు ప్రజావాణికి 8 ఫిర్యాదులు.
√ ఉమ్మడి జిల్లాలో నేడు రికార్డు స్థాయిలో ఎండలు.
సీఎం రేవంత్ రెడ్డి రేపటి పర్యటనకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని డీఐజీ ఎల్ఎస్ చౌహన్ అన్నారు. మంగళవారం సీఎం పర్యటించనున్న తిమ్మారెడ్డిపల్లిలోని గురులోకామసంద్ దేవాలయం, మద్దూర్ మండల కేంద్రంలో కార్యకర్తలతో సమావేశమయ్యే ఫంక్షన్ హాల్‌ను పరిశీలించారు. ఆలయంలో పూజలు నిర్వహించి బందోబస్తుకు వచ్చిన పోలీసులతో సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎస్పీ యోగేష్ పాల్గొన్నారు.
నల్లమల అడవుల్లోని సలేశ్వరం లింగమయ్య దర్శనం ఓ మహోత్తర ఘట్టం. ప్రతి ఏటా ఏప్రిల్‌లో వచ్చే చైత్ర పౌర్ణమి సందర్భంగా జాతర జరుగుతుంది. స్వామివారి దర్శనం కోసం చిన్నా.. పెద్ద, ధనిక.. పేద తేడాలేకుండా అందరూ అడవిలో గంటల తరబడి నడిచి వెళ్లాల్సిందే. దర్శనానికి వెళ్లే ముందు ‘వస్తున్నా లింగమయ్యా’.. తిరిగి వెళ్లేప్పుడు ‘వెళ్లొస్తాం లింగమయ్యా’ అంటు భక్తి పరవశ్యంలో మునిగితేలుతారు.
నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కనున్నాయి . ఎంపీ అభ్యర్థులు ఇప్పటికే ఆయా అసెంబ్లీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే 23 నాగర్ కర్నూల్ లో జరిగే బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. 27న రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొంటారు. దీంతో స్థానిక నేతలు జనసమీకరణలో నిమగ్నమైయ్యారు. ఎంపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని సలేశ్వరంలో కేవలం పిడికెడు ఎత్తు గల శివలింగం దాని మీద ఇత్తడితో చేసిన నాగ పడగను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. సలేశ్వరం లింగమయ్యను దర్శించుకొనేందుకు వెన్నెల రాత్రిలో వేలాది మంది భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చి కారడవిలో ప్రయాణిస్తారు. లింగమయ్య నామస్మరణతో నల్లమల అభయారణ్యం పులకించిపోతోంది. పైనుంచి జాలువారే జలపాతం వద్ద భక్తులు కొండపైకి ఎగబాకి పుణ్యస్నానాలు ఆచరిస్తారు.
మహబూబ్ నగర్ జిల్లాలోని అడ్డాకులలో ఆదివారం అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బాలానగర్లో 42.7, కోయిలకొండలో 42.3, మూసాపేటలో 42.2, మిడ్జిల్లో 41.9, మహబూబ్ నగర్లో 41.5, జడ్చర్లలో 41.3 డిగ్రీలు నమోదు కాగా, నవాబ్ పేటలో అత్యల్పంగా 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రతతోపాటు వడగాలులు వీస్తున్నాయి. దీంతో వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.