Mahbubnagar

News April 22, 2024

MBNR: గురుకుల ప్రవేశ పరీక్షకు 85.04 శాతం హాజరు

image

రాష్ట్ర గురుకుల కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన పరీక్షకు 85.04 శాతం విద్యార్థులు హాజరైనట్లు జిల్లా సమన్వయకర్త, బీచుపల్లి గురుకుల కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారని, మొత్తం 11,660 మంది విద్యార్థులకు గాను 9,920 మంది హాజరయ్యారని ఆయన వివరించారు.

News April 22, 2024

పాలమూరులో న్యాయమూర్తుల బదిలీలు

image

మేడ్చల్ కోర్టు నుంచి MBNR జిల్లా కోర్టు మొదటి అదనపు జడ్జిగా కె.కల్యాణ చక్రవర్తి బదిలీపై రానున్నారు. అదేవిధంగా పాస్ట్‌ట్రాక్‌, మహిళా కోర్టు జడ్జిగా పనిచేస్తున్న వై.పద్మ HYD సిటీ సివిల్‌ కోర్టుకు బదిలీ అయ్యారు. GDL జిల్లా కోర్టులో మొదటి అదనపు జిల్లా అండ్‌ సెషన్స్‌ న్యాయమూర్తిగా పనిచేస్తున్న అన్నె రోస్‌ క్రిస్టియానా HYD CT కోర్టుకు బదిలీ అయ్యారు. MBNR SC,ST కోర్టు జడ్జి శ్రీదేవి బదిలీ అయ్యారు.

News April 22, 2024

కొత్తకోట: రోడ్డు ప్రమాదంలో ఫార్మసీ విద్యార్థి మృతి

image

రోడ్డు ప్రమాదంలో బీఫార్మసీ విద్యార్థి మృతి చెందాడు. కొత్తకోట మండలం కనిపెట్ట గ్రామానికి చెందిన భాస్కర్(23) వనపర్తి ప్రభుత్వ కళాశాలలో ఫార్మసీ చేస్తున్నాడు. ఆదివారం ఇంటి నుంచి కొత్తకోటకు బైక్‌పై వెళ్తుండగా పాలెం సమీపంలో కారు ఢీకొట్టింది. భాస్కర్ తలకు తీవ్ర గాయం కాగా ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈమేరకు తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదైందని SI మంజునాథ్ రెడ్డి తెలిపారు.

News April 22, 2024

మహబూబ్‌నగర్: TETకు 43,557 దరఖాస్తులు

image

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET)-2024కు <<13099468>>దరఖాస్తుల గడువు<<>> ముగిసింది. మార్చి 27 నుంచి ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా నుంచి టెట్‌కు మొత్తం 43,557 మంది దరఖాస్తు చేసుకున్నారు. TET-2024లో భాగంగా పేపర్-1కు 17,608, పేపర్-2కు 25,949 దరఖాస్తులు వచ్చాయి. ఈ పరీక్షకు మే 15 నుంచి హాల్ టికెట్లు జారీ చేయనున్నారు. మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు.

News April 22, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔మద్దూర్: నేటి నుంచి బాలాజీ ఉత్సవాలు ప్రారంభం
✔నేటి నుంచి సలేశ్వరం ఉత్సవాలు ప్రారంభం
✔పాలీసెట్ దరఖాస్తులకు నేడే తుది గడువు
✔పలు నియోజకవర్గాల్లో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు
✔GDWL,అమరచింత: నేడు పలు గ్రామాలలో కరెంట్ కట్
✔సలేశ్వరం జాతరకు ప్రత్యేక బస్సులు
✔ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న తనిఖీలు
✔పలుచోట్ల కేంద్ర బలగాలతో కవాతు
✔NGKL,మద్దూర్:రేపు రేవంత్ రెడ్డి రాకతో ఏర్పాట్లపై ఫోకస్

News April 22, 2024

సలేశ్వరం జాతరకు ప్రత్యేక బస్సులు

image

అచ్చంపేట: సలేశ్వరం జాతర జరిగే మూడు రోజుల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, మహబూబ్ నగర్, గద్వాల, దేవరకొండ, మిర్యాలగూడ, నల్లగొండ డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ జాతర ఐదు రోజుల నుంచి మూడు రోజులకు కుదించారు.

News April 22, 2024

MBNR: నేడు తుది గడువు..APPLY చేసుకోండి

image

 పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు ఈనెల 22న తుది గడువని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్, రీజినల్ కోఆర్డినేటర్ రాజేశ్వరి తెలిపారు. ప్రభుత్వ,ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు వ్యవసాయ,వెటర్నరీ, హర్టీకల్చర్, ఫిషరీస్ డిప్లొమాల్లో చేరేందుకు పదో తరగతి పూర్తయిన విద్యార్థులంతా polycet.sbtet.telan- gana.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 22, 2024

పాలమూరులో ‘పాగా’ వేసేది ఎవరో..?

image

MBNRలో లోక్ సభ పోరు రసవత్తరంగా జరగనుంది. చల్లా వంశీచంద్ రెడ్డి(INC), డీకే అరుణ(BJP), మన్నె శ్రీనివాస్ రెడ్డి(BRS) పోటీ చేస్తున్నారు. ముగ్గురూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. ఇక్కడ కాంగ్రెస్ అత్యధిక సార్లు, జనతా పార్టీ, జనతా దళ్, BJP ఒక్కోసారి గెలవగా, 2009, 14, 19 ఎన్నికల్లో BRS సత్తా చాటింది. ఇప్పటికే విమర్శలు తారస్థాయికి చేరాయి. పాలమూరులో ఈసారి పాగా వేసేదెవరో మీ కామెంట్..?

News April 22, 2024

MBNR: 85ఏళ్లు దాటిన వారికి ‘హోం ఓటింగ్’

image

85ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఇంటివద్దనే ఓటు వేసే సౌకర్యం ప్రభుత్వం కల్పించిందని సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ విభాగం నోడల్ అధికారి శ్రీధర్ సుమన్ అన్నారు. వృద్ధులకు ఎన్నికల సంఘం ‘హోం ఓటింగ్’ కల్పించిందని ఆయన తెలిపారు. ఓటు విలువపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యం పటిష్టతకు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.

News April 21, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

✒NGKL: పురుగుమందు తాగి AEO సూసైడ్
✒బిజినేపల్లిలో పంచాయతీ కార్మికుడు మృతి
✒SDNR: బైపాస్ రోడ్డులో ప్రమాదం.. యువకుడి మృతి
✒WNPT:గుండెపోటుతో ఇద్దరు మృతి
✒మద్దూర్:చిరుత దాడిలో దూడ మృతి
✒NGKL:రేపటి నుంచి సలేశ్వరం సాహస యాత్ర ప్రారంభం
✒CONGRESS,BJPలో భారీ చేరికలు
✒ఉమ్మడి జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు
✒WNPT:మున్సిపల్ చైర్మన్ గా మహేశ్, వైస్ ఛైర్మన్ గా కృష్ణ బాధ్యతలు స్వీకరణ
✒MBNR:KCR రెండు రోజులు రోడ్ షోలు