India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నాగర్‌కర్నూల్ జిల్లాలో పురుగుమందు తాగి ఏఈవో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు.. గోకారం గ్రామ ఏఈవో రామాంజనేయులు(26) కల్వకుర్తి వద్ద పొలంలో పురుగుమందు తాగాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రామాంజనేయులు మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వనపర్తి జిల్లాలో గుండెపోటుతో ఇద్దరు మృతిచెందారు. జిల్లా కేంద్రంలోని వల్లభ్ నగర్‌కు చెందిన బాదగౌని నరేశ్ గౌడ్(45) మరణించారు. నరేశ్ హోలీ రోజు ఇంటి పైనుంచి పడగా నిమ్స్‌కు తరలించారు. శనివారం వెన్నెముకకు సర్జరీకి ప్రయత్నించగా గుండెపోటుకు గురైన ఈరోజు చనిపోయినట్లు బంధువులు చెప్పారు. అలాగే పాన్‌గల్ మండలం కేతేపల్లి వాసి ఎర్రగళ్ల సురేశ్‌కు ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయాడు.
కొల్లాపూర్ పట్టణంలోని మినీ స్టేడియంలో నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మార్నింగ్ వాక్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బస్తాలు మోశారు. హమాలీలతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నారు. అలాగే స్థానిక ప్రజలతో మమేకమవుతూ.. ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, గాంధీ చౌరస్తా, కూరగాయలు మార్కెట్‌లో ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
షాద్‌నగర్ బైపాస్ రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందిగామ మండల కేంద్రానికి చెందిన గోవు మల్లేశ్.. మోటార్ సైకిల్ పై వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి శరీరం రెండు భాగాలుగా విడిపోయి నుజ్జునుజ్జు అయింది. కేశంపేట గేటు వద్ద రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ అమర్నాథ్గా పిలిచే సలేశ్వరం లింగమయ్య జాతర ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా 3 రోజులే జరుగుతుంది. మిగతా రోజుల్లో ఇక్కడా ఎటువంటి జన సంచారం ఉండదు. ఈనెల 22 నుంచి ఈ జాతర మొదలు కానుంది. 24న పౌర్ణమి కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలిరానున్నారు. 24న జాతర పరిసమాప్తం అవుతుంది. ఈ ఆలయంలో నల్లమల చెంచులే పూజారులుగా వ్యవహరిస్తారు.
మద్దూర్ మండలం పెదిరిపాడ్ గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. స్థానిక రైతు రామాంజనేయులుకు చెందిన బర్రె దూడపై రాత్రి దాడి చేసి చంపేసింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దూడపై చిరుత దాడిని నిర్ధారించారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని.. బోన్ వేసి చిరుతను బంధిస్తామని ఫారెస్ట్ అధికారులు చెప్పారు.
BRS అధినేత KCR జిల్లాల పర్యటనలో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు రోజులు పర్యటించనున్నారు. ఈనెల 26న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సాయంత్రం నిర్వహించే రోడ్ షోలో పాల్గొని రాత్రికి అక్కడే బస చేయనున్నారు. మరుసటి రోజు 27 సాయంత్రం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నిర్వహించే రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్ననున్నట్లు జిల్లా బీఆర్ఎస్ నేతలు తెలిపారు.
మరికల్ మండలం ఎలిగేండ్ల గ్రామానికి చెందిన రాఘవేందర్ గౌడ్ బీజేపీ కార్యకర్త. తన పెళ్లి ఆహ్వాన పత్రికపై ఆ పార్టీ నేతల చిత్రాలు ముద్రించుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఏకంగా తన పెళ్లి ఆహ్వాన పత్రికపై ప్రధాని మోదీ, MBNR బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఫొటోలు ముద్రించారు. లోక్ సభ ఎన్నికల సమయంలో వైవిధ్యంగా ముద్రించిన ఈ పెళ్లి పత్రిక స్థానికంగా సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.
ఉమ్మడి జిల్లాలో మూడోరోజు రెండు నామపత్రాలు దాఖలయ్యాయి. MBNR పరిధిలో MIM పార్టీ నుంచి షేక్ మున్నా బాషా, ధర్మ సమాజ్ పార్టీ నుంచి జి.రాకేశ్ నామపత్రాలు ఒక్కో సెట్టును రిటర్నింగ్ అధికారి రవినాయక్‌కు సమర్పించారు. NGKL పరిధిలో శనివారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ 3 రోజుల్లో మొత్తం 12మంది అభ్యర్థులు నామపత్రాలు అందించారు. ఈ నెల 21 ఆదివారం కావడంతో నామినేషన్ల ప్రక్రియ ఉండదు.
కర్ణాటకలోని రాయచూరు నుంచి అక్రమంగా చికెన్ వ్యర్థాలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. SI శ్రీనివాసరావు వివరాల ప్రకారం.. కేటి దొడ్డి మండలం ఇర్కిచేడు గ్రామ పరిసరాలలో శనివారం పోలీసులు పెట్రోల్ నిర్వహిస్తుండగా.. కర్ణాటక నుంచి బొలెరో వాహనంలో 10 కింటాళ్ళ చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్ శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.
Sorry, no posts matched your criteria.