India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✔అమ్రాబాద్: నేటి నుంచి అంజన్న స్వామి ఉత్సవాలు ప్రారంభం
✔నేడు నామినేషన్ ప్రక్రియకు సెలవు
✔కోయిలకొండ:నేటి నుంచి వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు
✔నేటి నుంచి హనుమాన్ జయంతి వేడుకలు
✔నేడు GDWL,NGKL,జడ్చర్లలో వేసవి క్రికెట్ శిబిరాలు ప్రారంభం
✔పలు నియోజకవర్గంలో పర్యటించిన MLAలు,MP అభ్యర్థులు
✔ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న తనిఖీలు
✔మక్తల్:నేటి నుంచి బీరలింగేశ్వర స్వామి ఉత్సవాలు
✔కొనసాగుతున్న ‘DSC’ శిక్షణ
వ్యవసాయ శాఖకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. శనివారం నారాయణపేట కలెక్టరెట్లో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోల్చితే ర్యాంకింగ్లో వెనకబడి ఉన్నామని, పనితీరు మెరుగుపరచుకోవాలని సూచించారు. రైతు భీమా దరఖాస్తులు పెండింగ్లో పెట్టరాదని చెప్పారు. పంటల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు.
> సివిల్స్ టాపర్ అనన్య రెడ్డికి సత్కరించిన CM రేవంత్ రెడ్డి > BJP ఎదుగుదలను కాంగ్రెస్ నేతలు తట్టుకోలేకపోతున్నారు: DK అరుణ > 22 నుంచి ‘ప్రజల వద్దకు పోలీస్’ ప్రారంభం: ఎస్పీ > NGKL: CM రేవంత్ సభ (ఈనెల 23) ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు > ఉమ్మడి జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు > NRPT: తనిఖీల్లో 25.32 లీటర్ల మద్యం పట్టివేత > ఉపాధి కూలీల పెండింగ్ డబ్బులు ఇవ్వాలి: AIPKMS
పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న టీఎస్ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్షకు ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని గద్వాల పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ టి. రామ్మోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైనవారు, ఇటీవల పరీక్షలు రాసిన వారు www.polycet.sbtet.telangana.gov.in దరఖాస్తు చేసుకోవాలని, 24న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 23న కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రంలో నిర్వహించే ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం మ.ఒంటి గంటకు తిమ్మారెడ్డిపల్లిలో వెలసిన గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ గురులోక మసంద్ (బావాజీ) జాతర బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ మండల నేతలు తెలిపారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు మోస్తరు వానలు కొనసాగుతాయని IMD వెల్లడించింది. ఇందులో భాగంగా వనపర్తి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40KM వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.
లోక్ సభ ఎన్నికల నామినేషన్ల పర్వం ఊపందుకోవడంతో అన్ని పార్టీలు బలప్రదర్శనకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవి ఈనెల 23న నామినేషన్ కార్యక్రమానికి సీఎం హాజరుకానున్నారు. ఈనెల 24న బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నామినేషన్ వేయనుండగా రోడ్ షోలో కేటీఆర్ పాల్గొననున్నారు. ఈనెల 25న బీజేపీ అభ్యర్థి భరత్ నామినేషన్ పత్రాలు సమర్పించనుండగా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ రానున్నారు.
పట్టణం పిల్లలమర్రి సమీపంలోని ఎండీసీఏ మైదానం, కోస్గి పట్టణం, జడ్చర్లలోని డిగ్రీ కళాశాల మైదానం, నాగర్ కర్నూల్ పట్టణం నల్లవెల్లి రోడ్డు చర్చి మైదానం, గద్వాలలోని డీఎస్ఏ మైదానాల్లో క్రికెట్ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆయా శిబిరాల్లో ఉదయం 5:30 గంటల నుంచి ఉ.8:30 గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు. నెల రోజులపాటు శిక్షణ శిబిరాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
BR అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థులు డిగ్రీ మొదటి సంవత్సరం సెమిస్టర్ ఫీజు మే 6వ తేదీలోపు చెల్లించాలని రీజినల్ కోఆర్డినేటర్ డా.జి.సత్యనారాయణగౌడ్ తెలిపారు. బీఏ, బీకాం విద్యార్థులు పేపరుకు రూ.150 చొప్పున చెల్లించాలన్నారు. బీఎస్సీ, కంప్యూటర్ విద్యార్థులు పేపరు రూ.150, ప్రాక్టికల్ పరీక్షలకు అదనంగా రూ.150 చెల్లించాల్సి ఉంటుందన్నారు. వచ్చే నెల 26 నుంచి పరీక్షలు ఉంటాయన్నారు.
MBNR కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి రూ.3.31 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. పలు సంస్థల్లో 90% వాటా, మహదేవ ఇన్‌ఫ్రా ఇన్నోవేషన్స్ సంస్థలో 9 వేల షేర్లు ఉన్నాయి. ఆయన వద్ద 24 తులాల బంగారం, సతీమణి పేరిట 1.5 కిలోల బంగారు ఆభరణాలు, రూ.75 లక్షల విలువైన డైమెండ్ ఆభరణాలు, రూ.7.21 లక్షల విలువైన 9కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. కుటుంబానికి 10 ఎకరాల భూమి ఉంది. సొంతిల్లు లేదు. రూ.23.42 లక్షల అప్పులున్నాయి.
Sorry, no posts matched your criteria.