India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాలో స్థానికంగా సాగు లేక.. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల కూరగాయల ధరలు మండి పోతున్నాయి. వారం క్రితం ఉన్న వాటికి ప్రస్తుతానికి ధరల్లో చాలా తేడా ఉంటోంది. కొనుగోలు చేసేందుకు వినియోగదారులు లబోదిబోమంటున్నారు. రైతులు ఎక్కువగా వరి సాగు వైపు మొగ్గు చూపడంతో కూరగాయలు అరకొర సాగవుతున్నాయి. దశాబ్దకాలం నుంచి వీటికి ప్రభుత్వం రాయితీ నిలిచిపోవడంతో రైతులు సాగుకు ముందుకు రావడం లేదు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన నవీన్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుప్తా సుఖేందర్రెడ్డి నవీన్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణిదేవి, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, మహమూద్ ఆలీ తదితరులు ఉన్నారు.
నాగర్ కర్నూల్‌లోని ఓ బట్టల దుకాణంలో బుధవారం అర్ధరాత్రి ఓ యువకుడు ఉరి వేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల.. బొందలపల్లి గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి (25) 4 నెలల క్రితం జిల్లాకేంద్రంలోని నాగనూల్ చౌరస్తాలో బట్టల దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. కాగా అదే దుకాణంలో ఉరి వేసుకుని మృతి చెందారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఖరీఫ్‌లో దాదాపు 10,58,774 మంది రైతులు 19.44,642 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుచేస్తారని వ్యవసాయశాఖ అంచనా. ఈ సీజన్లో ప్రతి ఏటా అంచనాకు మించి పంటలు సాగవుతున్నాయి. ప్రస్తుతం ఇప్పటివరకు ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో 2,12,644 ఎకరాల్లో పంటలు సాగు కాగా.. అధిక మొత్తంలో రైతులు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు పంటల సాగు ఊపందుకోనుంది.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని హామీ ఇవ్వడంతో కౌలు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏటా మహబూబ్ నగర్‌లో 2.10, నాగర్ కర్నూల్ – 3.01, నారాయణపేట- 1.71, వనపర్తి -1.68, జోగుళాంబ గద్వాల-1.63 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందుతోంది. కౌలు రైతులకు సాయం అందిస్తే ఈ సంఖ్య పెరగనుంది.
విద్యుత్ సిబ్బంది తప్పిదంతో ఓ ఇంటికి ఏకంగా రూ.21 కోట్ల బిల్లు వచ్చింది. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్‌కి చెందిన వేమారెడ్డి ఇంటికి ఈ నెల 5న విద్యుత్ సిబ్బంది రీడింగ్ తీశారు. రూ.21.47 కోట్ల బిల్లు రాగా షాకవడం వేమారెడ్డి వంతైంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లగా రీడింగ్ తీసే వ్యక్తికి అవగాహన లేకపోవడం వల్ల తప్పిదం జరగిందని సరిచేస్తామని చెప్పారని వేమారెడ్డి తెలిపారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులు HYDలో బుధవారం విడుదల చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పేపర్-1కు 17,610 మంది, పేపర్-2కు 11,935 మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్ పేపర్-1లో 15,516 మంది అభ్యర్థుల్లో 10,458 మంది (67.40 శాతం ఉత్తీర్ణత) అర్హత సాధించారు. టెట్ పేపర్-2లో 9,936 మంది అభ్యర్థుల్లో 2,941 మంది (29.59 శాతం ఉత్తీర్ణత) అర్హత సాధించారు.
ఉపాధ్యాయుల ప్రమోషన్లు, పదోన్నతుల ప్రక్రియ వడివడిగా కొనసాగుతుంది. బుధవారం సాయంత్రం నాటికి హెచ్ఎంలకు ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో స్కూల్ అసిస్టెంట్ల ప్రక్రియ ప్రారంభమైంది. స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఉర్దూ, హిందీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన సీనియార్టీ జాబితాను వెలువరించినట్లు డీఈఓ రవీందర్ పేర్కొన్నారు. జాబితాను www.palamurubadi.in వెబ్సైట్‌లో అందుబాటులో ఉందన్నారు.
గద్వాల జిల్లా ఎర్రవల్లి X రోడ్డ్ బీచుపల్లిలోని 10వ బెటాలియన్‌లో రూ.50వేలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ కమాండెంట్ నరసింహ స్వామి పట్టుబడినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. రిటైర్డ్ ఏఆర్ఎస్సై అబ్దుల్ వహాబ్ సహకారంతో ఓ కానిస్టేబుల్ మౌఖిక విచారణ జరిపి, అతనికి అనుకూలంగా వ్యవహరించడానికి రూ.50ల లంచం డిమాండ్ చేసిన కేసులో నరసింహ స్వామిని అరెస్టు చేసినట్ల ఏసీబీ పేర్కొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతిఒక్కరు కృషిచేయాలని వనపర్తి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్రీలత పిలుపునిచ్చారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శ్రీలత మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, వారిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా కృషి చేయాలని ఆమె అభిప్రాయపడ్డారు.
Sorry, no posts matched your criteria.