Mahbubnagar

News April 19, 2024

NRPT: హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

image

హత్య కేసులో నర్వ మండలం పెద్ద కడుమూరు గ్రామానికి చెందిన మొండి బాలరాజుకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 20 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ తీర్పు వెల్లడించారని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన మొండి శ్రీనును భూ తగాదాల కారణంగా 2022 జూన్ 11న బాలరాజు దాడి చేసి హత్య చేసినట్లు చేశారని.. ఈ కేసులో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

News April 19, 2024

RS ప్రవీణ్ కుమార్ ఎంపీగా పోటీ చేయడం మన అదృష్టం: నిరంజన్

image

ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేయడం మన అందరి అదృష్టమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. RS ప్రవీణ్ నామినేషన్ వేసిన అనంతరం నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని అలాంటి వ్యక్తిని పార్లమెంటుకు పంపిస్తే మన జిల్లా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు.

News April 19, 2024

MBNR: నామినేషన్ వేసిన వంశీచంద్ రెడ్డి

image

మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి రవి నాయక్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని మెట్టుగడ్డ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల పరిధిలోని కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

News April 19, 2024

కారు ఇక షెడ్డుకే: రేవంత్ రెడ్డి

image

షెడ్డు నుంచి కారు ఇక బయటకు రాదు. అది పాడైపోయిందని BRSను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. MBNRలో వంశీచంద్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిన్న BRS అధినేత కేసీఆర్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.”20 మంది MLAలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్‌ అంటున్నారు. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్‌రెడ్డి. మా MLAలను టచ్‌ చేస్తే మాడి మసైపోతావు” అని అన్నారు.

News April 19, 2024

గద్వాల: ఎర్రవల్లి రహదారిలో ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్

image

గద్వాల- ఎర్రవల్లి రహదారిలో శుక్రవారం మధ్యాహ్నం బైక్, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వెళుతున్న ద్విచక్ర వాహనదారులు గద్వాల పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News April 19, 2024

నామినేషన్ వేసిన RS ప్రవీణ్ కుమార్

image

నాగర్ కర్నూల్ పార్లమెంట్ BRS అభ్యర్థి ప్రవీణ్ కుమార్ శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి ఉదయ్ కుమార్‌కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈనెల 24న నాగర్ కర్నూల్‌లో నిర్వహించే రోడ్డు షోలో కేటీఆర్ పాల్గొనేందుకు రానున్నారు. 24న నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రవీణ్ కుమార్ మరో సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు.

News April 19, 2024

మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మసై పోతావ్: రేవంత్ రెడ్డి

image

తన‌తో 20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి నామినేషన్ సందర్భంగా రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసై పోతావ్ అంటూ కేసీఆర్‌ను హెచ్చరించారు. గతంలో కేసీఆర్‌ను కరీంనగర్ ప్రజలు తరిమి కొడితే ఈ జిల్లా ప్రజలు ఆదరించారని గుర్తు చేశారు.

News April 19, 2024

నిప్పుల గుండంగా ఉమ్మడి పాలమూరు జిల్లా

image

ఉమ్మడి పాలమూరు జిల్లా నిప్పుల గుండంగా మారింది. రికార్డు స్థాయిలో 43-44 డిగ్రీల మధ్యన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండల కేంద్రంలో కావలి వెంకటమ్మ (60) వడదెబ్బతో మృతి చెందింది. మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన నీలకంఠం (32) పిడుగుపాటుతో మృతి చెందాడు.

News April 19, 2024

MBNR, NGKL స్థానాల్లోనూ త్రిముఖ పోటీయే!

image

MBNR, NGKL పార్లమెంట్ల పరిధిలో త్రిముఖ పోరు కొనసాగనుంది. నువ్వా.. నేనా.. అన్నట్లు అన్ని గ్రామాల్లో ఇప్పటికే అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. గెలుపే లక్ష్యంగా ఒకరిపై ఒకరు విమర్శలు కురిపిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్, BJP, BRS పార్టీలు ఆయా జిల్లాలకు ఇన్‌ఛార్జీలను నియమిస్తూ క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నామినేషన్ల అనంతరం ప్రచారం జోరుగా కొనసాగనుంది.

News April 19, 2024

MBNR: CM పర్యటనకు భారీ భద్రత

image

జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ చంద్ర రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న క్రమంలో జిల్లా పోలీస్ శాఖ భారీ భద్రత ఏర్పాటు చేసింది.CM పర్యటనకు మొత్తం 1,500 మందితో పోలీసులు బందోబస్తు ఉండనున్నారు. నలుగురు ASPలు, DSPలు 15,CIలు 75,SIలు,100 ADIలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు కలిపి 1,306 మంది విధుల్లో ఉండనున్నారు.