India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నాగర్ కర్నూల్ బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ తన కుటుంబానికి రూ.33.85 లక్షల ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. ఇందులో రూ.15.86 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయన్నారు. తనపై కేసుల్లేవన్నారు. సొంత కారు లేదని, చేతిలో నగదు రూ.2 లక్షలు ఉన్నాయని, బైక్, 15 తులాల బంగారంతో కలిపి రూ.17.99 లక్షల చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. కల్వకుర్తి మండలం గుండూరులో 7.02 ఎకరాల వ్యవసాయ భూమి ఉందన్నారు.
BJP అభ్యర్థి డీకే అరుణ గురువారం నామినేషన్ దాఖలు చేయగా.. అఫిడవిట్ వివరాలు సమర్పించారు. చరాస్తుల విలువ-రూ.3,21,73,518, స్థిరాస్తులు-రూ.3,10,00,000, బ్యాంకు రుణాలు, ఇతర అప్పులు- లేవు, ప్రస్తుతం దగ్గర ఉన్న నగదు- రూ.1,50,000, అరుణ భర్త భరతసింహారెడ్డి ఆస్తులు: చరాస్తుల విలువ- రూ.23,26,16,353 స్థిరాస్తులు- రూ.37,17,80,000, అప్పులు-1,38,79,619, ప్రస్తుతం ఉన్న నగదు-రూ.20,000,00 ఉన్నట్లు తెలిపారు.
మహబూబ్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి, నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్, పలు స్వతంత్ర అభ్యర్థులు కూడా శుక్రవారం నామపత్రాలు దాఖలు చెయ్యనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
ఉమ్మడి జిల్లాలో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీగా ప్రవర్తన నియమావళి అమలు అవుతోంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో.. రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. ప్రవర్తన నియమావళికి లోబడి పార్టీలు అభ్యర్థులు నడుచుకోవలసి ఉంటుంది. ప్రచార సమయంలో అభ్యర్థుల ఖర్చుల వివరాలను అధికారులు షాడో బృందాల ద్వారా నమోదు చేస్తున్నారు. ఒకవేళ గీత దాటితే చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది.
బిజినేపల్లిలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. పోలీసుల కథనం మేరకు.. బిజినేపల్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఓ టీచర్ స్థానిక ఓ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో అదే కాలనీలో మానసిక దివ్యాంగ యువతి(19) నిస్సహాయతను ఆసరాగా చేసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న యువతి సోదరులు సదరు టీచర్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నేడు నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. MBNRలోని మెట్టుగడ్డ నుంచి ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ వెయ్యనున్నారు. అనంతరం గడియారం చౌరస్తాలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ ముఖ్యనేతలు పాల్గొని ప్రసంగించనున్నారు. CM పర్యటన కోసం జడ్చర్ల, MBNR ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మాజీ ఎంపీ మంద జగన్నాథం బీఎస్పీలో చేరారు. ఆయన నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీఎస్పీ నుంచి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే రాజకీయంగా ఏ పార్టీకి నష్టం జరుగుతుందనే చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో మొలైంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఆ సామాజికవర్గం ఓట్లలో చీలిక వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీనిపై మీ కామెంట్..
NRPT జిల్లాలో గ్రామాలలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు అర్హత గల వ్యాయమ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకటేష్ తెలిపారు. మే 1 నుంచి 31 వరకు 14 ఏళ్ళలోపు బాలబాలికలకు క్రీడల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. వ్యాయమ ఉపాధ్యాయులు సంబందిత ధ్రువపత్రాలతో ఈనెల 23లోగా జిల్లా క్రీడల అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో తొలిరోజు నామినేషన్ల ప్రక్రియ ఈ విధంగా జరిగింది. మహబూబ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ రెండు నామినేషన్లు వేయగా.. ఇంటిపెండెంట్‌గా ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి, బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ నామినేషన్ వేశారు.
✔ఉమ్మడి జిల్లాలో భానుడి భగభగలు.. ఎల్లో హెచ్చరికలు జారీ
✔WNPT:MLA ఎదుట కాంగ్రెస్ నేత ఆత్మహత్యాయత్నం
✔నేడు నామినేషన్ వేసిన డీకే అరుణ, భరత్ ప్రసాద్, మల్లు రవి
✔బిజినేపల్లి:రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
✔బీఫామ్ అందుకున్న ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి,BMP అభ్యర్థి విజయ్
✔తాగునీటి పై అధికారుల ఫోకస్
✔SDNR:పేలుడు పదార్థాలు పట్టుకున్న పోలీసులు
✔కాంగ్రెస్‌ను కాపాడుకునేందుకే ఆత్మహత్యాయత్నం: గణేష్ గౌడ్
Sorry, no posts matched your criteria.