India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
♥UPSCలో ర్యాంకు సాధించిన వారికి..KTR, పలు నేతల అభినందనల వెల్లువ
♥సర్వం సిద్ధం.. రేపటి నుంచి పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
♥ఉమ్మడి జిల్లాలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు.. పలుచోట్ల శోభాయాత్రలు
♥MBNR:ఎకో పార్కులో యువతి మృతదేహం
♥NGKL:రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
♥NRPT:’డాక్టర్ల నిర్లక్ష్యంతో గర్భిణి మృతి’
♥BSPలో చేరిన మంద జగన్నాథం
♥NGKL:రామాలయంలో దొంగలు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
మహబూబ్నగర్ పట్టణంలోని ఎకో పార్కులో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. డెడ్‌బాడీ కాలిపోవడంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. పార్కు సిబ్బంది సమాచారంలో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. సమీపంలోని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆమెకు సుమారు 20ఏళ్లు ఉంటాయని భావిస్తున్నారు. మృతురాలికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. బుధవారం అత్యధికంగా గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 43.9 డిగ్రీలు నమోదైంది. వనపర్తి జిల్లా పానగల్లో 43.7, మహబూబ్నగర్ జిల్లా సల్కరిపేటలో 43.2, నాగర్ కర్నూలు జిల్లా కోడేరులో 43.0, నారాయణపేట జిల్లా ధన్వాడలో 42.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలు ఇంకా పెరిగే అవకాశం ఉందని.. ప్రజలు వడదెబ్బకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
తిమ్మాజిపేట మండలం గోరిటలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎండీ అజీద్, అదే గ్రామానికి చెందిన ఎండీ మతీన్, ఎండి అఫీజ్‌ల మధ్య భూ తగాదాలు ఉన్నాయి. గత రెండు రోజుల క్రితం దాడి చేయగా బాధితుడు అజీజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ ఏకంగా కారుతో ఢీ కొట్టి కర్రలతో విచక్షణా రహితంగా దాడికి దిగి హత్యకు యత్నించారు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
తిమ్మాజిపేట మండలం గోరిటలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎండీ అజీద్, అదే గ్రామానికి చెందిన ఎండీ మతీన్, ఎండి అఫీజ్‌ల మధ్య భూ తగాదాలు ఉన్నాయి. గత రెండు రోజుల క్రితం దాడి చేయగా బాధితుడు అజీజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ ఏకంగా కారుతో ఢీ కొట్టి కర్రలతో విచక్షణ రహితంగా దాడికి దిగి హత్యకు యత్నించారు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడింది. పోలీసుల వివరాలు.. సంగారెడ్డి జిల్లా ఆరుట్లకు చెందిన రాములు 2019లో చేవెళ్ల బస్టాండులో ఉన్న గండీడ్ మండలం నంచర్లకు చెందిన అంజులమ్మను బైక్ పై ఎక్కించుకున్నాడు. పటాన్చెరు మండలం లక్డారం శివారులో ఆమెను హత్య చేసి నగలు ఎత్తుకెళ్లాడు. ఈఘటనపై తాజాగా సంగారెడ్డి కోర్టు నిందితుడికి శిక్ష విధించింది. నిందితుడు 2003-19లో 10 హత్యలు, చోరీలు చేసినట్లు విచారణలో తేలింది.
పాలమూరులో ఒకవైపు సూర్యుని ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి.. మరోవైపు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య సాగుతున్న పరస్పర ఆరోపణలతో నెలకొంటున్న ఉత్కంఠ భరిత వాతావరణంతో అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, ఇతర నేతలు అంతా BJP, BRSలపై, పార్టీ అభ్యర్థులపై ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటే.. అదే స్థాయిలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విరుచుకుపడుతోంది.
మహబూబ్ నగర్ పట్టణం ఎనుగొండలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామిని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకున్నారు. స్వామి వారికి పూజలు నిర్వహించారు. అనంతరం పురోహితులు తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీరామనవమి వేడుకలకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రామాలయాలు ముస్తాబయ్యాయి. భక్తులకు కావాల్సిన అన్ని రకాల వసతులను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. రాములోరి కళ్యాణం అనగానే మనకు గుర్తుకొచ్చే పాట ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’. ఈ గీతాన్నిమైకుల ద్వారా వినిపిస్తున్నారు. MBNR జిల్లాలోని పలు మండలాల్లో ఏ వీధిలో చూసిన ‘జై శ్రీరామ్’ నామస్మరణలే వినిపిస్తున్నాయి. మరి మీ ఏరియాలో ఫేమస్ టెంపుల్ ఏంటి? కామెంట్ చేయండి.
BJP లోక్‌సభ అభ్యర్థి డీకే అరుణ ఈనెల 18న ఉ.11గం.కు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, ఉ.9గం.కు కేంద్ర మంత్రితో కలిసి డీకే అరుణ పిల్లల మర్రి రహదారిలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారని, అక్కడి భారీ ర్యాలీతో నామినేషన్ వెయ్యనున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.