Mahbubnagar

News April 2, 2024

అలంపూర్ చౌరస్తాలో యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. జాతీయ రహదార- 44పై అలంపూర్ చౌరస్తాలో ఫ్లై ఓవర్ పై వెళ్తున్న బైక్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానాన్ని పరిశీలించారు. కాగా ఈ ప్రమాదం, మృతుడికి సంబందించిన వివరాలు తెలియాల్సి ఉంది.

News April 2, 2024

కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు: డీకే అరుణ

image

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు తాను జాతీయహోదా తీసుకురాలేదని కాంగ్రెస్ నాయకులు ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు. నారాయణపేటలో ఆమె మాట్లాడుతూ.. పాలమూరు పార్లమెంటులోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే తాను మంత్రిగా ఉన్నప్పుడే పాలమూరు ప్రాజెక్టు సర్వే పనులు ప్రారంభానికి కృషిచేశానని అన్నారు. కాంగ్రెస్ నేతలు అవగాహన లేని మాటలు మానుకోవాలన్నారు.

News April 2, 2024

బీచుపల్లి: కృష్ణానదిలో నీరు తగ్గడంతో చేపల మృత్యువాత

image

ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వేడి తీవ్రతకు జనం ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటే మరో పక్క కృష్ణానదిలోని చిన్నచిన్న నీటి మడుగుల్లో నీరు తగ్గి పోవడంతో చేపలు చనిపోతున్నాయి. బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణాలోని గుర్రంగడ్డ, నిజాంకొండ తదితర ప్రాంతాల్లోని నీటి మడుగుల్లో చేపలు మృత్యువాత పడుతున్నాయి. కృష్ణా పరిసరాలు, చెరువుల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News April 2, 2024

MBNR: డబ్బులు తీసుకెళ్తున్నారా.. ఇది తప్పనిసరి!

image

ఎన్నికల కోడ్ ఉన్నందున శుభకార్యాల వేళ నగదు వెంట తీసుకెళ్లేవారు పెళ్లి కార్డులు, ఆ నగదు ఏ బ్యాంకు అకౌంట్ నుంచి డ్రా చేశారు..? ఎంత డ్రా చేశారు..? ఏం కొనుగోలు చేయబోతున్నారు..? వంటి వాటికి ఆధారాలు చూపించాలని ఉమ్మడి జిల్లా పోలీసులు పేర్కొంటున్నారు. ఆస్పత్రులకు వెళ్లేవారు పేషెంట్ వివరాలు వెంట తీసుకెళ్లాలి. తర్వాత సరైన ఆధారాలు చూపించి నగదును తిరిగి పొందవచ్చని వారు సూచిస్తున్నారు.

News April 2, 2024

MBNR: విపరీతమైన ఎండలు.. వైద్యుల సూచనలు

image

✓ ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.
✓ అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్లొద్దు. బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
✓ శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్, అధిక ప్రొటీన్, ఉప్పు, కారం, నూనె ఉండే ఆహారాన్ని తీసుకోవద్దు.
✓ బయటకు వెళ్తే తెలుపు రంగు దుస్తులను ధరించండి.

News April 2, 2024

MBNR: అత్యవసరమైతేనే బయటకు రండి: కలెక్టర్లు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా చిన్నపిల్లలు, వృద్ధులు పలు జాగ్రత్తలు పాటించాలని ఉమ్మడి జిల్లా కలెక్టర్లు అన్నారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, ఎండలో తిరగాల్సి వస్తే గొడుగు, టోపీ వినియోగించాలి. ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే ఆస్పత్రికి తరలించాలని అన్నారు.

News April 2, 2024

వనపర్తి: అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి

image

ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన పెబ్బేర్ మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై సాయి ప్రసాద్ రెడ్డి వివరాలు.. మండల కేంద్రంలోని పాత చౌడేశ్వరి ఆలయ సమీపంలో నివసిస్తున్న సరస్వతి (29) ఇంట్లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మృతిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

News April 2, 2024

MBNR: ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పలుచోట్ల వరి కోతలు షురూ కావడంతో సోమవారం మొత్తం 122 కొనుగోలు కేంద్రాలను పౌరసరఫరాల శాఖ ప్రారంభించింది. మరో 684 ప్రారంభించాల్సి ఉంది. మహబూబ్ నగర్ 1.11 లక్షలు, నాగర్ కర్నూల్-1.09, నారాయణ పేట-1.15, వనపర్తి-0.91, జోగులాంబ గద్వాల-0.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారుల అంచనాతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.

News April 2, 2024

MBNR: దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తుంది: డీకే అరుణ

image

దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తోందని, మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావటం ఖాయమని భాజపా MBNR ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. సోమవారం మిడ్జిల్, జడ్చర్ల పట్టణాల్లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాయని, ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిసి ఈసారి ఎన్నికల్లో భారీ మెజార్టీ వచ్చేలా బూత్ స్థాయి కార్యకర్తలు కృషిచేయాలని కోరారు.

News April 2, 2024

MBNR: మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి: మాజీ మంత్రి

image

రాష్ట్రంలో, జిల్లాలోని ముస్లీం, మైనార్టీల సంక్షేమానికి కృషి చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. మసీదుల అభివృద్ధితో పాటు దర్గాలో అభివృద్ధికి కూడా అధిక శాతం నిధులు మంజూరు చేశానని గుర్తు చేశారు. మైనార్టీ గురుకులాలు, పాఠశాలలకు సొంత భవనాల నిర్మాణం కోసం 128 కోట్లు కేటాయించానని, 1 కోటి నిధులతో హజ్ హౌస్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు.